ఫెరారి కార్లను కలిగి ఉన్న పది ఇండియన్ సెలబ్రిటీలు

By N Kumar

సామాన్య ప్రజలకు ఫెరారి, ల్యాంబోర్గిని వంటి కార్లను కొనుగోలు చేసే స్థోమత లేకపోవచ్చు. కాని దేశీయంగా ఉన్న ఎంతో మంది నటులు మరియు వ్యాపారవేత్తలలో కేవలం అతి కొద్ది మాత్రమే ఫెరారి కార్లను కలిగి ఉన్నారు. అయితే దేశీయంగా ఫెరారి కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే పది మంది ఉన్నారు.

ఫెరారి కార్లను కలిగి ఉన్న 10 మంది ఇండియన్ సెలబ్రిటీల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి....

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ 29 వ టెస్ట్ సెంచరీ చేసినందుకు గాను మైఖేల్ షుమాకర్ నుండి బహుమానంగా ఫెరారి కారును పొందాడు. సచిన్ చేసిన ఈ సెంచరీ సర్ డాన్ బ్రాడ్‌మ్యాన్ రికార్డ్‌కు సమానంగా నిలిచింది. అయితే సచిన్ టెండూల్కర్ ఈ కారును ప్రముఖ వ్యాపార దిగ్గజం జయేశ్ దేశాయ్‌కు అమ్మేశాడు.

సంజయ్ దత్

సంజయ్ దత్

సంజయ్ దత్ కేవలం తన అద్బుతమైన నటనకు మాత్రమే ప్రత్యేకం కాదు. వివాదాస్పద జీవితానికి కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఈ రెండూ మాత్రమే కాదు కార్ల పట్ల అమితమైన ఇష్టం కూడా కలిగి ఉన్నాడు. ఇతని కార్ల గ్యారేజ్‌ని గమనిస్తే, ఆడి ఆర్8, మెర్సిడెస్ బెంజ్ ఎమ్-క్లాస్ మరియు ఇతర ఖరీదైన కార్లను కలిగి ఉన్నాడు. వీటన్నింటితో పాటు ఫెరారి 599 జిటిబి ని కలిగి ఉన్నాడు.

ఇమ్రాఖాన్ - బాలీవుడ్ నటుడు

ఇమ్రాఖాన్ - బాలీవుడ్ నటుడు

ఆకట్టుకునే అందం ఉన్న నటుడు ఇమ్రాఖాన్, ఇతని నటనలో ఎంత అభినయం ఉందో తన కార్ల ఎంపికలో కూడా అంతో ప్రేమను కలిగి ఉన్నాడు. ఇతను ఫెరారి కాలిఫోర్నియా రెడ్ కలర్‌ కారును కలిగి ఉన్నాడు. ఇక స్నేహితులతో ఇలాంటి కార్లలో లాంగ్ డ్రైవ్‌కెళ్లడం అంటే అదో సరదా.

నాగ చైతన్య

నాగ చైతన్య

తెలుగులో ఫెరారి కారును కలిగి ఉన్న ఏకైక వ్యక్తి నాగ చైతన్య, తండ్రి నాగార్జున నుండి నటనతో పాటు కార్ల మీద ప్రేమను కూడా అవలంభించుకున్నాడు అని చెప్పకనే తెలుస్తోంది. ఇతన వద్ద కార్లలో ఫెరారికి చెందిన ఎఫ్430 కారు కలదు.

Also Read:నాగార్జున ఫ్యామిలీ కారు కలెక్షన్

రతన్ టాటా

రతన్ టాటా

ఇండియాలో అతి చౌకైన నానో వంటి కార్ల అభివృద్దికి పితామహుడు అని చెప్పవచ్చు. కాని ఇతను నడిపే కార్ల విషయానికి వస్తే ఫెరారి కాలిఫోర్నియాను ఎక్కువగా ఇష్టపడతాడు. ముంబాయ్ నగరంలో తరచూ ఈ కారులో చక్కర్లు కొడుతూ ఉంటాడు.

Also Read: రతన్ టాటా కార్లు మరియు అతని గురించి అతి ముఖ్యమైన విషయాలు

విజయ్ మాల్యా

విజయ్ మాల్యా

ఎంత మందిని మోసం చేసాడో, ఎన్ని కోట్లు కొల్లగొట్టాడో స్పష్టంగా తెలియదు కాని, ఇతను ఎంచుకునే కార్ల విషయానికి వస్తే ఎవరూ సాటిరారు. ఒకానొక కాలంలో ఇతను రోల్ మోడల్‌గా ఎంచుకున్నవారే దూషించడం ప్రారంభించారు. అయితే ఇతని వద్ద ఉన్న ఫెరారి విషయానికి వస్తే ఫెరారిలోని డినో కారును కలిగి ఉన్నాడు.

Also Read: బీరు, బారు, కారు ఇదీ విజయ్ మాల్యా తీరు...!

లలిత్ మోడి

లలిత్ మోడి

భారత్‌లో ప్రతి ఏడాది కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సంఘానికి మొదటి ఛైర్మెన్ మరియు కమీషనర్‌గా పనిచేసారు. మన ఎక్కడా చూడని విధంగా సిఆర్ఐ3కెఇటి అనే రిజిస్ట్రేషన్ నెంబర్‌ గల ఫెరారి ఎఫ్12 బెర్లినెట్టాను కలిగి ఉన్నాడు.

 భూషన్ కుమార్

భూషన్ కుమార్

సంగీత పరిశ్రమలో ఎంతో పేరుగాంచిన వ్యక్తి భూషన్ కుమార్. సంగీతం మాత్రమే కాదు కార్లన్నా ఇతనికి పిచ్చే. ఇతని వద్ద ఫెరారి 458 ఇటాలియా స్పైడర్ కారును కలిగి ఉన్నాడు.

మహమ్మద్ నిషామ్

మహమ్మద్ నిషామ్

సమాజంలో వ్యతిరేక ముద్ర వేసుకున్న వారు అతి తక్కువ కాలంలో అందిరికంటా పడిపోతారు. ఇండియాలో ఫెరారి కార్లను కలిగి ఉన్న వ్యక్తుల్లో మహమ్మద్ నిషామ్ కూడా ఒకరు. ఇతను ఒక సెక్యురిటీ గార్డ్‌ మీదకు కారు ఎక్కిచి చంపడం వలన ఇప్పుడు జైలుకెళ్లాడు.

గౌతమ్ సింఘానియా

గౌతమ్ సింఘానియా

లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు నిజమైన ప్రేమికుడు అంటే ప్రఖ్యాత రేసర్ గౌతమ్ సింఘానియా అని చెప్పవచ్చు. ఇతని వద్ద ఫెరారి ఎఫ్458 ఇటాలియా కారును కలిగి ఉన్నాడు. అంతే కాదు ఇతనికి ప్రత్యేక స్పోర్ట్స్ ట్రాక్ కూడా కలదు.

ఫెరారి కార్లను కలిగి ఉన్న పది ఇండియన్ సెలబ్రిటీలు

  • రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!

More from DriveSpark

Article Published On: Saturday, July 16, 2016, 11:33 [IST]
English summary
10 Ferrari Owners Celebrities In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+