స్విఫ్ట్‌ కారులో 10 అడుగుల కింగ్‌ కోబ్రాతో 80 కి.మీ ప్రయాణం.. పసిగట్టిన పిల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!!

ఇటీవల తరచూ పార్కింగ్ చేసిన బైక్‌, కార్లలో పాములు దూరి కలకలం సృష్టించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శీతాకాలం, వర్షాకాలంలో ఇలాంటివి ఎక్కువగా జరగడం చూస్తున్నాం. ఆ కాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో.. ఇలా కార్లు, బైక్‌ల్లో వెచ్చదనం కోసం దూరుతుంటాయి. ఇటీవల మహీంద్రా XUV500 లో కింగ్‌ కోబ్రా కలకలం సృష్టించగా.. తాజాగా మరో కోబ్రా స్విఫ్ట్‌ కారులోకి దూరింది.

మహారాష్ట్రలోని కందేవాడి నుంచి 80km దూరంలో కర్ణాటకలోని జగల్‌పేట్‌లో బంధువుల ఇంటికి.. ఓ కుటుంబం మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారులో వెళ్తోంది. మార్గమధ్యమలో జగల్‌పేట సమీపంలోని ఓ ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకుని.. ఆ తర్వాత మళ్లీ ప్రయాణం కొనసాగించారు. జగల్‌పేట చేరుకోగానే బంధువుల ఇంటికి చేరుకుని వారితో పిచ్చాపాటి ముచ్చట్లలో పడిపోయారు.

King-Cobra-In-Swift-Car

ఈ క్రమంలో వారు మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారును ఇంటి బయట పార్క్ చేశారు. కాసేపటికి కారు వెనుక భాగంలో ఓ పిల్లి సంచరిస్తూ ఉంది. మొదట కారు యజమాని కుటుంబం ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ పిల్లి కారు చుట్టూ తిరుగుతుండటంతో వారు అనుమానంతో కారు వెనుక భాగాన్ని పరిశీలించసాగారు.

మారుతి స్విఫ్ట్‌ కారు కింద నుంచి సౌండ్‌ రావడంతో అక్కడ 10 అడుగుల పొడవైన కోబ్రా పాము ఉండటాన్ని గుర్తించారు. దీంతో భయాందోళనకు గురై ముందుగా మారుతీ సుజుకి స్విఫ్ట్ యజమాని వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

King-Cobra-In-Swift-Car

మారుతీ సుజుకి స్విఫ్ట్ వెనుక భాగంలో దాగి ఉన్న విషపూరితమైన 10 అడుగుల కింగ్ కోబ్రాను అటవీశాఖ అధికారులు దాదాపు 2 గంటల పాటు శ్రమించి బయటకు తీసి రక్షించారు. అనంతరం పామును సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టినట్లు సమాచారం. మధ్యలో గుడి దగ్గర ఆగినప్పుడు పాము దూరి ఉండవచ్చని యజమాని సందేహం వ్యక్తం చేయగా.. కందేవాడిలో వారు బయలుదేరినప్పుడే కారు అందులోకి దూరి ఉండవచ్చని అధికారులు సందేహం పేర్కొంటున్నారు.

ఇలా కారులో దాక్కున్న పామును పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. తరచుగా ఇలాంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహీంద్రా XUV700 కారులో దూరిన పామును కుక్క పసిగట్టి యజమానిని అప్రమత్తం చేసింది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

King-Cobra-In-Swift-Car

ఇలా కారు, బైక్‌ లేదా ఇంకా వేరే ఏదైనా వాహనాల్లో పాములు దూరినప్పుడు ముందుగా మీరు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. అటవీ అధికారులకు వెంటనే సమాచారం అందించాలి. వారికి పాములను పట్టుకోవాలో శిక్షణలో నేర్పుతారు. పాములను బయటకు తీసే ప్రయత్నాలు సామాన్యులు చేస్తే అది వారి ప్రాణానికే ప్రమాదం కలిగించే అవకాశం ఉంది.

King-Cobra-In-Swift-Car

కాబట్టి అటవీ అధికారులను పిలిపించి వారి ద్వారా పాములను అడవుల్లోకి వదిలేయాలి. ఇటీవల జరిగిన రెండు సంఘటనల్లోనూ కుక్కలు, పిల్లులు వంటి జంతువులు పాములను గుర్తించడంలో సహాయపడ్డాయి. కాబట్టి ఇలాంటి పెంపుడు జంతువులను మీ ఇళ్లలో ఉంచుకోవడం కూడా మంచి ఆలోచన. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన జీవుల సంచారాన్ని పసిగట్టగలవు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 1, 2023, 19:59 [IST]
English summary
10 feet king kobra snake hides under maruti suzuki swift car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+