ఉప్పు నీటితో కారును కడుగుతున్నారా.. అయితే ఇలాంటి సమస్య వస్తుందని మీరు ఊహించి ఉండరు.!!
కారు మెయింటెనెన్స్‌లో యజమానులు తప్పనిసరిగా పాటించేది కారు కడగడం. అయితే మీరు కారును ఏ నీటితో కడుగుతున్నారనేది ఇక్కడ చాలా ముఖ్యం. అదేంటి అనుకుంటున్నారా??. అవునండీ.. మీరు కారును ఉప్పు నీటితో కడగడం వల్ల ముందు ముందు దాని విలువ తగ్గుతుందంటే మీరు నమ్ముతారా.. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి..
సాధారణంగా భూ గర్భ జలాలను వాడుకునేందుకు ప్రతి ఇంట్లో ఓ బోరు మోటారు ఉంటుంది. ఆ మోటారు ద్వారా ఎక్కువగా ఉప్పు నీరు మాత్రమే వస్తుంది. వాటి నుంచి మంచి నీరు రాదు. అందుకే చాలా మంది ఆ నీటిని ప్యూరిఫై చేసుకుని తాగుతుంటారు. కానీ మిగిలిన అవసరాల కోసం మాత్రమే ఫిల్టర్ చేయకుండా వాడతారు. అందులో ఒకటి కారు కడగడం.

కారు మెయింటెయిన్(Car Maintenance Tips)లో భాగంగా శుభ్రం చేయడానికి తరచూ చాలా మంది.. ఉప్పు నీటినే ఉపయోగిస్తారు. దీని వల్ల మీ కారుకు వివిధ రకాలుగా హాని కలుగుతుందని మీరు ఎప్పుడూ గ్రహించి ఉండరు. దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
Paint Damage: ఉప్పు నీటితో కారును కడగడం ద్వారా కారుపై పెయింట్ దెబ్బ తింటుంది. కొన్ని ఈ నీటి ద్వారా పెయింట్‌లో పగుళ్లు ఏర్పడతాయి. దీని వల్ల కలర్ మెరుపు కూడా తగ్గుతుంది. దీనిని నివారించేందుకు మీరు కారును మంచి నీటితో లేదంటే ఉప్పు తక్కువగా ఉండే నీటితో శుభ్రం చేయండి.

Rusting Problem: కారును కడిగేందుకు ఉప్పు నీటిని వాడటం ద్వారా కారు వెలుపలి భాగం తుప్పు పట్టవచ్చు. దీని ద్వారా కారు ఎక్స్‌టీరియర్ బలహీనపడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు కారును రీ సేల్ చేస్తున్నప్పుడు మీరు అనుకున్న ధరలో విక్రయించలేరు. ఈ సమస్య పరిష్కారానికి మంచి నీరు బెస్ట్ ఛాయిస్..
Damage to Electronic Parts: ఎలక్ట్రానిక్ భాగాలకు నష్టం: కారును కడిగేటప్పుడు ఒక్కోసారి ఎలక్ట్రిక్ భాగాలపై నీరు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉప్పు నీటితో కడగడం ద్వారా కారులోని ఎలక్ట్రిక్ భాగాల్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడే అవకాశం ఉంది. దీని ద్వారా ఎలక్ట్రిక్ భాగాలు దెబ్బ తింటాయి. మంచి నీటితో కడగడం ద్వారా ఈ సమస్య ఏర్పడే అవకాశాలు ఉండవు.

Rubbers Lost: కార్లలో బాడీ ప్యానెల్ కంటే రబ్బరు(Rubber) భాగం చాలా కీలకమని మీకు తెలిసిందే. రబ్బరు ప్యానెల్ ద్వారా కారు ఎక్స్‌టీరియర్‌ను కడిగేటప్పుడు నీరు లోపలికి వెళ్లకుండా నిరోధిస్తుంది. అయితే ఉప్పు నీటితో కడగడం ద్వారా రబ్బరు దెబ్బ తినే ప్రమాదం ఉంది. దీంతో రబ్బరు జీవితం కాలం తగ్గడమే కాకుండా.. పగుళ్లు ఏర్పడటం, బలహీనపడటం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
మీ కారు రీ సేల్ విలువ తగ్గకుండా ఉండకుండా ఉండాలంటే కారు మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. అందుకే మీ కారుకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పైన చెప్పిన సమస్యలన్నిటికీ పరిష్కారం మంచి నీటితో కారును కడగడమే. లేదంటే ఉప్పు ప్రభావం తక్కువ ఉన్న నీటితో కారును శుభ్రం చేయడమే బెస్ట్ ఆప్షన్..
మీ కారు(Car Maintenance) విలువ అనేది మీరు దానిని ఎలా నిర్వహిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే దాని విలువ నెమ్మదిగా తగ్గుతుందని గమనించాలి. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీరు ఎక్కువ వాడకం తర్వాత కారు విక్రయించినా కూడా మంచి ధర లభిస్తుంది.


Click it and Unblock the Notifications








