Head Rest in Cars: కార్లలో హెడ్‌రెస్ట్‌ ఫీచర్‌ వల్ల ఇన్ని ప్రయోజనాలా.??

కార్లలో సాధారణంగా సీట్లు ఎల్లప్పుడూ పై భాగంలో హెడ్రెస్ట్‌(HeadRest)తో అమర్చబడి ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి అనుగుణంగా ఈ హెడ్‌రెస్ట్‌ ఫీచర్‌(HeadRest Feature In Cars)ను అమర్చారు. అయితే దీని వల్ల ప్రయోజనాలు ఏంటని మీకు ఎప్పుడైనా అనిపించిందా..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ఆటో మేకర్లు తమ కార్లలో అత్యాధునిక ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. డ్రైవర్‌, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను తీసుకువస్తున్నాయి. అంతేకాకుండా కారులో కేవలం ప్రయాణికులు కూర్చోడానికే కాకుండా విశ్రాంతి తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండేలా సౌకర్యాలను కల్పిస్తున్నాయి.

Why-Headrests-In-Car

కార్లలో చిన్నపాటి బెడ్‌ను ఏర్పాటు చేసుకునేలా కూడా అందుబాటులో ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అంతే కాకుండా కూర్చుని కూడా కాసేపు కునుకు తీసేలా ఉండటానికి కార్లలో హెడ్‌రెస్ట్‌ ఫీచర్‌ను తీసుకువచ్చారు. దీని ద్వారా కేవలం తల భాగానికి అనువుగా ఉండేలా ఓ పిల్లో మీద రెస్ట్‌ తీసుకుంటున్న ఫీలింగ్‌ కలిగేలా ఉంటుంది. అయితే హెడ్‌రెస్ట్‌ బాధ్యత కేవలం నిద్ర కోసం మాత్రమే కాదు.

వాహనాలలో హెడ్‌రెస్ట్‌ల ప్రాథమిక బాధ్యత ఏంటంటే.. ప్రయాణికులకు భద్రత కల్పించడం. అవి కార్లలో విప్లాష్‌ను తగ్గించడానికి రూపొందించాయి. హెడ్‌రెస్ట్‌ మీద మీరు తలను సరిగ్గా ఉంచడం కారణంగా ఒకవేళ ప్రమాదాలు జరిగినా, క్రాషెస్‌ అయినా.. తల, మెడ సురక్షితంగా ఉంటూ 43 శాతం గాయాలయ్యే అవకాశాలను తగ్గిస్తుందట.

Why-Headrests-In-Car

వాహనాలలో హెడ్‌రెస్ట్‌ల యొక్క భద్రతా ప్రాముఖ్యత కారణంగా, 1960ల చివరి నుండి కొన్ని దేశాల్లో ఈ ఫీచర్‌ను తప్పనిసరి చేశారు. అయితే భద్రత దృష్ట్యా హెడ్‌రెస్ట్‌లను ఎలా ఫార్మాట్ చేయాలి అనే దానిపై ఆటోమేకర్లకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని గమనించాలి. అయితే వీటి కారణంగా ఒక్కోసారి డ్రైవర్లు, ప్రయాణికులు కొన్ని సందర్భాల్లో దీనిని సౌకర్యవంతంగా భావించలేరు.

భద్రతా విషయంలో హెడ్‌రెస్ట్‌ ఫీచర్‌కు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, తీవ్ర ప్రమాదాల్లో హెడ్‌రెస్ట్‌లు గాయాన్ని 5 శాతం నుండి 10 శాతం వరకు మాత్రమే తగ్గిస్తాయి. అయితే చాలా మంది వాహనదారులకు హెడ్‌రెస్ట్‌ను సరిగ్గా ఎలా వినియోగించాలో తెలియకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇది తెలుసుకోవడం చాలా అవసరం.

Why-Headrests-In-Car

హెడ్‌రెస్ట్‌ను సరిగ్గా ఎలా ఉంచాలి ఉంటే.. దానిని తల యొక్క గురుత్వాకర్షణ కేంద్రం నుంచి కనీసం ఎత్తులో ఉంచాలి. అంటే.. ఇది తల పైభాగంలో 3.5-అంగుళాల కిందికి ఉంటుంది. అదనంగా, హెడ్‌రెస్ట్‌కు తల వెనుక దూరం వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. నాలుగు అంగుళాల కంటే ఎక్కువ దూరం ఉంటే, మెడకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Why-Headrests-In-Car

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 21, 2023, 9:46 [IST]
English summary
Why are headrests important feature in cars here are the reasons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+