ప్రయాణాల్లో రోడ్లపై 'ఆహం' ప్రదర్శిస్తే ఇలాగే జరుగుతుంది..!!

Road Rage
ఓ రోజు న్యూస్‌ పేపర్‌లో ఒక అర్టికల్ చదివాను.. ఆ కథనం సారాశం ఇది...

ఓ ప్రముఖ నగరంలో ఓ బస్సు వేగంగా వెళ్తున్న ఓ క్వాలిస్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లింది. ఆ క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న వారు తమ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసినందుకు ఆ బస్సును వెంబడించి, బస్సుకు అడ్డంగా క్వాలిస్‌ను నిలిపి డ్రైవర్‌తో గొడవకు దిగారు. డ్రైవర్‌కు క్వాలిస్‌ గ్రూపుకు మధ్య వాగ్వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో క్వాలిస్ గ్రూపు వాళ్లు డ్రైవర్‌పై చేయి చేసుకున్నారు.

అంతటితో ఆగక డ్రైవర్‌ను కిందపడేసి అతని ఛాతీపై పెద్ద బండను విసిరేశారు. పాపం పేదవాడి గుండె అంత భారాన్ని మోయలేక అక్కడిక్కడికే ఆగిపోయింది. అతని మీద ఆధారపడిన తొమ్మిది కుటుంబ సభ్యులు వీధనపడ్డారు. కానీ ఆ హత్య చేసిన ప్రముఖులు మాత్రం చట్టం కళ్లు కప్పి తప్పించుకున్నారు. మరి అతని ప్రాణం పోవడానికి కారణమేంటి..? కేవలం ఓవర్‌టేక్ చేసినందుకే ప్రాణం తీసేయాలా..? ఎంత ఘోరం..!!

ఇలాంటి సంఘటన ఇదొక్కటే కాదు.. చాలా రోడ్లపై ఇలాంటివి తరచూ చూస్తూనే ఉంటాం. తమ వాహనికి గీత పడిందనో.. తమ కన్నా వేగంగా వెళ్తున్నారనో.. రోడ్డు నిబంధనలు ఉల్లఘించారనో.. ఇలా ఏదో ఒక కారణంతో రోడ్లపై సిగపట్లను చూసే ఉంటాం. చొక్కాలు చింపుకోవడాన్ని గమనించే ఉంటాం.. కానీ మనకెందుకు వచ్చిన గొడవలే అనుకొని చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటాం. వారిని సమన్వయ పరచడానికి మాత్రం ప్రయత్నించం. అలా చేసి ఉంటే సదరు డ్రైవర్ బ్రతికి ఉండేవాడేమో..? ఆయన కుటుంబం రోడ్డున పడకుండా ఉండేదేమో..?

ఆలోచిస్తే ప్రతిసమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆవేశంతో మిగిలేది తుదకు విషాదమే అని చెప్పేందుకు ఇది ఒక యాదృచ్చిక సంఘటన..! కాదా..? ప్రతి విషయంలోనూ సంయమనం అవసరం.. అలాగే రోడ్డుపై వెళ్తున్నప్పుడు కూడా ఇతరులతో సంయమనం పాటిస్తే.. వారికి ఇబ్బంది కలిగించని వాళ్లమవుతాం. భావి సమాజానికి మేలు చేసిన వాళ్లమవుతాం..! మరి ఇందుకు మనం ఏం చేస్తే బావుంటుంది...?

1. త్వరగా బయలుదేరండి: వాహనంలో ఇంటి నుంచి ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు నిర్ణీత సమయం కన్నా ముందే బయలుదేరండి. హడావుడిగా బయలుదేరి రాష్ డ్రైవింగ్‌తో మీరు ప్రమాదాల్లో పడటమే కాకుండా.. ఇతరులకు ఇబ్బంది కలిగించిన వారు అవుతారు.

2. చిరునవ్వుతో కూడిన చిన్న 'సారీ' అద్భుతాలను సృష్టిస్తుంది. ప్రయాణాల్లో మీ తప్పును ఒప్పుకోండి, ముఖంపై చిరాకును వదలి చిరునవ్వుతో అవతలి వాళ్లను క్షమించమని అడగండి. చిన్న సారీ చెప్పడం వల్ల మీకు జరిగే ప్రమాదేమీ లేదని గమనించుకోండి.

3. మీ వాహనానికి సరైన బీమాను ఎల్లప్పుడూ చేయించి పెట్టుకోండి. రోడ్డుపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి మీ వాహనం దెబ్బతింటే ఆ మొత్తాన్ని బీమా కంపెనీయే భరిస్తుంది. దాని కోసం అవతలి వారితో వాగ్వివాదానికి దిగటం మంచిది కాదని గమనించండి.

4. రోడ్డుపై హడావిడిగా నడిచే వారిని గమనించి ముందుకు సాగండి. కొన్ని సెకన్లు ఆలస్యమైన పర్లేదు, వారు మీ ముందు నుంచి వెళ్లిపోయే వరకూ వేచి ఉండి ఆ తర్వాత బయలుదేరటం క్షేమదాయకం.

5. క్షమాగుణాన్ని అలవరుచుకోండి: రోడ్డుపై ఇతరులకు హాని తలపెట్టాలని ఎవ్వరూ పనికట్టుకొని ప్రమాదాలు చేయరు. ఇతరులు చేసిన కొన్ని తప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఉదాహారణకు మీకు ఎదురుగుండా ఎడమైవు నుంచి ప్రయాణిస్తున్న వ్యక్తి తనకు అడ్డుగా వచ్చిన పిల్లవాడినో లేక కుక్కపిల్లనో తప్పించడానికి హఠాత్తుగా మీ ముందుకు వచ్చినప్పుడు ప్రమాదం జరగవచ్చు. అలాంటి సమయంలో అతను క్షమించమని అడిగితే.. అతనితో గొడవ పడటం కన్నా క్షమించడం మిన్న.

6. మీ అహాన్ని (ఈగో) పక్కనపెట్టండి: మనిషికి అహాన్ని మించిన శత్రువు మరొకటి లేదు. రోడ్డుపై జరిగే అల్లర్లకు ఎక్కువగా ఈగో సమస్యలే కారణం. తమను ఓవర్‌టేక్ చేశారని మీరు కూడా అదే చేయాలని భావిస్తే నష్టం జరిగేది మీకే అని గుర్తుంచుకోండి.

7. చివరిగా..రోడ్డుపై వాహనంలో ప్రయాణించేప్పుడు ఒక్క విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.. మీ కుంటుంబాని మీ కారు, మీ స్కూటర్ కన్నా కూడా మీ అవసరమే ఎంతో ఉందన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి.

కాబట్టి రోడ్డుపై జాగ్రత్తగా, సురక్షితంగా ప్రయాణించండి, ఇతరులతో సున్నితంగా వ్యవహరించండి... హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ ఆన్ రోడ్స్..!

More from DriveSpark

Article Published On: Thursday, February 3, 2011, 10:40 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+