కారు ఇంజన్ ఓవర్‌హీట్ కావడానికి కారణాలేంటి..?

Engine Overheating
ఏదైనా అత్యవసర పనిమీద కారులో బయటకు వెళ్లినప్పుడో... లేదా ప్రేయసితో కాసేపు సరదాగా గడుపుదామని లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లినప్పుడో... మీ కారు హఠాత్తుగా ఆగిపోయి పొగలు చిమ్ముతూ... ముందుకెళ్లడానికి మొరాయిస్తే... ఎలా ఉంటుంది. చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా.. మరి అలా అనిపించ కుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. అస్సలు కారు ఇంజన్ అంతగా ఓవర్‌హీట్ కావడానికి కారణాలు ఏముంటాయ్.. ఇవిగో ఇక్కడున్నాయి... ఓ లుక్కేయండి మరి..!

కారుకు సంబంధించిన సమస్యలలో ఓవర్‌హీటింగ్ అనేది సర్వసాధారణమైనది. లక్ష రూపాయల కారు మొదలుకొని కోట్లు విలువ చేసే కార్ల వరకూ ఈ సమస్య మామూలే. ఇందుకు పెద్దగా కంగారుపడిపోయి మెకానిక్‌ల వద్దకు వెళ్లి జేబులు ఖాలీ చేసుకోకుండా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రధానంగా కారు కూలెంట్ సిస్ఠమ్ (ఇంజన్‌ను చల్లబరచే విధానం)లో లోపం వల్ల తరచూ కారు ఇంజన్ ఓవర్‌హీట్ కావడం జరుగుతుంటుంది. దీనిని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. కారు పెర్ఫార్మెన్స్ దెబ్బతినడంతో పాటు ఇంజన్‌పై దుష్ప్రభావాలను కూడా చూపే అవకాశం ఉంది. ఇంజన్ ఓవర్‌హీట్ కావడానికి చాలానే కారణాలున్నాయి. వీటి పట్ల చిన్నపాటి అవగాహన ఉంటే మీ కారు భద్రంగా ఉండమే కాకుండా ఎప్పుడూ ముందుకెళ్లనని మొరాయించదు కూడా...!

థెర్మోస్టార్ట్ స్టక్ కావడం:
కారు ఇంజన్ ఓవర్‌హీట్ కావడానికి థెర్మోస్టాట్ స్టక్ అవ్వడం సర్వసాధారణ కారణం. థెర్మోస్టార్ట్ అనేది కారు రేడియేటర్‌‌లో స్టోర్ చేయబడిన కూలెంట్‌ సిస్ఠమ్‌కు ముందుగా నిర్ధేశించిన ఉష్టోగ్రతలను పంపే ఒక చిన్న వాల్వ్. ఈ థెర్మోస్టార్ట్ ఫ్రీజ్ అయినా లేదా స్టక్ అయినా.. కూలెంట్‌ను ప్రవహింపచేయడాన్ని నిలిపివేస్తుంది. ఫలితంగా కారు ఇంజన్ ఓవర్‌హీట్ కావడం జరుగుతుంది. మరి ఇది సరిగ్గా పనిచేస్తుందో ఎలా తెలుసుకోవాలి..? అదే కదా మీ సందేహం.. రేడియేటర్ అప్పర్ హోస్ (రేడియేటర్‌కు పైభాగాన అనుసంధానించబడి ఉండే చిన్న పైపు)ను గమనిస్తే సరిపోతుంది. ఇంజన్‌తో పాటు ఇది వేడిగా (మరీ ఎక్కువ వేడి కాదండోయ్.. కాస్త వెచ్చగా) ఉన్నట్లయతే సరిగ్గా పనిచేస్తుందని అర్థం. అలా కాకుండా.. హోస్ వేడి కాకపోతే అందులో ఏదో సమస్య ఉందని అర్థం.

