ఎందుకు వాహన బీమా తప్పనిసరి?

మోటార్ వాహనాలకు వాహన బీమా (థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్) చేయించటం తప్పనసరి. దురృష్టవశాత్తూ వాహనం ప్రమాదానికి గురైనట్లయితే, అందుకు ఆర్థికంగా అయ్యే ఖర్చుకు వాహన యజమాని బాధ్యత వహించడం నుంచి ఇది రక్షిస్తుంది. చట్ట ప్రకారం వాహనానికి సరైన బీమా లేకుండా రోడ్డుపై వాహనాన్ని నడపటం నేరం. ఇందుకు శిక్షగా జరిమానా, జైలు శిక్ష, లైసెన్స్ రద్దు వంటి పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా, మీ వలన జరిగిన వాహన ప్రమాదం యొక్క తీవ్రతను బట్టి, అవతలి వారు మిమ్మల్ని కోర్టుకు ఈడ్చటం కూడా జరుగుతుంది.

వాహనాలు నడిపే వ్యక్తులకు సైతం బీమా తప్పనిసరి. ఒకవేళ బీమా చేయబడిన వ్యక్తి వాహన ప్రమాదంలో గాయపడినా, మరణించినా లేదా అంగవైల్యం చెందినా సదరు వ్యక్తి ద్వారా ఫైల్ చేయబడిన క్లెయిమ్ ద్వారా బీమా కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. అదే వాహనానికి బీమా చేయించకుండా, సదరు వాహనం ప్రమాదానికి గురైనా లేదా ఆ వాహనం ద్వారా ఇతరులకు ప్రమాదం వాటిళ్లినా సదరు వాహన యజమానికి ఇందుకు బాధ్యత వహించడమే కాకుండా, కోర్టుకు సైతం తీసుకువెళ్లటం జరుగుతుంది.

అదే వాహనానికి, వాహనం నడిపికే వ్యక్తి బీమా చేయించి ఉన్నట్లయితే, ప్రమాదాల్లో సంభవించే నష్టం ఎంత భారీదైనా సరే బీమా కంపెనీ భరిస్తుంది (తీసుకున్న బీమా పాలసీ ప్రకారం). మోటార్ వాహన చట్టం 1988లోని సెక్షన్ 196 ప్రకారం, ఏదైనా వాహనానికి బీమా (ఆటో ఇన్సూరెన్స్) చేయించటం తప్పనిసరి. బీమా చేయించని వాహనాలను రోడ్లపై నడపటం శిక్షార్హం, ఇందుకు జరిమానాతో పాటుగా జైలు శిక్షను కూడా విధించడం జరుగుతుంది.

"మోటార్ వాహన చట్టంలో సెక్షన్ 146 ప్రకారం, బీమా చేయించని వాహనాన్ని నడిపినా లేదా సదరు వాహనాన్ని నడపటానికి వేరొకరిని అనుమతించినా అది చట్ట ఉల్లంఘన అవుతుంది. ఇందుతు 3 నెలల జైలు శిక్ష లేదా రూ.1,000 వరకూ జరిమానా లేదా రెండింటిని విధించడం జరుగుతుంది."

వాహనానికి బీమా చేయించడం వలన ప్రమాదం వలన జరిగే ఆర్థిక నష్టానికి మీరు బాధ్యులు కావడం నుంటి ఇది తప్పిస్తుంది. కాబట్టి రోడ్డు వాహనాన్ని నడుపుతున్నప్పుడు సదరు వాహనానికి బీమా చేయించబడి ఉండటం తప్పనిసరి. లేనట్లయితే జరిగిన ప్రమాద తీవ్రతను బట్టి జరిమానా, లైసెన్స్ రద్దు, జైలు శిక్ష వంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 24, 2012, 12:47 [IST]
English summary
Auto insurance (Third Party Insurance) protects you from being financially responsible for an accident. By law you must have vehicle insurance if you want to drive on the road and without it you can be fined, lose your license, go to jail and also be sued depending on the seriousness of the accident you caused.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+