మారుతి 800 నుండి రోల్స్‌రాయిస్ ఫాంటమ్ వరకు కాపీ కొట్టిన చైనా కంపెనీలు

మన కన్నా వృద్ధిలో ఉన్న వారిని మనం అధిగమించలేకపోతే, వారిని అనుసరించడమే ఉత్తమమైన మార్గం. ఈ సిద్ధాంతాన్నే కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు తూ.చ. తప్పకుండా పాటిస్తుంటాయి. ఉదాహరణకు ఓ చిన్న కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్

By Anil Kumar

మన కన్నా వృద్ధిలో ఉన్న వారిని మనం అధిగమించలేకపోతే, వారిని అనుసరించడమే ఉత్తమమైన మార్గం. ఈ సిద్ధాంతాన్నే కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు తూ.చ. తప్పకుండా పాటిస్తుంటాయి. ఉదాహరణకు ఓ చిన్న కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ వంటి దిగ్గజ కార్ కంపెనీని అధిగమించలేమని తెలిసినప్పుడు, ఆ ప్రయత్నాలను మానుకొని బిఎమ్‌డబ్ల్యూ కంపెనీని అనుసరిస్తుంటాయి.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

అదెలాగంటే.. ఇటీవ కాలంలోఅనేక కార్ల కంపెనీలు అచ్చం ఇతర బ్రాండ్ కార్లను పోలిన కార్లను తయారు చేస్తున్నాయి. మారుతి ఆల్టో నుండి రోల్స్ రాయిస్ ఫాంటమ్ వరకు ఎన్నో కార్లను చైనా కాపీ చేసింది. ఏ వస్తువుకైనా నకిలీని తయారు చేయటంలో చైనాను మించిన దేశం లేదు. ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో ఇలాంటి కాపీక్యాట్ కార్ల గురించి తెలుసుకుందాం రండి.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

గీలే జిఈ

రోల్స్ రాయిస్ కంపెనీతో పోటీ పడలేని చైనా కార్ల కంపెనీ ఒకటి అచ్చం రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును పోలి ఉండే కారును రూపొందించి. కాపీ రైట్స్ కేసుల నుండి తప్పించుకునేందుకు అక్కడక్కడ చిన్న మార్పులు చేసినప్పటికీ రోల్స్ రాయిస్ ఫాంటమ్‌కు జిరాక్స్ కాపీగా గీలే జిఈ కారును డిజైన్ చేశారు. సాంకేతికంగా ఇందులో 3.5-లీటర్ వి6 ఇంజన్ ఉంది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

రోల్స్ రాయిస్ ఫాంటమ్

ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన లగ్జరీ కార్ బ్రాండ్లలో రోల్స్ రాయిస్ ఒకటి. రోల్స్ రాయిస్ చాలా అతి కొద్ది మోడళ్లను మాత్రమే చాలా అరుదుగా విక్రయిస్తుంది. రోల్స్ రాయిస్‌లోని ప్రతి అంశం ప్రత్యేకమే. ప్రపంచ వ్యాప్తంగా రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న కస్టమర్లు కూడా కొందరే... సాంకేతికంగా ఇందులో 6.75-లీటర్ల కెపాసిటి గల వి12 ఇంజన్ ఉంది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

ఎమా బి11

చైనీస్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ కార్లను కూడా కాపీ కొట్టింది. బిఎమ్‌డబ్ల్యూ లైనప్‌లో ఉన్న ఫేమస్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఐ3 కారును కాపీ కొట్టి ఎమా బి11 కారును రూపొందించింది. ఈ రెండు మోడళ్లు చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

బిఎమ్‌డబ్ల్యూ ఐ3

బిఎమ్‌డబ్ల్యూ కేవలం ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్‌తో మాత్రమే లభిస్తోంది. అయితే, ఎమా బి11 కారు ఎలక్ట్రిక్-హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లభ్యమవుతోంది. అయితే, బిఎమ్‌డబ్ల్యూ ఐ3 కారుకు వచ్చినంత పాపులారిటీ ఎమా బి11 కారుకు తమ సొంత దేశంలోనే ఆశించిన ఆదరణ లభించలేదు.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

