మీ కారులో ఫ్రంట్ సీట్ ఫీచర్ ఉందా.. వీటి వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఇకపై ఈ ఫీచర్ ఉంటేనే కొంటారు..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటోమొబైల్ రంగంలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల భద్రతా, వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్ మేకర్లు కార్లలో అధునాతన ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. అందులో ముఖ్యమైనది వెంటిలేటెడ్‌ సీట్లు. మరి వాటి ప్రాముఖ్యత ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

నేటి ఆధునిక కార్లలో విస్తృతంగా ఉపయోగించే టెక్నాలజీస్‌లో ఒకటి వెంటిలేటెడ్ సీట్లు. వెంటిలేటెడ్ సీట్ల ముఖ్యమైన పని ఏమిటంటే, ప్రయాణికుడి, డ్రైవర్ బాడీ టెంపరేచర్‌పై ఆధారపడి చల్లని మరియు వెచ్చని గాలిని విడుదల చేస్తుంది. కార్ల నాణ్యతను బట్టి, ఈ సీట్ల నాణ్యత కూడా మారుతూ ఉంటుంది.

 Ventilated-Car-Seats

ఇటీవలి కాలంలో, దేశీయ ఆటోమొబైల్ రంగంలో డ్రైవర్లు మరియు ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించేలా వారి భద్రతను దృష్టిలో ఉంచుకిని ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు పైన చెప్పుకున్నాం. వాటిలో నూతనంగా ప్రవేశపెట్టిన వెంటిలేటెడ్ కారు సీట్లు జనాదరణ పొందుతున్నాయి. ఇది దేశంలో సౌకర్యవంతమైన ప్రయాణ ఆలోచనను పెంపొందించేలా చేస్తుంది.

వెంటిలేటెడ్ ఫెసిలిటీ కారు ఫ్రంట్ సీట్లకు ఉంటాయి. డ్రైవర్, ప్రయాణికులకు కూలింగ్ మరియు హీటింగ్ ఫంక్షన్లను అందిస్తాయి. ఇది కారు వెలుపల వాతావరణంతో సంబంధం లేకుండా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. వెంటిలేటెడ్ సీటింగ్ సిస్టమ్‌లో సీటు లోపల మైక్రో ఫ్యాన్‌లు మరియు హీటింగ్ ఎలిమెంట్‌లను ఇన్‌స్టాల్ చేయడాన్ని గమనించవచ్చు.

 Ventilated-Car-Seats

లాంగ్ డ్రైవ్‌ చేసేవారికి వెంటిలేటెడ్ సీట్ల ద్వారా మరింత సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. ఎందుకంటే తరచుగా, సుదూర ప్రయాణాల్లో మీ శరీరం త్వరగా అలసిపోయే అవకాశం ఉంటుంది. సౌకర్యవంతమైన చల్లని లేదా వెచ్చదనం అందించడం ద్వారా డ్రైవర్‌తో సహా ప్రయాణీకులందరూ సౌకర్యవంతంగా, అవసరమైన సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.

దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్‌లు కస్టమర్లకు ప్రీమియం అనుభూతిని అందించడానికి తమ టాప్ ఎండ్ మోడల్‌ కార్లలో రెగ్యులర్ ఫీచర్‌గా వెంటిలేటెడ్ సీట్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నాయి. ఇటువంటి వినూత్న ఆధునిక ఫీచర్లు ఈ బ్రాండ్‌లను మార్కెట్లో తమ పోటీదారుల కంటే ఒక అడుగు ముందు వేసి విక్రయాల్లో దూసుకుపోయేలా చేస్తున్నాయి.

 Ventilated-Car-Seats

మొదట్లో ప్రీమియం కార్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వెంటిలేటెడ్ కార్ సీట్ టెక్నాలజీ ఇప్పుడు బడ్జెట్ ధర కలిగిన కార్లలో కూడా ప్రవేశపెడుతున్నారు. ఇది దేశంలో కస్టమర్లలో వెంటిలేటెడ్‌ సీట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తెలియజేస్తుంది. ఈ సాంకేతికత ఇకపై విలాసవంతమైనది మాత్రమే కాకుండా.. దేశీయ వాతావరణానికి అనుగుణంగా వాటి అవసరాన్ని తెలియజేస్తుంది.

వెంటిలేటెడ్ కారు సీట్లు మంచి పనితీరుతో పాటు మీకు లగ్జరీ ఫీలింగ్‌ను కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వెంటిలేటెడ్‌ సీట్లకు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానకి ఈ ఫీచర్ సిద్ధంగా ఉంది. అనేక ఆటోమొబైల్‌ బ్రాండ్లు దీనిని అనుసరించడంతో, వెంటిలేటెడ్ కార్ సీట్లు భారతీయ కార్లలో మెయిన్‌ ఫీచర్‌గా నిలిచాయి.

 Ventilated-Car-Seats

భవిష్యతులో రానున్న కార్లలో ఇప్పటికే అధునాతన ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. అటువంటి ఫీచర్‌లో ఖచ్చితంగా వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇవి కారు AC సిస్టమ్ యొక్క పనిభారాన్ని విస్తృతంగా తగ్గిస్తుంది. అంతేకాదు రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు కాబట్టి, అలాంటి వాహనాల్లో వెంటిలేటెడ్ సీట్ల పాత్ర కీలకం కానుంది. ఇక ముందు మీరు కూడా కారు కొనుగోలు చేసేముందు ఈ ఫీచర్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 5, 2023, 8:57 [IST]
English summary
Ventilated car seats must be a main feature here is how it works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+