తెల్ల కార్లే ఎక్కువ కొంటున్నారు.. ఇండియన్ రోడ్లకు ఇవే బెస్ట్ ఛాయిస్ అన్నది మీకు తెలుసా?
కొత్త కారు కొనే సమయంలో కలర్ ఎంచుకోవడం అనేది నిజంగా ఒక తలనొప్పిగా మారిపోతుంది. ఈ రోజుల్లో ఆటోమొబైల్ కంపెనీలు విభిన్నమైన కలర్ ఆప్షన్లు అందిస్తుండటంతో, ఏది ఎంచుకోవాలో అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కారు కలర్ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో పలు సమస్యలతోనూ సంబంధం ఉంటుంది. సరైన కలర్ ఎంచుకోకపోతే పునఃవిక్రయం సమయంలో దాని విలువ తగ్గిపోవచ్చు. అలాగే కొన్ని కలర్ కార్లు నిర్వహణ ఖర్చులు ఎక్కువగా తీసుకోవచ్చు. చిన్న చిన్న గీతలు, మురికి ఎక్కువగా కనబడే రంగులు మీకు అదనపు ఇబ్బందులు కలిగించవచ్చు. అయితే మీకు ఇక్కడ ఆక్చర్యకర విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రజలు ఎంచుకునే రంగు తెలుపు.
రోడ్డుపైకి ఒకసారి బయటకు వెళ్తే, ఎక్కువగా ఈ కలర్స్‌వే కనిపిస్తుంటాయి. ఈ స్థాయిలో తెలుపు ఎందుకు పాపులర్ అయిందో ఎప్పుడైనా ఆలోచించారా? తెల్లటి కార్లు ఈరోజు మార్కెట్‌లో, రోడ్లపై రాజ్యమేలుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం వాటి ఆచరణాత్మకత. ఒక తెల్లటి కారు ఎప్పుడూ క్లీన్‌గా, న్యూట్రల్‌గా కనిపిస్తుంది. ఎండలో ఇతర గాఢరంగులతో పోలిస్తే తక్కువ వేడి పీలుస్తుంది కాబట్టి, లోపల కూర్చునే వారికి కూడా కాస్త కంఫర్ట్‌గా అనిపిస్తుంది.

అదే సమయంలో, తెల్ల కారు మీద చిన్న గీతలు, డస్ట్ ఎక్కువగా కనిపించవు. దీని వలన మీరు తరచూ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. తెలుపు రంగు కార్లు వాడిపోకుండా, పాతదనాన్ని బయట పెట్టకుండా చాలా కాలం ఆకర్షణీయంగా ఉంటాయి. ఒకవేళ వాహనానికి గీతలు పడినా, చిన్న పగుళ్లు వచ్చినా లేదా పెయింట్ కొంచెం ఊడిపోయినా, తెలుపు రంగులో వాటిని సరిచేయడం చాలా ఈజీ.
ఇతర స్పెషల్ కలర్స్‌లా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కారణం సింపుల్ తెలుపు పెయింట్ ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది, కాబట్టి రిపేర్ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో, మీరు ఎంచుకునే ప్రత్యేక రంగులు లేదా కస్టమైజ్డ్ షేడ్స్ మార్కెట్‌లో అంత ఈజీగా లభించవు. వాటిని రిపేర్ చేయడానికి స్పెషల్ పెయింట్ లేదా టెక్నిక్ అవసరం అవుతుంది, దీని వలన ఖర్చు రెట్టింపు అవుతుంది.

ముఖ్యంగా ఈ మధ్య పాపులర్ అవుతున్న మ్యాట్ ఫినిష్‌లు స్టైలిష్‌గా కనిపించినా, అవి స్క్రాచెస్‌కి సులభంగా గురవుతాయి, వాటిని మళ్లీ సరిచేయడానికి ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రీసేల్ వ్యాల్యూ. మీరు కారు అమ్మే సమయంలో తెల్లటి కారు కొనుగోలు దారులకు త్వరగా నచ్చుతుంది. కొత్త కారు కొనుగోలు చేసే చాలా మంది డ్రైవర్లకు ఒకే ఆలోచన ఉంటుంది, భవిష్యత్తులో అమ్మేటప్పుడు పెద్ద నష్టపోకూడదు.
అందుకే, రీసేల్ వ్యాల్యూ విషయంలో తెల్లటి కారు బెస్ట్. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో తెలుపు కార్లకు ఎప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. ఇది కేవలం ఒక ఊహ కాదు, BASF కలర్ రిపోర్ట్ 2024లో వెల్లడించిన గణాంకాలు దీన్ని బలంగా నిర్ధారిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కొత్త కార్లలో దాదాపు 49 శాతం తెల్లటి కార్లే కాగా, కేవలం 18 శాతం మంది మాత్రమే నలుపు రంగు కార్లను ఎంచుకున్నారు.

అంటే, గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో తెలుపు రంగు ఒక దాదాపు డిఫాల్ట్ ఛాయిస్‌లా మారిపోయింది. భారతదేశం విషయానికి వస్తే, రోడ్లపై తిరిగే ప్రతి 10 కార్లలో 7 కార్లు తెల్లటి రంగులోనే ఉండటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. తెలుపు కలర్ కార్లు తొందరగా పాత వాటిగా కనిపించవు. పెయింట్ వాడిపోయినప్పుడు కూడా గీతలు కనిపించవు. ఎరుపు, నలుపు రంగు కార్లు ఎక్కువగా సూర్యకాంతికి గురైనప్పుడు మసకబారడం జరుగుతుంది.
మరో కీలక విషయం ఏమిటంటే, అధ్యయనాల ప్రకారం, ఒక గంటపాటు ఎండలో నిలిపినప్పుడు నల్లటి కారు ఇంటీరియర్ టెంపరేచర్ 70 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంటే, వెండి రంగు కారు 63 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆగుతుంది. కానీ తెల్లటి కారు మాత్రం కేవలం 44 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే వేడి అవుతుంది. తెల్లటి కార్లలో లోపల వేడి అనేది ఇతర కార్లతో పోలిస్తే, చాలా తక్కువగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








