సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

భారతదేశంలో నిర్మించిన ప్రతిష్టాత్మక అటల్ టన్నల్ ను ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసినదే. సుమారు 10,000 అడుగుల ఎత్తులో నిర్మించబడిన ఈ అటల్ టన్నల్ ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గంగా ఖ్యాతి దక్కించుకోనుంది. దేశంలోనే అత్యంత క్లిష్టమైన రోడ్ నెట్‌వర్క్ కలిగి ఉన్న ప్రాంతంలో ఇది ప్రయాణీకుల ప్రయాణాన్ని సుగమం చేస్తుంది మరియు ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది.

ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ మనకు అందించిన ఆశ్చర్యాలలో ఒకటి ఇలాంటి సొరంగ మార్గాలు, భుగర్భాన్ని చీల్చుకుంటూ పోయే సొరంగ మార్గాల్లో ప్రయాణం చాలా సరదా మరియు అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. నిజానికి సొరంగాలలో కారును నడపడం ఒక ఉత్తేజకరమైన అనుభవం. అయితే, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. మరు సొరంగ మార్గాలలో సురక్షితంగా ఎలా ప్రయాణించాలో ఈ కథనంలో తెలుసుకుందా రండి.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

ఎల్లప్పుడూ హెడ్‌లైట్లను ఆన్‌లో ఉంచండి

నిజానికి ఇలాంటి పొడవైన సొరంగ మార్గాల్లో రోడ్డుకి ఇరువైపులా విద్యుత్ దీపాలు ఉన్నప్పటికీ, అవి తగినంత కాంతిని ఇవ్వకపోవచ్చు లేదా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అవి పనిచేయకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో సొరంగ మార్గం చీకటిగా ఉంటుంది. కాబట్టి, సొరంగ మార్గంలోకి ప్రవేశించేటప్పుడు, మీ కారు హెడ్‌లైట్లు ఆన్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

ఒకవేళ మీ కారులో ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఫీచర్ ఉన్నట్లయితే, అది ఎంగేజ్ చేయబడి ఉందో లేదో సరిచూసుకోండి. సొరంగ మార్గంలోని విద్యుత్ దీపాల వెలుతురు ఎంత ప్రకాశవంతంగా ఉన్నప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కారు హెడ్‌లైట్లను ఆఫ్ చేయవద్దు. ఇది మీకు ఎదురుగా వస్తున్న వాహనాలు మీ వాహనాన్ని గుర్తించేందుకు, తద్వారా అప్రమత్తమయ్యేందుకు సహకరిస్తుంది.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

ఇతర వాహనాలకు సురక్షితమైన దూరంలో నడపండి!

సాధారణ రోడ్లపై ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, దానిని పరిష్కరించేందుకు లేదా ప్రమాదం జరిగిన చోటుకు చేరుకునేందుకు అనేక మార్గాలు ఉంటాయి. కానీ, సొరంగ మార్గాలలో ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, సొరంగ మార్గాలలో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకూ ప్రమాదాలకు దూరంగా ఉండేలా చూసుకోండి. మీ వాహనానికి ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేసినట్లయితే, మీ ఆ వాహనాన్ని ఢీకొనకుండా సురక్షితంగా ఉంచడంలో ఇది సహకరిస్తుంది.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

మీరు సొరంగాలలో సురక్షితంగా డ్రైవింగ్ చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి మరొక ఉత్తమ మార్గం ఏంటంటే, మీ ముందున్న వాహనం నుండి మీ వాహనం సురక్షితమైన దూరంలో ప్రయాణించేలా చూసుకోవడం. మీరు ముందు ఉన్న కారు నుండి కనీసం 3-సెకన్ల స్టాపింగ్ దూరాన్ని మెయింటెయిన్ చేయాలి. ఒకవేళ, మీరు అలాంటి రోడ్లపై కొత్తగా ప్రయాణిస్తున్నట్లయితే, మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే, మీకు రోడ్డుపై రాబోయే బ్లైండ్ మలుపులు లేదా రోడ్డు స్థితిగతుల గురించి అవగాహన ఉండకపోవచ్చు.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడం మానుకోండి!

