మార్కెట్‌లో లభించే పెట్రోల్‌ స్వచ్ఛమైనది కాదు మిత్రమా.. అందులో కలిపే ఆ ఇంధనం వల్ల లాభమా? నష్టమా?

మన వాహనాల్లో ఉపయోగించే పెట్రోల్‌లో 10 శాతం కంటే ఎక్కువ ఇథనాల్‌ను కలిగి ఉంటుందని మీకు తెలుసా? అయితే ఇథనాల్‌ను పెట్రోల్‌లో ఎందుకు కలుపుతారు? అది లాంగ్‌లైఫ్‌లో ఇంజిన్‌పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇలాంటి ప్రశ్నలు మీ మెదడుకి పనిచెప్పే అవకాశం ఉంటుంది. అయితే రెగ్యూలర్‌ ఫ్యూయల్‌ వాహనాలకు జనాలు ఎక్కువగా అలవాటు పడటంతో దేశంలోపెట్రోల్‌ ధర రూ. 110కి దగ్గర్లో ఉంది. కొంతమంది స్మార్ట్ కొనుగోలు దారులు మాత్రం ఖర్చులు తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌లోకి మారిపోతున్నారు. భారత ప్రభుత్వం సాంప్రదాయ పెట్రోల్‌కి బదులు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రోత్సాహకాలను అందిస్తుంది.

దీంతో పాటు ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగించే పెట్రోల్‌లో 10 శాతం నుంచి 14 శాతం వరకు పెట్రోల్‌లో ఇథనాల్‌ని కలుపుతున్నారు. 2025 నాటికి ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోల్‌ ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకునే ముడి చమురు ఖర్చులు తగ్గనున్నాయి.

Ethanol Blended Petrol Pros and cons

పెట్రోల్‌లో ఇథనాల్‌ ఎక్కువగా ఉంటే కాలుష్యం కూడా తగ్గుతుంది. అయితే ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వల్ల వాహన యజమానుల జేబులకు చిల్లు పడే అవకాశం ఉంటుంది. ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ను ఉపయోగించడం వల్ల ఇంజిన్ రకాన్ని బట్టి వాహన కెపాసిటీ, ఫర్ఫామెన్స్‌ 3.5 నుంచి 5% వరకు తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంజిన్లు తక్కువ పవర్‌ని విడుదల చేయడమే కాకుండా ఎక్కువ ఇంధనం వినియోగం అవుతుందని ‌అంటున్నారు.

ఇథనాల్- పెట్రోల్ హైగ్రోస్కోపిక్ సమస్యను కలిగి ఉంది. అంటే ఇది గాలిలో తేమను గ్రహిస్తుంది. మీ వాహనం ఎండలో ఎక్కువ రోజులు ఉంటే ఇది ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఇంజిన్‌ పనితీరుతో పాటు మీకు అదనపు ఖర్చులకు దారితీస్తుంది. తాజా పెట్రోల్ ఇంజిన్‌లో ఎటువంటి తేమను సృష్టించదు. కాబట్టి మీ వాహనాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం లేదా తరచుగా ఇంధనం నింపుకోవడం చేయాలి.

Ethanol Blended in Petrol

పెట్రోల్‌లో ఆక్టేన్‌ అనేది చాలా కీలకం. ప్రస్తుతం 87, 91 ఆక్టేన్‌ రకాలు ఉంటాయి. సాధారణంగా చాలామంది 87 ఆక్టేన్ రకాన్ని పట్టిస్తారు. ఇక 91 రకం ప్రీమియం పెట్రోల్‌గా ఉంటుంది. ఇది హై రేంజ్ ఇంజిన్‌లకు పట్టిస్తారు. అలాగే ఇథనాలు కలిపిన పెట్రోల్‌లో ఆక్టేన్‌ రేటింగ్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో వాహనాలపై కొద్ది మేర ప్రభావం చూపనుంది. ఆక్టేన్‌ రేటింగ్‌లో ఇథనాలు చాలా కీలకం.

అయితే సాధారణ పెట్రోల్ కంటే ఇథనాల్ ఉత్పత్తికి తక్కువ ఖర్చవుతుంది. చెక్కెరను ఉత్పత్తి చేసే క్రమంలో సబ్‌ ప్రొడక్ట్‌గా వచ్చే షుగర్‌ మోలాసిస్‌ (Sugar molasses) ద్వారా ఇథనాల్‌ తయారవుతుంది. దీనిని పెట్రోల్‌లో కలపడం వల్ల పెట్రోల్‌ ఉత్పత్తి ఖర్చు భారీగా తగ్గుతుంది. అందువల్ల పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చెరకు పంటకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది.

Ethanol Flex Fuel

రానున్న రోజుల్లోఆటోమొబైల్ తయారీ సంస్థలు కూడా 100 శాతం ఇథనాల్‌తో పనిచేసే ఫ్లెక్స్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇటువంటి ఇంజన్లు పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయని ఆయన చెప్పారు. దీనివల్ల విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం ఇతర పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వీటితో పాటు మరీ ముఖ్యంగా రైతులకు మరింత లాభం జరగనుంది.

చెక్కెరతో పాటు తృణ ధాన్యాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ని ఉత్పత్తి చేయవచ్చు. కాబట్టి ఇథనాల్‌ తయారీలో వ్యవసాయం కీలక పాత్ర వ్యవహరించనుంది. ఇందుకోసం చెరకు సాగు కోసం ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ప్రాజెక్ట్‌ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దేశంలో కాలుష్య నివారణ కోసం అసరమైన అన్ని దారుల కోసం ఆయన ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ తీసుకుంటున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, August 25, 2024, 9:30 [IST]
English summary
What happens if ethanol blended in petrol check pros and cons details in telugu
Read more on: #auto news #ethanol #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+