కారు డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే నేరమా.??.. మోటారు వాహన చట్టం ఏం చెబుతోందంటే.!!

దేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం బైక్‌పై వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడటం నేరం. కానీ ఈ రూల్ చాలామంది పాటించరు. అలాగే కారు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా స్టీరింగ్ బదులు సెల్ ఫోన్ చేతిలో పట్టుకోకూడదనే రూల్ కూడా ఉంది. కానీ ఈ నిబంధనను కూడా చాలా మంది ఫాలో అవ్వరు. కారు నడుపుతూనే ఫోన్ మాట్లాడుతుంటారు.

2019లో డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటానికి సంబంధించి మోటారు వాహన చట్టంలో కొత్త సవరణ తీసుకొచ్చారు. దీని ప్రకారం వాహనాల్లో ప్రయాణించే వారు డ్రైవింగ్ చేయకుండా దృష్టి మరల్చేందుకు తమ చేతిలోని సెల్‌ఫోన్లను ఉపయోగించకూడదనే నిబంధన ఉంది. అయితే చాలా మంది వాహనదారులకు ఈ నిబంధనపై అవగాహన లేకపోవడం బాధాకరం.

Using-Mobile-Phone-While-Driving-A-Car-New-Rules

ఈ నిబంధన అమల్లోకి వచ్చి 5 ఏళ్లు గడుస్తున్నా దీనిపై చాలామందికి సరైన అవగాహన లేదు. దీంతో చాలా చోట్ల కారు నడిపేటప్పుడు సెల్ ఫోన్లు చేతిలో పెట్టుకుని ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్నారు. దీంతో పోలీసులు వారికి జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ. 5000 నుంచి రూ.10000 వరకు జరిమానా, 90 రోజుల వరకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు.

కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో తన కారులో ఢిల్లీ నుంచి ఘజియాబాద్‌కు వెళ్తున్నారు. ఆ సమయంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తుండగా.. పోలీసులు సందీప్ శర్మ వస్తున్న కారును ఆపి డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు.

Using-Mobile-Phone-While-Driving-A-Car-New-Rules

డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు అడుగుతున్నారని సందీప్ శర్మను ప్రశ్నించగా.. నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్ పట్టుకుని డ్రైవింగ్ చేసినందుకు సందీప్ శర్మకు రూ. 5000 జరిమానా, 90 రోజుల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని వెల్లడించారు. అదే విధంగా ఆటో డ్రైవ్ చేస్తున్న మరో వ్యక్తి కూడా.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ తీసుకెళ్తున్నాడు. దీంతో అతడికి జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సంఘటన గురించి విన్నప్పుడు మీకు రకరకాల అనుమానాలు కలగవచ్చు. కారు నడుపుతూ సెల్‌ఫోన్‌ పట్టుకోవడం నేరమా.? ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎలా ఉండాలి అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దీని గురించి మోటారు వాహన చట్టం ఏం చెబుతుందంటే.. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు స్టీరింగ్‌పై మీ రెండు చేతులను ఉంచాలి.

అలాంటప్పుడు చేతిలో సెల్‌ఫోన్‌ ఉండడం ఒక్కటే నేరం కాదు. ఆహార పదార్థాలు, కాగితం, పెన్ను మొదలైన వాటిని చేతిలో పట్టుకోవడం కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ విధంగా, మీరు ఒక చేతిలో ఏదైనా పట్టుకుని ప్రయాణిస్తుంటే, ట్రాఫిక్ పోలీసులు గుర్తించినట్లయితే మీకు జరిమానా మరియు లైసెన్స్ రద్దు చేస్తారు. కానీ ఇప్పటి వరకు దేశంలో బ్లూటూత్ హెడ్‌సెట్‌ల ద్వారా ఫోన్‌లో మాట్లాడటం వంటి సంఘటనలకు సరైన చట్టపరమైన నిబంధనలు లేవు.

ఇలా బైక్, కారు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడటం చట్ట ప్రకారం నేరం. డ్రైవింగ్ చేసేటప్పుడు రెండు చేతులు తప్పనిసరిగా స్టీరింగ్‌పై ఉంచడం అవసరం. మీ పూర్తి దృష్టి డ్రైవింగ్‌పై ఉండాలి. ఒంటిచేత్తో తింటూ డ్రైవింగ్ చేయడం, నీళ్లు తాగుతూ డ్రైవింగ్ చేయడం కూడా చట్ట ప్రకారం నేరమేనని మోటారు వాహన చట్టం చెబుతోంది.

భారతీయ రోడ్లపై వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ కాకుండా ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు, మీ వాహనం ప్రమాదానికి గురి కావచ్చు. ఇది మీకే కాకుండా ఇతర వాహనదారులపై కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, మోటారు వాహన చట్టంలో ఈ నిబంధనలను పేర్కొన్నారు. వాహనదారులు వీటిని తప్పకుండా పాటించాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 15, 2024, 9:20 [IST]
English summary
Using mobile phone while driving car legal or illegal you should know the new rules
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+