పైన చెప్పిన 3-సెకన్ల స్టాపింగ్ రూల్ మీకు మాత్రమే కాదు, మీ వెనుక వస్తున్న వాహనాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి, మీరు ఎప్పుడైనా అకస్మాత్తుగా బ్రేక్ వేసినట్లయితే, మీ వెనుక వచ్చే వాహనం అదే సమయంలో రెస్పాండ్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు, ఫలితంగా అది మీ వాహనాన్ని ఢీకొనే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి, సొరంగ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు నిర్ధిష్టమైన వేగాన్ని పాటిస్తూ, ఎమెర్జెన్సీ లేదా అకస్మాత్ బ్రేకులను ఉపయోగించడం మానుకోండి.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

అనవసరంగా లైన్లు మారకండి!

సొరంగ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు ఒకే లేన్‌లో ప్రయాణించండి. అనవసరంగా లైన్లు మారడం మానుకోండి, ఇది అనవసరమైన ప్రమాదాలకు కారణం కావచ్చు. చాలా మంది ఏ కారణంగా లేకుండా రోడ్డుపై అటూ ఇటూ లైన్లు మారుతూ డ్రైవ్ చేస్తుంటారు. ఇది మీ ముందు వచ్చే వాహనాల డ్రైవర్లనే కాకుండా, వెనుక నుండి వస్తున్న వాహనాల డ్రైవర్లను కూడా ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. అవసరమైన సందర్భాల్లో మాత్రమే లైన్లు మారండి, ముందున్న వాహనాలను ఓవర్‌టేక్ చేయడం తగ్గించుకోండి.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

నిజానికి, ఇది కేవలం సొరంగ మార్గాల్లోనే కాకుండా సాధారణ రోడ్లపై కూడా అనుసరించాలి. ఒకవేళ, ఏ కారణం చేతనైనా మీరు లేన్లను మార్చవలసి వస్తే, ఆ విషయాన్ని ఇండికేటర్ల సాయంతో మీరు ఇతర వాహనదారులకు ముందుగానే తెలియజేయాలి. లేన్ మారబోతున్నట్లు టర్న్ ఇండికేటర్‌లను ఉపయోగించి ఇతరులకు తెలియజేయండి. ఇరుకుగా మరియు చీకటిగా ఉండే టన్నెల్స్‌లో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు లేన్‌లను మార్చకపోవడమే మంచిది.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

తక్కువ ఇంధనంతో కారు నడపకండి!

మీరు సుధీర్ఘమైన సబ్‌వేలలో (పొడవైన సొరంగ మార్గాలలో) కారు నడపబోతున్నారని, మీకు ముందే తెలిసినట్లయితే, మీరు నడిపే వాహనంలో సదరు సొరంగ మార్గాన్ని అధిగమించేందుకు అవసరమైన ఇంధనం మీ వాహనంలో ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోండి. ఎందుకంటే, సొరంగ మార్గాల్లో పెట్రోల్ బంకులు ఉండవు, ఒకవేళ సొరంగమార్గ మధ్యంలో మీ వాహనంలోని ఇంధనం ఖాలీ అయి ఆగిపోతే, ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఎల్లప్పుడూ తగిన ఇంధనంతోనే సొరంగ మార్గంలోకి ప్రవేశించండి.

సొరంగ మార్గాలలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా?: చిట్కాలు

టన్నెల్స్‌లో కారు పార్క్ చేయవద్దు!

ముందు చెప్పినట్లుగా సొరంగ మార్గంలో కారు నడపడం అనేది ఓ ఉత్తేజకరమైన అనుభవం. ఈ ప్రయాణాన్ని కళ్లతో మరియు మనసుతో ఆస్వాదించాలే కానీ, మార్గం మధ్యంలో కారు నిలిపివేసి, సెల్ఫీల కోసం ప్రమాదాలను కొనితెచ్చుకోకూడదు. టన్నెల్స్‌లో అనవసరంగా కారును పార్క్ చేయడం వలన అనవసరమైన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సొరంగ మార్గాల్లో వాహనాలను పార్క్ చేయాలి, ఇలా పార్క్ చేసినప్పుడు తప్పనిసరిగా వార్నింగ్ లైట్స్ మరియు రిఫ్లెక్టర్స్ ను ఉపయోగించి ఇతర వాహనాలను అప్రమత్తం చేయాలి.

Most Read Articles

English summary
Tunnel driving tips for your safety
Story first published: Saturday, November 20, 2021, 17:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X