కారుకు కుడి లేదా ఎడమవైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది మధ్యలో ఎందుకు ఉండదు?

By Anil Kumar

వెహికల్‌లో స్టీరింగ్ వీల్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. సాధారణంగా వాహనాలలో స్టీరింగ్ వీల్ కుడి లేదా ఎడమ వైపున ఉంటుంది. కానీ, స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదని ఎప్పుడైనా ఆలోచించారా...? ఇట్రెస్టింగ్‌గా ఉంద కదూ....

వెహికల్‌లో స్టీరింగ్ వీల్ మధ్యలో ఉండకపోవడానికి మరియు ఖచ్చితంగా కుడి లేదా ఎడమ వైపునే ఉండాలి అనడానికి కొన్ని ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి. ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదో తెలుసా

వెహికల్‌లో స్టీరింగ్ వీల్ మధ్యలో ఉండకపోవడానికి మరియు ఖచ్చితంగా కుడి లేదా ఎడమ వైపునే ఉండాలి అనడానికి కొన్ని ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి. ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదో తెలుసా

సీటింగ్ సమస్య

కారు వెనుక సీటులో ముగ్గురు కోర్చోవచ్చు, కానీ ముందు వరుసలో గేర్‌బాక్స్ ఉండటం వలన డ్రైవర్ మరియు ప్యాసింజర్ మాత్రమే కూర్చోగలరు. ఒక వేళ స్టీరింగ్ వీల్ మధ్యలో ఇచ్చినట్లయితే, ఒక్కరు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. అంతే కాకుండా, స్టీరింగ్ వీల్ మధ్యలో ఉండటం వలన డ్రైవర్ సీటు మధ్యలోకి వెళ్లడానికి ఇబ్బందిపడాల్సి వస్తుంది.

స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదో తెలుసా

స్టీరింగ్ సిస్టమ్

స్టీరింగ్ నుండి ముందు చక్రాల వరకు స్టీరింగ్ ఫోర్స్ వెళ్లడానికి మధ్యలో ఎన్నో స్టీరింగ్ విడి పరికరాలను చాలా ఉంటాయి. వాటిన్నింటి అనుసంధానం కోసం తగినంత స్థలం కావాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఇంజన్ మరియు డ్రైవ్ ముందు భాగంలో ఉన్నపుడు స్టీరింగ్ సిస్టమ్ ఏర్పాటు చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి స్టీరింగ్ వీల్ పక్కన ఉండటంతో స్టీరింగ్ సిస్టమ్ మొత్తం ఒకే భాగంలో అమర్చడానికి వీలవుతుంది.

స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదో తెలుసా

సులభంగా ప్రవేశించడానికి, బయటకు రావడానికి

స్టీరింగ్ వీల్ మధ్యలో ఉంటే డ్రైవర్ సీటు కూడా మధ్యలోనే ఉంటుంది. కాబట్టి, డ్రైవర్ సులభంగా లోపలికి వెళ్లడం మరియు బయటకు రావడానికి కుదరదు.అందుకే దాదాపు అన్ని వాహనాల్లో డ్రైవర్ సులభంగా లోపలికి వెళ్లడం మరియు బయటకు రావడానికి స్టీరింగ్ వీల్ కుడి లేదా ఎడమ వైపునే ఉంటుంది.

స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదో తెలుసా స్టీరింగ్ సిస్టమ్

ఇతర కారణాలు

పైన పేర్కొన్న అంశాలను కాదని ఒక వేళ స్టీరింగ్ వీల్ మధ్యలో ఇచ్చినట్లయితే, డ్రైవర్ కొన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో డ్రైవర్ మధ్యలో ఉండటం ద్వారా కుడి మరియు ఎడమవైపున రియర్ వ్యూవ్ మిర్రర్స్ ద్వారా వెనుక నుండి వచ్చే వాహనాలను గమనించడంలో కొద్దిగా ఒత్తిడికి లోనవుతాడు.

స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదో తెలుసా స్టీరింగ్ సిస్టమ్

అంతే కాకుండా, క్యాబిన్ లోపల ఉన్న రియర్ వ్యూవ్ మిర్రర్‌ను గమనించాలంటే తలను నిటారుగా పైకి ఎత్తాల్సి ఉంటుంది. వెంటనే స్పందిచడం కూడా కష్టమే.

స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదో తెలుసా స్టీరింగ్ సిస్టమ్

1. కారు స్టార్ట్ కాకపోవడానికి గల మెయిన్ రీజన్స్

2.కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ఇలా చేయండి!!

3.బ్రేక్ ప్యాడ్స్ మార్చకపోతే ఏమవుతుంది..?

4.ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ కార్లలో ఏది బెస్ట్ ?

5.ఈ 5 సేఫ్టీ ఫీచర్లు లేని కార్లను అస్సలు ఎంచుకోవద్దు!

Most Read Articles

English summary
Read In Telugu: Why is the Steering Wheel not in the Middle?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X