ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రోడ్డు ప్రమాదం..!!

ఈ దుర్ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దాదాపు 20 మంది సూపర్‌కార్ యజమానులు హిరోషిమా వైపుకు వెళ్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డు తడిగా ఉన్నందున ఈ ప్రమాదం సంభవించి ఉండచ్చని భావిస్తున్నారు. వీరంతా హిరోషిమాలోని ఆటో షోకు వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బహుశా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రోడ్డు ప్రమాదం కావచ్చోమే.
ఎందుకంటే, ఈ ప్రమాదం విలువ జస్ట్ రూ.20 కోట్లకు పైమాటే. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ మరణించలేదు. దాదాపు 10 మంది వరకూ ఓ మోస్తరు గాయాలతో బయటపడ్డట్లు సమాచారం. సూపర్‌కార్లలో భద్రతా ఫీచర్ల కారణంగా ఇంత తీవ్రమైన ప్రమాదం జరిగినప్పటి తాము ప్రాణాలతో బయటపడ్డామని బాధితులు వాపోతున్నారు.


Click it and Unblock the Notifications