చాంగాన్ లింగ్‌జువాన్

చైనాకు చెందిన మరో కాపీ క్యాట్ అచ్చం టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీని పోలిన చాంగాన్ లింగ్‌జువాన్ ఎమ్‌పీవీని డిజైన్ చేసింది. ఇటీవల ప్యాసింజర్ కార్ల విపణిలో మంచి పాపులారిటీ దక్కించుకున్న జపాన్ ఎమ్‌పీ మోడల్ తరహాలోనే చైనా ఎమ్‌పీవీ చాంగాన్ లింగ్‌జువాన్ ఉంటుంది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

టయోటా ఇన్నోవా క్రిస్టా

ఫ్రంట్ మరియు సైడ్ డిజైన్ విషయానికి మూడవ వరుస సీటింగ్ ఉన్న ఎమ్‌పీవీ ఇన్నోవా క్రిస్టా డిజైన్‌ను తలపిస్తుంది. చూడటానికి రెండూ ఒకేలా ఉన్నప్పటికీ ఇన్నోవా క్రిస్టా కంటే దీని ధర చాలా తక్కువ.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

జింగ్‌నాన్ టిటి

భారతదేశపు మొట్టమొదటి సూపర్ హిట్ స్మాల్ కారు మారుతి 800ను కూడా వదల్లేదు. చెైనాకు చెందిన జోటే అనే కంపెనీ మారుతి 800 డిజైన్‌ను కాపీ కొట్టి జింగ్‌నాన్ టిటి అనే పేరుతో డిజైన్ చేసింది. ఏదేమైనప్పటికీ తరువాత కాలంలో సుజుకి నుండి మారుతి 800 డిజైన్ ఉపయోగించుకునేందుకు కావాల్సిన పరిమితులను పొందింది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

మారుతి 800

చైనా మార్కెట్లో మారుతి 800 డిజైన్‌తో వచ్చిన జింగ్‌నాన్ టిటి కారు మంచి సక్సెస్ అందుకోవడంతో సుజుకి నుండి అధికారికంగా అనుమతులు పొందింది. అనేక విదేశీ మార్కెట్లలో 800 మోడల్ వైదొలగినప్పటికీ, చైనా మార్కెట్లో మాత్రం కంటిన్యూగా అమ్ముడుపోయింది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

గీలే మెర్రీ 300

డౌటే లేదు, గీలే కంపెనీ మరో లగ్జరీ కారును కాపీ కొట్టింది. మెర్సిడెస్ బెంజ్ లైనప్‌లోని సి-క్లాస్ సెడాన్‌ను డిజైన్ పరంగా మక్కీకిమక్కి దింపేసింది. అత్యంత ఖరీదైన సి-క్లాస్ మోడల్‌ను కాపీ చేసిన తీసుకొచ్చిన గీలే మెర్రీ 300 ధర చైనాలో చాలా తక్కువ.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్

ఎంతో మంచి చైనీలు మెర్సిడెస్ సి-క్లా కళను గీలే మెర్రీ 300తో తీర్చుకున్నారు. ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్, బంపర్ దాదాపు అన్ని అంశాల పరంగా రెండు కార్లు కూడా చూడటానికి అచ్చం ఒకేలా ఉంటాయి.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

డియాబ్లో విటి

చైనీయులు చివరికి సూపర్ కార్లను కూడా వదల్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి ల్యాంబోర్గిని డియాబ్లో మోడల్‌ను కాపీ కొట్టి డియాబ్లో విటి అనే సూపర్ కారును డిజైన్ చేసింది. రెండు మోడళ్లను చూస్తే, డియాబ్లో విటి కారులో ఖచ్చితత్వం లేకపోవడం ఈజీగా కనిపెట్టేస్తారు.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

ల్యాంబోర్గిని డియాబ్లో

డిజైన్ పరంగానే కాకుండా, ఇంజన్ పరంగా కూడా ల్యాంబోర్గిని డియాబ్లోతో పోటీ పడేందుకు ఇందులో టయోటా నుండి సేకరించిన 450బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే వి8 ఇంజన్ కలదు. సూపర్ కార్ల మార్కెట్లో చైనా ఇప్పటికీ రాణించలేకపోతోంది. బహుశా అందుకే ఇలా ల్యాంబోర్గిని మోడల్‌ను కాపీ కొట్టింది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

