ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రైల్వే వ్యవస్థల్లో నాలుగవ అతి పెద్ద రైల్వే "ఇండియన్ రైల్వే", దేశీయంగానే కాకుండా దీనికి సమీపంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలకు రైల్వే సామ్రాజ్యాన్న

By N Kumar

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రైల్వే వ్యవస్థల్లో నాలుగవ అతి పెద్ద రైల్వే "ఇండియన్ రైల్వే", దేశీయంగానే కాకుండా దీనికి సమీపంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలకు రైల్వే సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం మూడు విదేశాలకు రైల్వే సర్వీసులను నడుపుతోంది. ఇతర దేశాలతో కూడా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తోంది. ఇండియన్ రైల్వే అంతర్జాతీయంగా రైల్వే లైన్లను పంచుకోనున్న దేశాల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

జోగ్బాని-బిరథ్ నగర్ లింక్ - నేపాల్

జోగ్బాని-బిరథ్ నగర్ లింక్ - నేపాల్

ఇండియా మరియు నేపాల్‌ను కలిపే రెండు రైల్వే రూట్లు ఉన్నాయి. అవి రక్సాల్ జంక్షన్ గుండా వెళ్లే బిహార్-సిర్సియా మరియు బిహార్ - ఖాజూరి మధ్య రైలు సర్వీసులు ఉన్నాయి.

Picture Credit: mapio

సంజౌతా ఎక్స్‌ప్రెస్ - పాకిస్తాన్

సంజౌతా ఎక్స్‌ప్రెస్ - పాకిస్తాన్

భారత దాయాది దేశమైన పాకిస్తాన్ మధ్య కూడా ఒక రైల్వే ఉంది. ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఏకైక రైల్వే లైను కూడా ఇదే. సంజౌతా ఎక్స్‌ప్రెస్ లేదా థార్ ఎక్స్‌ప్రెస్‌‌గా పిలువబడే ఈ రైలు రెండు దేశాలకు రాకపోకలు సాగించడానికి వాఘా బార్డర్ మీదుగా ప్రయాణిస్తుంది.

Picture Credit: Najanaja/Wiki Commons

మైత్రి ఎక్స్‌ప్రెస్ - బంగ్లాదేశ్

మైత్రి ఎక్స్‌ప్రెస్ - బంగ్లాదేశ్

అంతర్జాతీయ బార్డర్ మీదుగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మరియు భారత్‌లోని పశ్చిబెంగాల్‌లో గల కలకత్తాలను కలుపుతూ పోతుంది ఈ మైత్రి ఎక్స్‌ప్రెస్ రైలు. ప్రతి వారంలో ఆరు రోజుల పాటు సర్వీసులను అందిస్తుంది.

Picture Credit: Binodkumars/Wiki Commons

భూటాన్ రైల్వే - భూటాన్

భూటాన్ రైల్వే - భూటాన్

భూటాన్ మరియు ఇండియాలను కలపడానికి ఇండియన్ రైల్వే రెండు దేశాల మధ్య రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలో ఉంది.

Picture Credit: YouTube

 మయన్మార్ రైలు - మయన్మార్

మయన్మార్ రైలు - మయన్మార్

భారతదేశానికి అత్యంత సమీప దేశమైన మయన్మార్‌‌కు రైల్వే లైన్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దీనిని మణిపూర్ నుండి బర్మా మధ్య నిర్మిస్తున్నారు.

Picture Credit: calflier001/Wiki Commons

వియత్నాం రైల్వే లైను - వియత్నాం

వియత్నాం రైల్వే లైను - వియత్నాం

కేంద్ర ప్రభుత్వం మణిపూర్ నుండి వియత్నాంకు రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తోంది

Picture Credit: Dragfyre/Wiki Commons

థాయిలాండ్‌ లైన్ - థాయిలాండ్

థాయిలాండ్‌ లైన్ - థాయిలాండ్

అంతర్జాతీయంగా రైల్వే సేవలను విస్తరించాలే ఉద్దేశ్యంతో భారత దేశం తీసుకున్న కొన్ని ఎంపిక చేసుకున్న దేశాల జాబితాలో థాయిలాండ్ కూడా ఉన్నట్లు సమాచారం.