రేడియోటర్‌లో సమస్య:
కారు ఇంజన్‌కు రేడియేటర్ ఓ ఫ్రిడ్జ్‌లో పనిచేస్తుంది. రేడియేటర్‌లోకి దుమ్మూ, ధూళి చేరితే వెంటనే అది హీట్ రెడ్యూసింగ్ కెపాసిటీ (వేడిని తగ్గించే సామర్థ్యాన్ని) కోల్పోతుంది. ఫలితంగా కారు ఇంజన్ తరచూ అధికంగా వేడెక్కడం జరుగుతుంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి..? ఇందుకు ఒక్కటే మార్గం. మీ కారు రేడియేటర్ ఎక్కువగా దుమ్ము, ధూళితో నిండినట్లు అనిపిస్తే సరైన సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లి నిపుణులైన మెకానిక్‌లతో రేడియేటర్‌ను క్లీన్ చేయించుకోవడం ఉత్తమం. అలా కాకుండా.. దీనిపై అనుభవం లేకుండా స్వయంగా క్లీన్ చేయాలని ప్రయత్నిస్తే అస్సలుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త.

వాటర్ పంప్‌లో లోపం:
కారు ఇంటీరియర్ కూలింగ్ సిస్ఠమ్‌లో వాటర్ పంప్ చాలా కీలకమైన భాగం. కారు ఇంజన్‌ను చల్లబరచడానికి అవసరమయ్యే కూలెంట్‌ను ఇది నిరతరం సరఫరా చేస్తూ హీట్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే.. ఇంజన్ ద్వారా కూలెంట్‌ను ప్రవహింపచేయడంలో సరైన పీడనాన్ని (ప్రెజర్‌ను) అందిచలేకుపోతుంది, ఫలితంగా ఇంజన్ ఓవర్‌హీట్ అవుతుంది. కారు ఏసి ఆన్‌లో ఉన్నప్పటికీ ఇంజన్ ఓవర్‌హీట్‌కు గురవుతుంటే.. కారు వాటర్ పంప్‌లో ఏదో సమస్య ఉందని అర్థం. లోపం కలిగిన వాటర్ పంప్ ఉండటం వల్ల కారు సమర్థవంతంగా నడవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాత వాటర్ పంప్ స్థానంలో నాణ్యమైన వాటర్ పంప్‌ను రీప్లేస్ చేయించుకోవటం ఉత్తమం.

తక్కువ కూలెంట్ స్థాయి, తక్కువ ఇంజన్ ఆయిల్ స్థాయి:
కారు కూలెంట్ వ్యవస్థను తరచూ చెక్ చేసుకోవాలి. కూలెంట్ సిస్ఠమ్‌లో ఏదైనా లీక్ అవుతుందో లేదో గమనించుకోవాలి. తక్కువ కూలెంట్ స్థాయి గనుక ఉంటే దాని కూలెంట్ సిస్ఠమ్ పనితీరు మందగించి ఫలితంగా ఇంజన్ ఓవర్‌హీట్ కావచ్చు. అలాగే ఇంజన్ ఆయిల్ స్థాయి తక్కువగా ఉండటం కూడా ఇంజన్ ఓవర్‌హీట్ కావడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ రెండు అంశాలను తరచూ గమనిస్తూ ఉండాలి.

యాంటీఫ్రీజ్:
శీతాకాలంలో ఇంజన్‌ గడ్డకట్టడాన్ని నివారించి దాని టెంపరేచర్‌ను అదుపులో ఉంచడంలో యాంటీఫ్రీజ్ సహాయపడుతుంది. కానీ వేసవికాలంలో మాత్రం ఇది రివర్స్‌లో పనిచేస్తుంది. అంటే.. వేడిగా ఉన్న ఇంజన్‌ను చల్లబరుస్తుంది. కాబట్టి అన్ని సమయాల్లోనూ యాంటీ ఫ్రీజ్ చక్కగా పనిచేస్తుందో లేదో గమనించుకోవాలి.

ఇంజన్ ఓవర్‌హీట్ కావడానికి కారణాలేంటో ఇప్పుడు మీకు అర్థమయ్యాయనుకుంటాను.. ఇవికాకుండా మీకు తెలిసిన ఇతర కారణాలేమైనా ఉంటే మా రీడర్లతో పంచుకోగలరు. ధన్యవాధములు.

Most Read Articles

English summary
Engine overheating is the common problem in vehicles, many of the car owner are worrying about this issue. Many of us don't know the reasons for Engine overheating. But don't worry, here are the few reasons why car Engine gets overheat. Engine overheating is caused due to a number of factors.
Story first published: Wednesday, February 16, 2011, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X