నల్లటి అద్దాల వెనుక దాగి ఉన్న ప్రమాదమేంటో తెలుసా..?
అయితే, ఇందుకు కూడా ఓ లెక్క అంటూ ఉంది. పారదర్శకతను (బయటి నుండి కారు లోపలి వ్యక్తులు, వస్తువులు కనిపించే విధంగా) కలిగిన టింట్/సన్ ఫిల్మ్‌లను మాత్రమే ఉపయోగించాలి.
మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు మరియు వెనుక వైపు కారు అద్దాలు) 70 శాతం మాత్రమే టింట్ చేయబడాలి. అంతకు మించి ఎక్కువ టింట్ చేసినట్లయితే, అది మోటార్ వాహన చట్టాన్ని ఉల్లఘించబడినట్లుగా గుర్తించి, ట్రాఫిక్ పోలీసుల చే జరిమానాను ఆహ్వానించబడుతుంది.
అలాగే, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 శాతం పారదర్శకతను కలిగిన టింట్/సన్‌ఫిల్మ్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కార్లకు నల్లటి అద్దాలను ఉపయోగించటం వల్ల జరిమానాల ద్వారా జేబులకు చిల్లు పెట్టుకోవటమే కాకుండా, ఆ నల్లటి అద్దాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలకు కూడా మీరే బాధ్యులు అవుతారు.
సాయంత్రం వేళల్లో బయటి కాంతి తగ్గినప్పుడు ఇలాంటి అధిక టింట్ కలిగిన అద్దాలు ఉండే కార్లలోను ఎదురుగా లేదా వెనుకగా వస్తున్న వాహనాలను సాధారణ సమయంలో కనిపించినంత స్పష్టంగా కనిపించవు. ఫలితంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కాబ్టటి, ఎల్లప్పుడూ, ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారమే మీ కారు అద్దాలకు టింట్ చేయించండి.


Click it and Unblock the Notifications









