ప్రపంచంలో సమర్థవంతంగా దాడి చేయగల టాప్ 10 సైనిక విమానాలు.. ఇవే

By N Kumar

యుద్దాలలో, రెస్క్యూ నిర్వహణం మరియు భారీ ఆయద సరుకులను రవాణా చేయడానికి ఈ మధ్య కాలంలో భారీగా వినియోగిస్తున్న రవాణా సాధనం హెలికాఫ్టర్. రెండవ ప్రపంచ యుద్దం నుండి చివరి జరిగిన వియత్నాం యుద్దం వరకు హెలికాఫ్టర్లు తనదైన శైలిలో సేవలను అందిస్తు వచ్చాయి.

ఈ తరుణంలో హెలికాఫ్టర్లు ఏరోజుకారోజు నూతన సాంకేతికతతో వివిధ అంశాల పరంగా అభివృద్ది చెందుతూ వచ్చాయి. అందులో ఏవియానిక్స్, సామర్థ్యం, వేగం మరియు ప్రేళుడు పదార్థాల సామర్థ్యం వరకు అనేక అంశాల పరంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమంగా దాడి చేయగలిగే ప్రపంచ టాప్ 10 సైనిక హెలికాప్టర్లు గురించి క్రింది కథనంలో అందిస్తున్నాము.

10. జడ్-10

10. జడ్-10

అత్యంత శక్తివంతమైన హెలికాఫ్టర్ల విభాగంలోకి ఎంపికయిన ఈ జడ్-10 హెలికాఫ్టర్ 2008-2009 కాలంలో చైనా ఆర్మీలో భాగంగా చేరింది. ఇందులో స్టాండర్డ్ కాంన్ఫిగరేషన్ గల గన్నులు కలవు. ఇందులో కాల్పులు జరిపే వ్యక్తి ముందు మరియు హెలికాఫ్టర్‌ను నడిపై పైలట్ వెనుక భాగంలో కూర్చుని ఉంటాడు. ఈ జడ్-10 లో 30 ఎమ్ఎమ్ రంద్రం గల క్యానన్, హెచ్‌జె-9 యాంటి ట్యాంక్ గైడ్ మిస్సైల్, ఆధునిక హెచ్‌జె-10 యాంటి ట్యాంక్ మిస్సైల్ మరియు టివై-90 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ ఇందులో కలవు.

Picture credit: Shimin Gu/Wiki Commons

09. ఎమ్‌ఐ-24 హిండ్

09. ఎమ్‌ఐ-24 హిండ్

ఎనిమిది సామర్థ్యంతో ప్రయాణించగల, యుద్ద దాడులను నిర్వహించగల, గన్నులను కలిగి ఉన్న ఈ ఎమ్‌ఐ-24 హిండ్ హెలికాఫ్టర్ ఇంటీరియర్ లోపల ఎంతో విశాలంగా ఉండి యుద్దంలో చురుకుగా పాల్గొంటుంది. ఇది మొదటి సారిగా రష్యా ఏయిర్ ఫోర్స్‌లో అస్సాల్ట్ ట్రాన్స్‌పోర్ట్ మరియు గన్‌షిప్‌గా సేవలు ప్రారంభించింది. ఇది ఎనిమిది మంది సైనిక దళాలను ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది.

Picture credit: Igor Dvurekov/Wiki Commons

08. ఏహెచ్‌-2 రూయివాక్

08. ఏహెచ్‌-2 రూయివాక్

డేనెల్ రూయివాక్ అనే ఈ యుద్ద హెలికాఫ్టర్‌ను దక్షిణాఫ్రికాకు చెందిన డేనెల్ వారు తయారు చేశారు. ఇలాంటి హెలికాఫ్టర్లను కేవలం 12 మాత్రమే దక్షిణా ఫ్రికా ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది. ఈ రూయివాక్ హెలికాఫ్టర్‌ను డిగ్రీ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ ఆఫ్ ది ఏరోస్పేషియల్ పూమా ఆధారంతో తయారు చేశారు. ఇందులో వినియోగించిన ఇంజన్ మరియు రూటర్‌ను ఈ ఏహెచ్‌-2 రూయికా హెలికాఫ్టర్‌లో వినియోగించారు.

Picture credit: Danie van der Merwe/Wiki Commons

07. ఏహెచ్-1 సూపర్ కోబ్రా

07. ఏహెచ్-1 సూపర్ కోబ్రా

ఈ బెల్ ఏహెచ్-1 సూపర్ కోబ్రా అట్టాక్ హెలికాఫ్టర్‌లో ట్విన్ ఇంజన్ కలదు. దీనిని ఆమెరికా ఆర్మీ ఆధారిత ఏహెచ్‌-1 కోబ్రా ఆధారంతో తయారైంది. ట్విన్ కోబ్రా కుటుంబంలో ఏహెచ్‌-1 జె సీ కోబ్రా, ఏహెచ్-1 టి ఇంప్రూవ్డ్ సీ కోబ్రా మరియు ఏహెచ్-1 డబ్ల్యూ సూపర్ కోబ్రా వంటివి ఉన్నాయి.

