కారులో ఎయిర్ ఫిల్టర్ అంటే ఏంటి, దానిని ఎప్పుడు మార్చాలి?

By Ravi

మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే ఊపిరితిత్తులు మాదిరిగానే, కారు ఇంజన్‌లోకి వచ్చే గాలిని శుద్ధి చేసేదే ఎయిర్ ఫిల్టర్. ఇంజన్‌లో ఇది చాలా కీలకమైన భాగం. ఉదాహరణకు ఇంజన్ ఒక లీటరు ఇంధనాన్ని మండించాలంటే, దానికి పది వేల రెట్ల స్వచ్ఛమైన గాలి అవసరం. ఫిల్టర్ చేయబడిన గాలి సాయంతో ఇంజన్‌లో ఇంధనం మరింత స్పష్టంగా మండుతుంది, ఫలితంగా ఇంజన్ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ ఎయిర్ ఫిల్టర్ ఇంజన్‌లోని కీలక భాగాలను దుమ్ము, ధూళి నుంచి కాపాడుతుంది.

ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చుకుంటే, ఇంజన్ పెర్ఫార్మెన్స్ పెరగటంతో పాటుగా, దాని జీవితకాలం కూడా పెరుగుతుంది. వాస్తవానికి ఎయిర్ ఫిల్టర్ జీవితకాలం అనేది కారు తిరిగే ప్రాంతంలో ఉండే గాలి నాణ్యతను బట్టి ఉంటుంది (ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది). సాధారణంగా, ఎయిర్ ఫిల్టర్‌ను ఏడాదికి ఒకసారి చొప్పున కానీ లేదా ప్రతి 20,000 కి.మీ. నుంచి 25,000 కి.మీ. మధ్యలో కానీ లేదా కార్ ఓనర్స్ మ్యాన్యువల్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం కానీ మార్చాల్సి ఉంటుంది.

Car Air Filter

మంచి ఎయిర్ ఫిల్టర్ వలన ఇంజన్ సామర్థ్యంతో పాటుగా మైలేజ్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, ఇంజన్ నుంచి వెలువడే కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు, మంచి యాక్సిలరేషన్ కోసం, ఇంజన్ జీవితకాలం పెంచేందుకు మరియు కార్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచేందుకు ఎయిర్ ఫిల్టర్ ఉపయోగపడుతుంది.

తరచూ మట్టి రోడ్లు, దుమ్ము ధూళి ఎక్కువగా ఉండే రోడ్లపై తిరిగే కార్లలో ఎయిర్ ఫిల్టర్ జీవితకాలం తక్కువగా ఉంటుంది. అదే శుభ్రంగా ఉండే రోడ్లు, నగరాల్లో తిరిగే కార్లలో వీటి జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది. ఇది కార్ ఎయిర్ ఫిల్టర్‌కు సంబంధించిన సమాచారం. ఈ కథనం మీకు నచ్చినట్లయితే, దీనిని మీ మిత్రులతో షేర్ చేసుకోగలరు లేదా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 11, 2014, 10:37 [IST]
English summary
Air filter is the key part for prolonged engine life. It cleans the air entering the engine, which is needed for proper internal combustion. Filtered air will burn more effectively and evenly, which in turn will result to a more efficient engine performance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+