ఆన్-ది-స్పాట్‌లో ఛలాన్ రాస్తే పరిస్థితి ఏంటి..?

Traffic Fine
ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే, ఛలాన్‌ను రాసి జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ట్రాఫిక్ అధికారులు కోరటం జరుగుతుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు దొరకుండా పారిపోతే ఛలాన్‌ను, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఇంటి చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాకాకుండా ఒక్కోసారి ఆన్-ది-స్పాట్‌లోనే ఛలాన్ రాసి జరిమానాను వసూలు చేయడం జరుగుతుంది.

మరి ఇలాంటి సందర్భంలో జేబులో డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి..? ఒరిజినల్ ఆర్‌సి (సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్) లేదా డిఎల్ (డ్రైవింగ్ లైసెన్స్)లను ట్రాఫిక్ పోలీసు చేతికి అప్పగించి మరుసటి జరిమానా కట్టి వాటిని విడిపించుకోవాలి. ఒకవేళ ఒరిజినల్ ఆర్‌సి, డిఎల్ (ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకైతే పర్మిట్) లేకపోయినట్లయితే, వాహనాన్ని పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది.

అదే రోజున వాహనాన్ని విడిపించుకోవాలంటే, పోలీస్ స్టేషన్‌లో జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు లేదా వాహనాన్ని విడిపించుకోవచ్చు. లేదా మరుసటి జరిమానాను కట్టాలనుకుంటే, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌లో జరిమానా చెల్లించి ఒరిజినల్ ఆర్‌సి లేదా డిఎల్‌ను విడిపించుకున్న తర్వాత సదరు ఛలాన్ రసీదును పోలీస్ స్టేషన్‌లో పొందుపరచి వాహనాన్ని విడిపించుకోవాలి.

ఈ కేసులో ఎవరైనా తమ తప్పు లేదని వాదించుకోవాలని భావిస్తే, కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులో తన తప్పు ఉన్నట్లు రుజువు అయితే, జరిమానాను కోర్టులోనే చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా, ఈ కేసులో తన తప్పు లేదని ధృవీకరించబడినట్లయితే, ఎలాంటి జరిమానా చెల్లించాల్సి అసరం ఉండదు. సదరు వ్యక్తి వాహనాన్ని అతనికి అప్పగించాల్సిందిగా పోలీసుకు కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది.

ఏదేమైనప్పటికీ, ఇటువంటి సందర్భాల్లో కంగారు పడకుండా, ఆవేశం తెచ్చుకోకుండా సంయమనంతో వ్యవహరించి, పోలీసులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం సాటి భారత పౌరుడిగా మన కర్తవ్యం.

More from DriveSpark

Article Published On: Wednesday, May 2, 2012, 19:39 [IST]
English summary
If anyone violates a rule a challan will be written and he will be asked to pay the fine amount. If the individual does not have money, then either he has to surrender his original Certificate of Registration (RC) or Driving License (DL).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+