టాప్ 10 ఇండియన్ రోడ్ ఫ్యాక్ట్స్
మన భారతదేశంలో రహదారులకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో కెల్లా అత్యధిక దూరం రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో మన దేశం ద్వితీయ స్థానంలో ఉంది. మనదేశంలో దాదాపు 43.20 లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్ నెట్‌వర్క్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
భారతదేశ రోడ్ నెట్‌వర్క్‌లో 1000 కిలోమీటర్లకు పైగా ఎక్స్‌ప్రెస్‌వేలు, 79,243 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 13.19 లక్షల కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు మరియు ఇతర ప్రధాన జిల్లా, గ్రామీణ రహదారులు ఉన్నాయి. కాగా.. ఈ రోడ్ నెట్‌వర్క్ విస్తరణ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.
సరే ఇదంతా అటుంచితే.. మనదేశంలో పొడవైన రహదారి, పొడవైన ఫ్రీవే, పొడవైన ఫ్లైఓవర్, పొడవైన రోడ్ బ్రిడ్జ్, పొడవైన సీ బ్రిడ్జ్ మొదలైనవి ఎక్కడున్నాయో మీకు తెలుసా..? ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో భారతదేశంలోని రోడ్లకు సంబంధించిన పది అద్భుతాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
ఇది కూడా చూడండి: భారతదేశంలో కెల్లా 10 పొడవైన జాతీయ రహదారులు
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో భారతదేశంలోని రోడ్లకు సంబంధించిన పది అద్భుతాలను తెలుసుకోండి.

అతి పొడవైన జాతీయ రహదారి
మనదేశంలో కెల్లా అతిపొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్ 7. ఈ రోడ్డు మొత్తం పొడవు 4572 కిలోమీటర్లు. ఇది వారణాసి నుంచి కన్యాకుమారిని కలుపుతూ పోతుంది. కానీ, కొత్త స్కీమ్ ప్రకారం పొడవైన జాతీయ రహదారి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉంటుంది (ఎన్‌హెచ్ 44).

బెస్ట్ నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే
అహ్మదాబాద్ వడోదరా ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశంలోని బెస్ట్ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటి, దీనిని నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే 1 అని కూడా పిలుస్తారు. మొత్తం 95 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే అహ్మదాబాద్-వడోదరాలను కలుపుతుంది, దీనిని గోల్డెన్ క్వాడ్రిలటెరల్ ప్రాజెక్ట్ క్రింద్ 2004లో నిర్మించారు. భారతదేశంలో మొదటి ఎక్స్‌ప్రెస్‌వేని ముంబై-పూనే మధ్య ఏర్పాటు చేశారు. మనదేశంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే అత్యంత అందమైన రోడ్డు.

పొడవైన ఫ్రీవే
చెన్నై పోర్ట్ మధురవాయల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో కెల్లా అతిపొడవైన ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే. దీని మొత్తం పొడవు 19 కిలోమీటర్లు. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్ పివిఎన్ఆర్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే, బెంగుళూరు హోసూర్ రోడ్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి.

అతి పొడవైన టన్నల్ రోడ్డు
మనదేశంలో కెల్లా అతి పొడవైన టన్నల్ రోడ్డు చెనాని నాష్రి టన్నల్ లేదా పట్నిటాప్ టన్నల్ రోడ్డు. జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న చెనాని వద్ద ఈ టన్నల్ రోడ్డు నిర్మించారు. ఈ టన్నల్ మొత్తం పొడవు 9.2 కిలోమీటర్లు.

క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్
చెన్నైలోని కత్తిపారా జంక్షన్ వద్ద ఉన్న క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్ దేశంలో కెల్లా అతిపెద్దది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్. ఇది గ్రాండ్ సథరన్ ట్రంక్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, పూనమల్లే రోడ్, అన్నా సలై జంక్షన్లను కలుపుతుంది.

అతిపెద్ద అర్బన్ ఫ్లైఓవర్
బెంగుళూరులో గామ్మన్ సంస్థ నిర్మించిన హెబ్బాల్ ఫ్లైఓవర్ దేశంలో కెల్లా అతిపెద్ద అర్బన్ ఫ్లైఓవర్. దీని పొడవు 5.23 కిలోమీటర్లు. ఇది అవుటర్ రింగ్ రోడ్డుని, బళ్లారి రోడ్డును కలుపుతుంది. భారతదేశంలోని సివిల్ ఇంజనీరింగ్ వండర్లలో హెబ్బాల్ ఫ్లైఓవర్ కూడా ఒకటి.

అతి పొడవైన రివర్ బ్రిడ్జ్
బిహార్‌లోని గంగా నదిపై నిర్మించిన మహాత్మా గాంధీ సేతు దేశంలో కెల్లా అతి పొడవైన రివర్ బ్రిడ్జ్. ఇది పాట్నా, హాజీపూర్‌లను కలుపుతుంది. దీని మొత్తం పొడవు 5.5 కిలోమీటర్లు. ఇదొక 4-లేన్ బ్రిడ్జ్.

అతిపొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్
మనదేశంలో కెల్లా అతిపొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ రాజమండ్రిలోని గోదావరి నదిపై నిర్మించారు. ఒకే వంతెనపై క్రింది భాగంలో రైలు, పైభాగంలో వాహనాలు వెళ్తుంటాయి. ఇది దేశంలోనే కాదు ఆసియాలోనే రెండవ అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పొడవు 2.7 కిలోమీటర్లు.

అతి పొడవైన సీ బ్రిడ్జ్
దేశంలో కెల్లా అతి పొడవైన సీ బ్రిడ్జ్ బంద్రా వోర్లీ సీ లింక్. రెండవ అతిపెద్ద సీ బ్రిడ్జ్ పంబన్ బ్రిడ్జ్. బాంద్రా వోర్లీ సీ లింక్ బ్రిడ్జ్ బాంద్రా, వోర్లీ ప్రాంతాలను కలుపుతుంది, ఇది ప్రతిపాదిత వెస్టర్న్ ఫ్రీవేలో భాగం. ఇది కేబుల్ ఆధారిత బ్రిడ్జ్. దీని మొత్తం పొడవు 22 కిలోమీటర్లు.

అతిపెద్ద టోల్ ప్లాజా
దేశంలో కెల్లా అతిపెద్ద టోల్ ప్లాజా ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్లో ఢిల్లీ-గుర్గావ్ బార్డర్ వద్ద ఉంది. ఇక్కడ 32 టోల్ బూత్‌లు ఉన్నాయి. ఇది దేశంలోనే కాదు ఆసియా మొత్తంలో కెల్లా అతిపెద్ద టోల్ ప్లాజా.


Click it and Unblock the Notifications








