కారు ఇంటీరియర్‌ను క్లీన్ చేయడం ఎలా..: చిట్కాలు

Car Interior
చాలా వరకూ వాహన యజమానులు తమ కార్ ఇంటీర్స్‌ను శుభ్రం చేయించుకునేందుకు కార్ క్లినిక్‌లకు గానీ.. లేదా మెకానిక్‌ల దగ్గరకు కానీ వెళ్లి జేబులు ఖాలీ చేయించుకుంటుంటారు. అయితే.. కార్ ఇంటీరియర్స్‌ను తామే స్వయంగా, సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుంటే.. డబ్బులు వృధా చేసుకోవడాన్ని అరికట్టడమే కాకుండా.. మంచి టైమ్-పాస్ కూడా అవుతుంది. ఉద్యోగాలు చేసేవారు శని, ఆది వారాల్లో పగలు గుర్రుపెట్టి నిద్ర పోకుండా తమ సమయాన్ని ఇలా వాడుకుంటే.. తమ వాహనాన్ని తామే జాగ్రత్తగా శుభ్రం చేసుకోవడంతో పాటు తమకు ఓ మంచి వ్యాపకం లభించినట్లు అనిపిస్తుంది. మరి కారు ఇంటీరియర్స్‌ను ఎలా క్లీన్ చేయాలో తెలిపే కొన్ని చిట్కాలు మీ కోసం..

1. ముందుగా కారులోని అన్ని ఫ్లోర్ మ్యాట్స్‌ను బయటకు తీసేసి... వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే దానితో దుమ్ము దులిపి పక్కన పెట్టుకోండి. వ్యాక్యూమ్ క్లీనర్ లేని వాళ్లు మెత్తని బ్రష్‌ను వాడుకోవచ్చు. ఫ్లోర్ మ్యాట్‌లపై దుమ్ము, మురికి మరీ ఎక్కువగా ఉందనిపిస్తే.. సర్ఫ్ వాటర్‌లో (రబ్బరు ఫ్లోర్ మ్యాట్‌లను) వాటిని కాసేపు నానబెట్టి స్క్రబ్‌ప్యాడ్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే కారు లోపలి భాగాన్ని కూడా వ్యాక్యూమ్ క్లీనర్ సాయంతో సీట్లపై నుంచి ప్రారంభించి, పెడల్స్‌ చూట్టూ, సీట్ల కిందిభాగం, సెంట్రలో కన్సోల్, ఫ్లోర్‌లను జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.

2. వ్యాక్యూమ్ క్లీనర్‌కు సాఫ్ట్ బ్రష్‌ను అమర్చి డ్యాష్‌బోర్డ్ (స్టీరింగ్ అమర్చి బడి ఉండే భాగం)ను శుభ్రం చేసుకోవాలి. ఈ సాఫ్ట్ బ్రష్‌తో లెథర్ సీట్లు, కారు స్టీరియోలను చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేటప్పుడు డ్యాష్‌బోర్డ్‌కు ఉన్న రంధ్రాలు, బటన్స్‌ వంటి సున్నితమైన ప్రాంతాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి.

3. సీట్లు, డోర్లను క్లీన్ చేసేటప్పుడు స్ప్రే క్లీనర్‌లను ఉపయోగించండి (ముందుగా సీట్ కవర్లను తొలగించుకోవాలి). సీట్లు మరీ మురికిగా ఉంటే.. స్ప్రే క్లీనర్లకు బదులు ల్యాండ్రీ డిటర్జెంట్‌ను వాడుకోవచ్చు. కొద్దిపాటి వేడినీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్‌ను వేసి మెత్తని స్పాంజ్ లేదా బట్టతో క్లీన్ చేసుకోవచ్చు. అనంతరం కారు లోపలి భాగాన్ని పూర్తిగా ఆరనివ్వాలి. కారులో ఎలాంటి తేమ కానీ, నీరు కానీ నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించండి. నీరు నిల్వ ఉంటే కారు డోర్లు, అడుగు భాగం తుప్పు పట్టే ఆస్కారం ఉంది.

4. కార్పెట్‌ను క్లీన్ చేయడంలో కూడా ఇదే విధానాన్ని పాటించాలి. కార్పెట్లను నీటిలో నానబెట్టకూడదు. ఇక డ్యాష్‌బోర్డ్ క్లీనింగ్ దగ్గరకు వచ్చేద్దాం. డ్యాష్‌బోర్డ్‌ను అలాగే కారులోని ఇతర ప్లాస్టిక్ భాగాలను మల్టీ-పర్పస్ క్లీనర్‌ మరియు తడి బట్టతో తుడుచుకోవాలి. ఇది ఆరిన తర్వాత పొడి బట్టతో మరోసారి శుభ్రం చేయాలి. ఇది తళ తళా మెరవాలంటే ప్లాస్టిక్ పాలిష్‌ను వాడుకోవచ్చు.

5. ఇప్పుడు కారు అద్దాలను క్లీన్ చేద్దాం. కారు అద్దాలను లోపల, బయట సుతిమెత్తని బట్టతో గ్లాస్ క్లీనర్ స్ప్రేను ఉపయోగించి క్లీన్ చేసుకోవాలి. అద్దాలను క్లీన్ చేసేటప్పుడు గరుకుగా లేదా ర్యాష్ ఉండే బట్టను వాడకూడదు, ఇలా చేస్తే కారు అద్దాలపై గీతలుపడే ఆస్కారం ఉంది. ఇక చివరిగా.. కారు లోపల ఎయిర్ ఫ్రెషనర్ వంటి మంచి సువాన కలిగిన స్ప్రేను స్ప్రే చేసుకుంటే కారు లోపల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ.. ప్రయాణించవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, April 18, 2011, 13:45 [IST]
English summary
Here are the few easy steps to clean your car interiors. First remove the floor mats and clean them vacuum cleaner. Now gently clean the car dashboard, seats and other parts inside the car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+