కారు లోన్‌ తీసుకుంటున్నారా.??.. ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.. లేదంటే చాలా మోసపోతారు.!!

కారును సొంతం చేసుకోవడం అనేది మధ్యతరగతి ప్రజల కల. కారు కొనేవారిలో చాలా మంది ఉంటారు. మొదటిసారి కారు కొనుగోలు చేసేవారు.. సెకండ్‌ హ్యాడ్‌లో ఫస్ట్‌ కారు కొనేవారు ఇంకా.. అధిక ధరలో లగ్జరీ కారును కొనాలని చూసే వారు ఉంటారు. కానీ పూర్తి నగదుతో కారును కొనాలనేది ఎక్కువ శాతం మంది సాధ్యం కాదు. అందుకోసమే(Car Loans) ఈఎంఐలు, లోన్లు ఉన్నాయి.

భారత్‌లో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. వారి అభిరుచికి తగ్గట్లుగా ఎక్కువగా బడ్జెట్‌ ధరలో ఆటో మేకర్లు కార్లను లాంచ్‌ చేస్తుంటాయి. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో కొత్త కారు కొనేవారు చాలా ఆలోచించి.. తమ అవసరాలకు అనుగుణంగా ఉండే మంచి కారును సెలెక్ట్‌ చేసుకుంటారు.

Best-Car-Loans

కార్ల తయారీదారులు సైతం డిస్కౌంట్లతో తమ సేల్స్‌ను పెంచుకునేందుకు యత్నిస్తుంటారు. అయితే ఎవరైనా సరే ఒకేసారి మొత్తం చెల్లించి కారును కొనుగోలు చేయలేరు. ఇందుకోసం బ్యాంకులు నిర్దిష్ట కాలానికి ప్రాసెసింగ్ రుసుమును నిర్ణయిస్తాయి. ఆ నిర్ణీత వ్యవధిలో నెలా నెలా ఈఎంఐల రూపంలో బ్యాంకు ఖాతా నుంచి నగదును వసూలు చేస్తాయి.

సాధారణంగా కారు లోన్ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఏడు సంవత్సరాల వరకు కూడా ఈఎంఐల చెల్లింపు వ్యవధిని అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యవధి తక్కువగా ఉంటే నెలవారీ చెల్లించే మొత్తం ఎక్కువగా ఉంటుండగా.. వ్యవధి ఎక్కువగా ఉండే ఈఎంఐ తక్కువగా ఉంటుంది.

Best-Car-Loans

ఈ క్రమంలో నెలనెలా తక్కువ మొత్తంలో చెల్లించి ఇబ్బందులు పడకుండా సులభంగా కారును సొంతం చేసుకోవాలనుకుంటారు కొందరు. అయితే ఇలా చేయడం ద్వారా మీ రీపేమెంట్‌ మొత్తం గణనీయంగా పెరుగుతుందని మీకు తెలుసా.?? ఇందుకోసం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కారు కొనేటప్పుడు, పెద్ద మొత్తంలో రుణం తీసుకోవడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. మీరు తక్కువ వ్యవధిలో లోన్‌ తీసుకుంటే, మీరు తొందరగా దాని నుంచి రిలీఫ్‌ కావచ్చు. కానీ దీనితో పాటు, నెలవారీ తిరిగి చెల్లించే మొత్తం కూడా పెరుగుతుందని మీరు ఇక్కడ తెలుసుకోవాలి. అయితే కారు లోన్‌ తీసుకునే ముందు మీరు ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, ఈ EMIలను మీరు కరెక్ట్‌గా చెల్లించగలమా అని తెలుసుకోవాలి.

ఎందుకంటే మీరు ఈఎంఐలను ఆలస్యం చేసినట్లయితే మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్రంగా ప్రభావితం చూపిస్తుంది. దీని ద్వారా మీరు భవిష్యత్తులో వడ్డీ మాఫీని పొందలేరు. ఇంకా కొత్త రుణాలకు కూడా మీరు అర్హులు కాలేరు. కాగా కొన్ని ఆర్థిక సంస్థలు కారు పూర్తి మొత్తానికి రుణాన్ని అందిస్తుండగా.. కొన్ని సంస్థలు ఎక్స్-షోరూమ్ ధరలో 80 శాతం వరకు రుణాలను అందిస్తాయి.

ఇక్కడ రుణంపై వడ్డీ కాకుండా, ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఖర్చులను లెక్కించిన తర్వాత ఫైనాన్షియర్ తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే మీరు కారు కొనాలని నిర్ణయించుకుంటే ముందుగా డీలర్‌ను సంప్రదించి కారు ధర తెలుసుకొని బేరమాడండి. కొత్త కారు యొక్క ప్రతి విక్రయంపై డీలర్లు మంచి మొత్తంలో మార్జిన్ అందిస్తారు.

తద్వారా డిస్కౌంట్‌ మరియు ఇతర తగ్గింపు ఆఫర్‌లను తనిఖీ చేయడం ద్వారా మీరు సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. దీని ద్వారా కారు ధర తగ్గడంతో.. మీకు రుణ మొత్తం కూడా తగ్గుతుంది. తర్వాత మీరు రుణం కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు, బ్యాంకులు కార్ డీలర్‌తో టైఅప్ చేసి రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఇక్కడ డీలర్లు తమకు సంబంధాలు లేని ఇతర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోకుండా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. కానీ డీలర్‌తో భాగస్వామ్యంతో పొందిన రుణం ప్రస్తుతం మార్కెట్‌లో అత్యుత్తమంగా ఉంటుంది అని అనుకోవడం కూడా పొరపాటే. కాబట్టి మీరు కొన్ని బ్యాంకుల్లో కారు లోన్‌ గురించి తనిఖీ చేయండి.

బ్యాంకుల్లో కారు లోన్‌కు సంబంధించి.. వడ్డీ రేటు మరియు ప్రాసెసింగ్ ఛార్జీలను మాత్రమే తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఆ తర్వాత terms and conditions జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే మీరు లోన్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయండి. వడ్డీ రేటు, ముందస్తు చెల్లింపు ఛార్జీ మరియు ఇతర నిబంధనలను జాగ్రత్తగా లెక్కించండి.

వీటితో పాటు మీరు కారు లోన్లపై బ్యాంక్ ఆఫర్‌లను మీరు సరిగ్గా ఉపయోగించుకోండి. వీటిలో ప్రాసెసింగ్ ఛార్జీ మినహాయింపు, స్థిర శాతం, వడ్డీ రాయితీ మొదలైనవి ఉంటాయి. ఇక స్పష్టంగా చూడాల్సిన విషయం ఏమిటంటే.. నేడు చాలా మంది డీలర్లు వినియోగదారులను ఆకర్షించేందుకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా జీరో డౌన్ పేమెంట్‌తో కార్లను విక్రయిస్తున్నారు.

జీరో డౌన్‌ పేమెంట్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని మీరు పరిశీలించి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కారును కొనుగోలు చేసేటప్పుడు.. ఈ విషయాలను సీరియస్‌గా తీసుకుంటే, EMI గురించి పెద్దగా టెన్షన్ లేకుండా మీరు సులభంగా కారును సొంతం చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 5, 2024, 17:38 [IST]
English summary
You should follow these points while taking a car loan at low interest
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+