06. ఏ-129/టి-29 (ఇటలీ/టర్కీ)

06. ఏ-129/టి-29 (ఇటలీ/టర్కీ)

అగస్టా ఏ-129 మంగస్టా అటాక్ హెలికాఫ్టర్‌ను మొదటిసారిగా అగస్టా సంస్థ ఇటలీలో అభివృద్ది చేసింది. ఈ మొదటి అటాక్ హెలికాఫ్టర్‌ డిజైన్ మరియు అభిృద్ది పశ్చిమ మద్య యూరప్‌లో చేశారు.

టిఎఐ/అగస్టా వెస్ట్‌ల్యాండ్ టి-129 ఏటఏకె ను ఏ-129 అనే పేరుతో నిర్వచించారు. దీనిని టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తమ ప్రాథమిక భాగస్వామి అగస్టా వెస్ట్‌ల్యాండ్ ద్వారా అభివృద్ది చేస్తున్నారు.

Picture credit: gynti_46/Wiki Commons

05. ఏహెచ్-1 జడ్ వైపర్

05. ఏహెచ్-1 జడ్ వైపర్

ఈ ఏహెచ్‌-1 జడ్ వైపర్ ట్విన్ ఇంజన్ అటాక్ హెలికాఫ్టర్ ఏహెచ్-1 డబ్ల్యూ సూపర్‌కోబ్రా ఆధారంతో రూపొందించారు. దీనిని ప్రత్యేకంగా అమెరికాలోని మెరైన్ విభాగం కోసం అభివృద్ది చేశారు. ఇందులో నాలుగు బ్లేడ్లు, బేరింగ్ లెస్, కాంపోజిట్ మెయిన్ రోటర్ సిస్టమ్, అప్ రేటెడ్ ట్రాన్స్‌మిషన్, న్యూ టార్గెట్ సైటింగ్ సిస్టమ్‌లు ఇందులో ఉన్నాయి.

Picture credit: Wiki Commons

04. యురోకాప్టర్ టైగర్

04. యురోకాప్టర్ టైగర్

యారో కాప్టర్ టైగర్ అనే అటాక్ హెలికాప్టర్‌ను యూరోకాప్టర్ తయారు చేసింది. జర్మనీలో దీనిని టైగర్‌ గా సంభోదిస్తారు. ఈ టైగర్ యూరో కాప్టర్‌లో రెండు ఎమ్‌టియు టర్బోమెకా రోల్స్-రాయిస్ ఎమ్‌టిఆర్390 టర్బో షాఫ్ట్ ఇంజన్‌లు కలవు.

Picture credit: besopha/Wiki Commons

03. ఎమ్‌ఐ-28 హెచ్ హవోక్ (రష్యా)

03. ఎమ్‌ఐ-28 హెచ్ హవోక్ (రష్యా)

మిల్ ఎమ్‌ఐ-28 (నాటో పిలిచే పేరు హవోక్) హెలికాఫ్టర్ రష్యా యొక్క పగలు మరియు రాత్రి వేళల్లో కూడా సేవలందిస్తుంది.ఇది ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే యాంటి ఆర్మర్ అటార్ హెలికాఫ్టర్. దీనికి క్రింది భాగంలో బుల్లెట్లు పేల్చడానికి కావాల్సిన ముక్కు కలదు.

Picture credit: Wiki Commons

02. కమోవ్ కెఎ-50/కెఎ-52

02. కమోవ్ కెఎ-50/కెఎ-52

కమోవ్ కెఎ-50 హెలికాఫ్టర్ సింగల్ సీటింగ్ సామర్థ్యం ఉన్న రష్యాకు చెందిన అటాక్ హెలికాఫ్టర్. కమోవ్ డిజైన బ్యూరో యొక్క కోయాక్సిల్ రోటార్ సిస్టమ్ ఇందులో కలదు. 1980 లో దీనిని డిజైన్ చేశారు. తరువాత 1995 లో దీనిని రష్యా ఆర్మీలోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ హెలికాఫ్టర్ చిన్న అవసరాలకు మరియు అత్యంత వేగంగా స్పందించడాని కోసం రూపొందించారు.

Picture credit: Vlsergey/Wiki Commons

01. ఏహెచ్-64డి అపాచే లాంగ్ బో

01. ఏహెచ్-64డి అపాచే లాంగ్ బో

బోయింగ్‌కు చెందిన ఏహెచ్-64 అపాచే అటాక్ హెలికాఫ్టర్ గల్ప్ యుద్దంలో అత్యంత ప్రముఖమైన మరియు శక్తివంతమైన యాంటి ఆర్మర్ వెపన్ సిస్టమ్ కలిగిన హెలికాఫ్టర్ ఇది. అన్ని రకాల వాతావరణాలలో కూడా శక్తివంతంగా సేవలు అందించడానికి దీనిని డిజైన్ చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ పరిజ్ఞానం మరియు అగ్నినియంత్రిక వ్యవస్థలు ఉన్నాయి. ఇది 16 ఏజిఎమ్-114 హెల్ల్‌ఫైర్ మిస్సైల్స్, 76 70 ఎమ్ఎమ్ ఫోల్డింగ్ ఫైన్ ఏరియల్ రాకెట్లు కలవు.

మరిన్ని కథనాల కోసం...

ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్‌ను కలిగిన భారత్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ వాహనాలను కలిగిన దేశాలు

More from DriveSpark

Article Published On: Monday, May 23, 2016, 16:08 [IST]
English summary
10 Best Attack Helicopters in The World
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+