Picture Credit: calflier001/Wiki Commons

చైనా రైల్వే లింక్

చైనా రైల్వే లింక్

ఇండియన్ రైల్వే న్యూ ఢిల్లీ నుండి చైనాలోని కన్మింగ్‌ నగరాల మధ్య హై స్పీడ్ రైళ్లను నడపడానికి ఆసక్తిగా ఉంది.

Picture Credit: Wiki Commons

మలేషియా రైల్వే లింక్

మలేషియా రైల్వే లింక్

బర్మా మరియు ఇండియా మధ్య ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రైల్వే ప్రారంభమయితే, ఇండియా నుండి బర్మా మీదుగా మలేషియాకు భవిష్యత్తులో రైలు సేవలు విస్తరించనున్నారు.

Picture Credit: calflier001/Wiki Commons

సింగపూర్ రైల్వే లింక్

సింగపూర్ రైల్వే లింక్

బర్మా మరియు ఇండియా మధ్య రైల్వే నిర్మాణం పూర్తయితే, ఇండియా నుండి బర్మా మీదుగా సింగపూర్‌కు కూడా భవిష్యత్తులో రైల్వే సేవలు విస్తరించనున్నారు.

Picture Credit: EquatorialSky2/Wiki Commons

Source

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

భారతదేశపు రవాణా వ్యవస్థలో రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి రోజూ కొన్ని లక్షల మధ్య ఇండియన్ రైళ్ల గమ్య స్థానాలకు చేరుకుంటుంటారు. తరచూ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి ప్రతి రైలుకు ఉండే చివరి పెట్టకు వెనకాల పసుపు రంగులో ఓ X మార్క్ ఉంటుంది.

ఇలా ఎందుకుంటుందో చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ప్రతి రైలు పెట్టెకు చివరిలో X మార్క్ ఉండటం వెనుక రీజన్స్ ఏంటో చూద్దాం రండి...

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

నిజమే, కదా.... రైలు వెళ్లిపోయేటపుడు మనకు స్పష్టంగా కనబడేది చివరి రైలు పెట్టె వెనక భాగం మాత్రమే. ఆ పెట్టె చివర్లో పసుపు రంగులో ఉండే X మార్కును చాలాసార్లు చూసుంటాం. కొంత మంది చూసుంటారు, కొంత మంది గమనించి ఉండరు.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

రైలు పెట్టె చివర్లో ఇలా X మార్క్ ఉంటే, ఆ రైలు ఎలాంటి సాంకేతిక లోపం లేదని అర్థం. అంతే కాకుండా, రైలు సురక్షితంగా వెళుతోందని సూచిస్తుంది.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

ఇండియన్ రైల్వే ఇప్పుడు ఆ X మార్కు క్రింద ఎర్ర బుగ్గను అందించింది. ఇది ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి వెలుగుతూ ఉంటుంది.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

గతంలో ఈ ఎర్ర బుగ్గ వెలగడానికి ఇంధనాన్ని ఉపయోగించేవారు. అయితే, ఇప్పుడు అన్ని రైళ్లలో కూడా వీటి స్థానంలో ఎలక్ట్రిక్ లైట్లు వచ్చాయి.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

అంతే కాకుండా, X మార్కు క్రింది కుడివైపున LV అక్షరాలు ఉన్న ఒక చిన్న బోర్డు వేళాడుతూ ఉంటుంది. ఎరుపు రంగు బోర్డు మీద తెలుపు లేదా నలుపు రంగులో LV అనే ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఈ బోర్డు రైలు సురక్షితంగా ఉందనే విషయాన్ని సూచిస్తుంది.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

ఒక వేళ రైలుకు చివర్లో ఈ బోర్డు లేనట్లయితే ఆ రైలులో సమస్య ఉన్నట్లు అర్థం. ఆ బోర్డు ఎక్కడైనా పడిపోతే రైలు ప్రమాదంలో పడ్డట్లే. అంటే ఆ రైలు సాంకేతిక సమస్య ఉంది, అధికారులు వెంటనే రిపేరి చేయాలని అర్థం.

Picture credit: Wiki Commons

More from DriveSpark

Article Published On: Friday, June 17, 2016, 15:41 [IST]
English summary
10 International Train Routes From India
Read more on: #రైలు #rail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+