తెలుపు రంగు కార్లకు ఎందుకు అంత పాపులారిటీ..?
స్వచ్ఛతకు చిహ్నమైన తెలుపు రంగు కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. తెలుపు రంగు కార్లు ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి ఉత్తర అమెరికా, జపాన్ దేశాలలో ఈ రంగు కార్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వైట్ కలర్ కార్లు అంత పాపులారిటీని దక్కించుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో క్లాసిక్ కలర్ యొక్క రీసేల్ వ్యాల్యూ, రాత్రిపూట ప్రయాణాల్లో సురక్షిత, పర్యావరణ కారణాలు సాధారణంగా చెప్పుకోదగినవి.
కార్ కలర్స్‌పై విడుదలైన డ్యూపాంట్ గ్లోబల్ ఆటోమోటివ్ కలర్ పాపులారిటీ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా తెలుపు, నలువు, సిల్వర్ కలర్ కార్లు మంచి పాపులారిటీని కలిగి ఉన్నాయి. వైట్ కలర్‌లో పెరల్ వైట్ కలర్ నార్త్ అమెరికా, జపాన్, ఇండియా దేశాల్లో మంచి పాపులర్ కలర్‌గా ఉంది. అనేకమంది కొనుగోలుదారుల అభిప్రాయం ఏంటంటే, తెలుపు రంగు కార్లు ఎప్పటికీ రంగు మారకుండా ఉంటాయి. తెలుపు రంగును విలాసవంతమైన రంగుగా కూడా పరిగణించడం జరుగుతుంది.
తెలుపు రంగు కార్ల పాపులర్ అవటానికి మరొక కారణం సేఫ్టీ. ఇవి రోడ్లపై హై విజిబిలిటీని కలిగి ఉంటాయి, ప్రత్యేకించి రాత్రుల్లో ఇతర వాహనాల డ్రైవర్ల కళ్లకు ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే, డార్క్ కలర్ కార్ల కన్నా తెలుపు రంగు కార్లు తక్కువగా ప్రమాదాలకు గురవటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా, ఎండా కాలంలో నలుపు, డార్క్ కలర్ కార్ల లోపలి వాతావరణం వేడిగా ఉంటుంది, కానీ వైట్ కలర్ కార్లలో మాత్రం ఇది కాస్తంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తెలుపు రంగుకు ఉష్ణాన్ని పరావర్తనం చెందించే గుణం ఉంటుంది కాబట్టి. మరి మీ కారు కలర్ ఏంటి..?

తెలుపు రంగు కార్లు

తెలుపు రంగు కార్లు

తెలుపు రంగు కార్లు

తెలుపు రంగు కార్లు

తెలుపు రంగు కార్లు

తెలుపు రంగు కార్లు

తెలుపు రంగు కార్లు



Click it and Unblock the Notifications








