గుర్తుపెట్టుకోండి.. కారు కొనే బెస్ట్ సమయం ఇదే.. ఇప్పుడు కొంటే తక్కువ బడ్జెట్‌లో సూపర్ కార్లు సొంతం అవుతాయి
ఇండియాలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ఇంటికి ఒకటి కంటే ఎక్కువ బైకులు, కార్లు ఉంటున్నాయి. దేశ జనాభా పెరుగుతున్న విధంగానే వీటి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్లతో వాహనాలు వస్తుండటంతో వినియోగదారులు తమకు అనుకూలమైన బడ్జెట్ ధరలోనే మోడళ్లను ఎంచుకుంటున్నారు. అయితే పండుగల సమయంలో చాలా మంది కొత్తగా కార్లు, బైకులు ఇతర వాహనాలను తమ ఇంటికి తెచ్చుకుంటారు. ఈ టైంలో కంపెనీలు పలు తగ్గింపులు అందించడం వలన పండుగ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలు నమోదు అవుతుంటాయి. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని మరో విషయం ఉంది. అదేంటంటే.. పండుగల సమయంతో పాటు ఏడాది ముగింపులో కూడా చాలా కంపెనీలు పలు డిస్కౌంట్‌లు, ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను అందిస్తుంటాయి.
పాత ఏడాదికి ముగింపు పలుకుతూ, కొత్త ఏడాదిలో కొత్త వాహనాలను నడపాలనే ఆలోచనతో ఏడాది చివరి నెలల్లో కొందరు తమ పాత వాహనాలను మార్చుకుని కొత్త వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింస్తుంటారు. అలాగే కంపెనీలు కూడా తమ స్టోర్‌లలో ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోడానికి కొత్త ఏడాదికి ముందు నవంబర్, డిసెంబర్ సమయంలో ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తుంటాయి.

సాధారణంగా కొత్త కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఈ రెండు నెలలు బెస్ట్ ఆప్షన్. పన్ను ప్రయోజనాలు, ప్రత్యేక ఆఫర్‌లు, ఎక్చ్సేంజ్ డిస్కౌంట్స్ వంటివి నవంబర్, డిసెంబర్‌లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. పాత వాటిని మార్చుకుని కొత్త వాటిని కొనుగోలు చేయడానికి ఇది అత్యుత్తమైన సమయం. వినియోగదారుల డబ్బులు కూడా చాలా వరకు ఆదా అవుతాయి.
అందుకే చాలా మంది ధనవంతులు కొత్త కార్లను ఎక్కువగా ఏడాది ముగింపు సమయంలోనే కొనుగోలు చేస్తుంటారు. సాధారణ మధ్యతరగతి వినియోగదారులకు ఈ విషయం తెలియక ఇతర రోజుల్లో ఎక్కువ డబ్బులు వెచ్చించి కొత్త వాటిని ఇంటికి తీసుకెళ్తుంటారు. ఏడాది చివరల్లో ఆటోమొబైల్ డీలర్లు కొత్త ఏడాదికి కొత్త అప్‌డేటెడ్ వాహనాలను షోరూమ్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు.

ముఖ్యంగా కొత్త ఏడాదిలో వాహనాల ధరల్లో కూడా మార్పులు రావచ్చు. ఒక వేళ ధరలు తగ్గినట్లయితే పర్వాలేదు, కానీ ధర పెరిగితే మాత్రం కొత్త ఏడాదిలో మరిన్ని ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వాహనాలను కొనడం ద్వారా మీరు అనుకున్న బడ్జెట్‌లోనే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పాత కార్లను అమ్ముకోవడానికి కూడా ఇది బెస్ట్ సమయం.
పాత వాటిని ప్రతిసారి రిపేర్ చేయడం కంటే కూడా తక్కువ ధరలో అయిన అమ్మడానికే కొందరు ధనవంతులు ఆలోచన చేస్తారు. దీంతో వీరి దృష్టిని ఆకర్షించడానికే ఆటోమొబైల్ డీలర్లు ప్రత్యేకంగా పాత కార్లను తీసుకుని తక్కువ ధరలో కొత్త వాటిని అందిస్తారు. కస్టమర్‌లను ఆకర్షించే ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు ఈ రెండు నెలలు అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. దీంతో ఇప్పుడు కూడా కొంతమంది డీలర్లు పాత కార్లను తక్కువ ధరలో తీసుకుని కొత్త వాటిని అందిస్తున్నారు. వారి పాత కారును విక్రయించాలని భావించే వారి కోసం కొన్ని ఆన్‌లైన్ సైట్‌లలో కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
పాత ఏడాదికి ముగింపు పలుకుతున్నట్లుగా తమ పాత కార్లకు ఎండ్ కార్డ్ పెట్టి కొత్త వాటిని ఈ రెండు నెలల్లో కొనుగోలు చేసి రాబోయే కొత్త ఏడాదిలో వాటిలో కుటుంబంతో కలిసి హాయిగా ప్రయాణించండి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లు, తగ్గింపుల వివరాలను తెలుసుకోడానికి షోరూమ్‌లలో సంప్రదించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








