రిపేరు కోసం ఫెరారీ ఇస్తే, యాక్సిడెంట్ చేసిచ్చారు..
ఇకపై ఎప్పుడైనా మీ ఖరీదైన కార్లను మెకానిక్స్‌కు అప్పగించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. లేదంటే ఇలానే జరుగుతుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న అరుదైన ఫెరారీ కారును చూశారా? దీని పేరు ఫెరారీ ఎన్జో (Ferrari Enzo). ఈ కారు యజమాని మైఖేల్ ఫక్స్.
మైఖేల్ ఫుక్స్ (71 ఏళ్లు) తన ఫెరారీ ఎన్జో కారును మరమ్మత్తు కోసం గ్రీన్‌విచ్ డీలర్‌షిప్ మిల్లర్ మోటోకార్స్‌కు ఇవ్వగా, ఇదిగో తిరిగి ఇలా యాక్సిడెంట్‌కు గురైన కారును యజమానికి అప్పగించారు. ఆ డీలర్‌షిప్‌లోని ఓ టెక్నీషియన్ ఈ సూపర్ కారును టెస్ట్ కోసం తీసుకెళ్లి, దానిని అదుపు చేయలేక యాక్సిడెంట్ చేశాడు. దీంతో అత్యంత అరుదైన మరియు ఖరీదైన కారు ఇలా పనికిరాకుండా పోయింది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

మైఖేల్ ఫుక్స్ తన ఫెరారీ ఎన్జో కారును మరమ్మత్తు కోసం గ్రీన్‌విచ్ డీలర్‌షిప్ మిల్లర్ మోటోకార్స్‌కు ఇచ్చినప్పుడు, అందులోని ఓ టెక్నీషియన్ కారును స్టాంఫోర్డ్‌లోని ఇంటర్‌స్టేట్ 95 వద్ద యాక్సిడెంట్‌కు గురిచేశాడు.

పోలీసుల కథనం ప్రకారం, సదరు టెక్నీషియన్ ఈ కారును స్పిన్ కోసం తీసుకెళ్లగా దాదాపు ఎగ్జిట్ రూట్‌ను సమీపించడానికి ముందుగా ఓ బ్రిడ్జ్ వాల్‌ను ఢీకొట్టి మూడు లైన్లు పల్టీలు కొట్టుకుంటూపోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కానీ లేదా రోడ్డుపై వెళ్లే ఇతరులకు కానీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని పోలీసులు తెలిపారు.

అయితే, ఈ యాక్సిడెంట్‌లో ఫెరారీ ఎన్జో కారు కుడివైపు భాగం మాత్రం రిపేరు చేయలేనంతగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
Via CarBuzz


Click it and Unblock the Notifications