విక్టరీ ఎస్10

విక్టరీ ఎస్10 ఎస్‌యూవీని తయారు చేసిన కంపెనీ కూడా చైనాదే. అమెరికాకు చెందిన మోస్ట్ ఫేమస్ లగ్జరీ ఎస్‌యూవీ క్యాడిల్లాక్ ఎస్కలాడే ఎస్‌యూవీ డిజైన్‌కు అద్దుగుద్దినట్లుగా కాపీ కొట్టారు. ఫ్రంట్ బంపర్, హెడ్ ల్యాంప్ సెక్షన్ మరియు సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్‌ను అచ్చం అలాగే దింపేశారు.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

క్యాడిల్యాక్ ఎస్కలాడే

విక్టరీ ఎస్10 చూడటానికి అచ్చం క్యాడిల్లాక్ ఎస్కలాడే లగ్జరీ ఎస్‌యూవీని పోలి ఉన్నప్పటికీ, ఎస్కలాడే క్యాడిల్లాక్‌లో అత్యంత శక్తివంతమైన ఇంజన్ ఉంది. అయితే, విక్టరీ ఎస్10 ఎస్‌యూవీలో 116బిహెచ్‌పి ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ ఇంజన్ ఉంది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

సోజౌ ఈగల్ క్యారీ

చైనా కాపీ క్యాట్ కంపెనీలు రోల్స్ రాయిస్ ఫాంటమ్, ల్యాంబోర్గిని డియాబ్లో కార్లతో ఆగిపోలేదు... పోర్షే కేమ్యాన్ కారును కూడా అచ్చం దింపేశాయి. పోర్షే పర్ఫామెన్స్ కారు కేమ్యాన్ ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌ పోలికలతో సోజౌ ఈగల్ క్యారీ పేరుతో రూపొందించింది

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

పోర్షే కేమ్యాన్

కేమ్యాన్ డిజైన్ శైలిలో ఉన్న సోజౌ ఈగల్ కారులో సాంకేతికంగా ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. అయితే, రియర్ డిజైన్‌లో ఉన్న కేమ్యాన్ నేమ్ స్టైల్‌ను కూడా సోజౌ ఈగల్ కాపీ కొట్టింది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

హువాంగాయ్ అరోరా

కొత్త తరానికి చెందిన శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ప్రీమియం ఎస్‌యూవీ మాత్రమే అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది. కొరియా దిగ్గజం దేశీయ విపణిలో అందిస్తున్న ఏకైక మోడల్ రెక్ట్సాన్. చైనాకు చెందిన హువాంగాయ్ అనే కార్ల కంపెనీ రెక్ట్సాన్ ఎస్‌యూవీకి అచ్చుగుద్దినట్లుగాఅరోరా ఎస్‌‌యూవీని డిజైన్ చేసింది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్

శాంగ్‌యాంగ్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో రెక్ట్సాన్ ఎస్‌యూవీని దేశీయంగా అందుబాటులో ఉంచింది. శాంగ్‌యాంగ్ లైనప్‌లో రెక్ట్సాన్ ఆశించిన సక్సెస్ సాధించలేదు అయితే డిజైన్ మాత్రం విభిన్నంగా ఉంటుంది.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

హువాంగాయ్ సియువి

హ్యుందాయ్ ఇండియాలో దిగుమతి చేసుకుని విక్రయించిన మోడళ్లలో శాంటాఫే ఒకటి. ఆశించిన మేర ఫలితాలు సాధించడంలేదని ఇటీవల దీనిని మార్కెట్ నుండి తొలగించారు. అయితే, భారత్‌లో ఉన్న ప్రతి మోడల్ చైనాలో ఉండాలనుకున్నారో ఏమో... అదే హువాంగాయ్ కంపెనీ శాంటాఫే మోడల్‌కు అచ్చుపోసినట్లుగా సియువి అనే మోడల్‌కు రూపాన్నిచ్చారు.

లగ్జరీ కార్లను కాపీ కొట్టిన చైనా కంపెనీలు

హ్యుందాయ్ శాంటాఫే

ఫ్రంట్, సైడ్ మరియు రియప్ డిజైన్ దాదాపు మునుపటి జనరేషన్ శాంటాఫే ఎస్‌యూవీ శైలిలోనే ఉంటుంది. హ్యుందాయ్ ప్రస్తుతానికి ఈ మోడల్‌ను మళ్లీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టే ఆలోచనలో లేదు.

Most Read Articles

English summary
Read In Telugu: 10 copycat cars from China: Rolls Royce Phantom to Toyota Innova Crysta
Story first published: Monday, May 28, 2018, 18:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X