రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ ట్రైన్ టికెట్‌ను ఇతరుల పేరు మీదకు సులభంగా మార్చుకోవచ్చు.!!
రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని నెల లేదా కొన్ని రోజుల ముందుగానే ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు. IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో ఈ సదుపాయం ఉంది. అయితే కొంతమంది తమ జర్నీకి ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్‌ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి టికెట్ కేటాయిస్తారు.
అయితే మీరు ఇక్కడ జర్నీ రద్దయినప్పుడు టికెట్(Train Ticket Name Change Process) క్యాన్సిల్ చేసుకునే అవకాశం మీకు ఉంది. కానీ దానిని మీరు వేరొకరి పేరు మీదకు మార్చలేరు. అయితే ఇప్పుడు భారతీయ రైల్వే ఈ అవకాశం కూడా మీకు కల్పిస్తుంది. మీకు రిజర్వ్ చేసిన టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు. అదెలా అంటే..

భారతీయ రైల్వే ఇప్పుడు మీ పేరు మీద ఉన్న టిక్కెట్‌ను మరొకరికి బదిలీ చేయడానికి ఒక ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. కాగా ఇది సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల పేర్లపై మాత్రమే బదిలీ అవుతుంది. మీరు ప్రయాణించే రైలులో మీ పేరు మీద ఉన్న టిక్కెట్‌ను వేరొకరి పేరు మీద మార్చుకోవాలంటే, మీరు రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు పేరును కొత్త ప్యాసింజర్ పేరుతో మార్చడానికి దరఖాస్తు చేసుకోవాలి.
రిజర్వేషన్ టికెట్ పేరు మార్చుకోవాలనుకునే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా పండుగ ఏదైనా ఈవెంట్ సందర్భంగా ప్రయాణీకుల కోసం టికెట్ బుక్ చేసినట్లయితే, పేరు మార్పు దరఖాస్తును కనీసం 48 గంటల ముందుగా సమర్పించాలి. NCC అభ్యర్థులు కూడా ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. పేరు మార్చుకున్న వ్యక్తి ప్రయాణ సమయంలో తన అధికారిక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.

కన్ఫామ్‌డ్ టికెట్‌పై పేరు మార్చుకోవాలనుకునేవారు పేరు మార్పు ప్రాసెస్ కోసం ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ముందుగా మొదటి ప్రయాణికుడి పేరు మీద ఉన్న టికెట్ ఒరిజినల్ టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దానితో పాటు సమీపంలోని రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లాలి.
అలాగే తమ పేరు మార్చుకోవాలనుకునే వారు తమ ఐడీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ మొదలైన వాటి కాపీని తీసుకోవాలి. పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ మూడింటిని రిజర్వేషన్ కౌంటర్‌లో సమర్పించాలి.

ఇవన్నీ తనిఖీ చేసిన తర్వాత రిజర్వేషన్ కౌంటర్‌లోని ఉద్యోగి.. కొత్త టికెట్‌ను జారీ చేస్తారు. ఈ విధానం తర్వాత మొదటి వ్యక్తి ఈ టికెట్‌పై ప్రయాణించలేరు. ఆ టిక్కెట్‌పై కొత్త వ్యక్తి మాత్రమే ప్రయాణించగలరు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పేరు మార్పు విధానం వర్తిస్తుందని గుర్తించాలి.
భారతీయ రైల్వే టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణించే చాలా మందికి ఈ ఆప్షన్ ఒకటి ఉందని తెలియదు. చాలా మంది ప్రయాణం చేయలేక మరో కుటుంబ సభ్యులు ప్రయాణించాల్సిన పరిస్థితిలో టికెట్ రద్దు చేసి కొత్త టికెట్ బుక్ చేస్తున్నారు. లేదా బస్సు వంటి ఇతర మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నారు.

భారతీయ రైల్వే శాఖ మీకు బదులుగా మీ కుటుంబ సభ్యులకు ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించినందున ఇకపై మీరు టికెట్ రద్దు చేసుకుని కొత్త టికెట్ రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా పాత టికెట్, గుర్తింపు కార్డు, మీకు బదులుగా ప్రయాణించే వారి వివరాలతో సంబంధిత రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా 24 గంటల ముందుగానే మీ పేరును మార్చుకోవచ్చు.



Click it and Unblock the Notifications








