డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లను ఎందుకు వాడకూడదు?
కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏసి ఆన్ చేసి ఉండగా, సెల్‌ఫోన్‌ను ఉపయోగించకూడదు. ఎందుకనేది ఈ కథనం చదివితే మీకే అర్థమవుతుంది.
ఓ వ్యక్తి తన ఆఫీసు పని పూర్తయిన తర్వాత కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తి ఆ సమయంలో కారు నడుపుతున్నప్పుడు కారులో ఏసి ఆన్ చేసి ఉంది, అదే సమయంలో అతను సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు. అలా కారులో కొద్ది వెళ్లిన తర్వాత అతని భల్లుమన్న శబ్ధం భయంకరంగా వినిపించింది.
దీంతో కంగారు పడిన సదరు వ్యక్తి, వెంటనే ఫోన్ కట్ చేసి, కారుకు పక్కకు నిలిపి, కారులో నుంచి దిగి ఆ శబ్ధం ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించగా, కారు వెనుక అద్దం చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయి కనిపించింది. అదిచూసి ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి, ఈ సంఘటన ఎలా జరిగిందోనని చుట్టూ పరిశీలించ సాగాడు. అయితే, అతనికి అనుమాస్పదంగా ఏమీ కనిపించలేదు.

అదే దారిలో నడుచుకుంటూ వస్తున్న వైద్య నిపుణుడు కారును పరిశీలిస్తున్న వ్యక్తి కంగారుపడటాన్ని చూసి ఇలా అడిగాడు.. మీరు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏసి ఆన్ చేసి, సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నారా..? అని. అందుకు సదరు వ్యక్తి అవునని సమాధానం ఇచ్చాడు. అప్పుడు సదరు వైద్య నిపుణుడు ఇలా వివరణ ఇచ్చాడు.
కారులో ఏసి ఆన్ చేసి ఉన్నప్పుడు, కారులో కూర్చొని ఉన్న ఏ వ్యక్తి అయినా (డ్రవర్‌తో కలిపి) సెల్ ఫోన్‌లో మాట్లాడటం చాలా ప్రమాదకరం. మీరు చలనంలో ఉన్నప్పుడు ప్రతి నిమిషానికి ఒక్కసారి నెట్‌వర్క్ మారుతూ ఉంటుంది. ఈ సందర్భంలో సంభవించే రేడియేషన్ చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, ఇది కారు అద్దాలను సైతం పగలగొట్టగలదు.
కాబట్టి, మిత్రులారా.. కారు నడుపుతున్నప్పుడు ఎట్టి పరిస్థితిల్లోను సెల్ ఫోన్‌లను ఉపయోగించకండి.


Click it and Unblock the Notifications








