ప్రపంచంలో కెల్లా టాప్ 10 బెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్
ఇదివరకు డబ్బున్నోళ్లు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మొదలైన విఐపిలు ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసేవాళ్లు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది, విఐపిలు విలాసాని కన్నా భద్రతకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. కొందరైతే విలాసవంతమైన సౌకర్యాలతో పాటుగా మంచి భద్రతనిచ్చే వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
మరికొందరు విఐపిలు అయితే, నేరుగా బుల్లెట్ ప్రూఫ్ వంటి సాయుధ కార్లను కొనుగోలు చేస్తున్నారు. కార్ మేకర్లు ఇలాంటి ప్రముఖల భద్రతను క్యాష్ చేసుకునేందుకు తమ సాయుధ కార్లను ఇండియాలోకి దింపేస్తున్నాయి. కొన్ని దేశీయ కంపెనీలైతే నేరుగా తమ ప్రస్తుత వాహనాలనే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా తీర్చిదిద్దేస్తున్నాయి. ఏదైతేనేం, విఐపిల భయం కాస్తా కార్ కంపెనీల జేబులు నింపుతోంది.
చోటో మోటా విఐపిల విషయంలో భద్రతా వాహనాలు కేవలం బుల్లెట్ ప్రూఫ్‌ను మాత్రమే కలిగి ఉంటాయి. అదే ప్రధానమంత్రులు, దేశాధ్యక్షుల వాహనాలైతే కేవలం బుల్లెట్ల దాడినే కాకుండా, బాంబు దాడులు, రసాయన దాడులను తట్టుకోవటంతో పాటుగా కొన్ని సాయుధ సామాగ్రిని, అత్యవసర సమయాల్లో రక్షణ సామాగ్రిని కూడా కలిగి ఉండి, అధునాత సాంకేతికతో తయారు చేయబడి ఉంటాయి.
ఉదాహరణకు మన ప్రధానమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లో సాయుధ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కార్లు, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కార్లు ఉంటాయి. అలాగే మన దేశ రాష్ట్రపతి ఉపయోగించే మెర్సిడెస్ బెంజ్ ఎస్600 పుల్‌మ్యాన్ కారు కూడా సైన్యం ప్రమాణాలకు లోబడి కొన్ని చిన్నపాటి ఆయుధాలతో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. ఈ కార్లు హ్యాండ్ గ్రనేడ్స్, ఎక్స్‌ప్లోజివ్స్‌ను సమర్థవంతంగా తట్టుకోగలవు.
ఇలాంటి సాయుధ కార్లన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన 10 సాయుధ కార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

ప్రపంచంలో కెల్లా 10 అత్యుత్తమ సాయుధ కార్లకు సంబంధించిన సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

1. మెర్సిడెస్ బెంజ్ ఎస్-గార్డ్ 600
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ అందిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్-గార్డ్ 600 సాయుధ కారును ఇప్పటికే మనదేశ రాష్ట్రపతి అధికారిక కారుగా వినియోగిస్తున్నారు. ఈ కారు చాలా సురక్షితమైనది. ఈ కారుపై తుపాకీతో అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినా కూడా లోపల కూర్చున్న వారికి ఎలాంటి ప్రమాదం సంభవించదు.
Picture credit: Mercedes Benz
మెర్సిడెస్ బెంజ్ ఎస్-గార్డ్ 600
క్లోజ్ రేంజ్ స్పైన్ ఫైర్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్స్, హై వెలాసిటీ ప్రొజెక్టైల్స్‌తో పాటుగా బాంబు దాడులను సైతం ఇది సమర్థవంతంగా తట్టుకోగలదు. ఈ కారులో శక్తివంతమైన టిన్-టర్బోచార్జ్డ్ 5.5 లీటర్, వి12 517 హార్స్‌పవర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 4 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుంది. దీని ధర 1.4 మిలియన్ డాలర్లు.
Picture credit: Mercedes Benz
2. ఆడి ఏ8 సెక్యూరిటీ
మరో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి అందిస్తున్న ఏ8 లగ్జరీ కారులో విఐపిల కోసం ఓ సాయుధ వెర్షన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఆడి ఏ8 సెక్యూరిటీగా పిలిచే ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు బాడీని ధృడమైన స్టీల్, టైటానియంతో తయారు చేశారు. ఇది బాంబు దాడులు, రసాయన దాడులను సమర్థవంతంగా ఎదుర్కుంటుంది.
Picture credit: Audi
ఆడి ఏ8 సెక్యూరిటీ
ఆడి ఏ8 సెక్యూరిటీ కారులో 450 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే డబ్ల్యూ12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 5 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కస్టమర్ల కాన్ఫిగరేషన్‌ను బట్టి దీని ధర 6.85 లక్షల డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల మధ్యలో ఉంటుంది.
Picture credit: Audi
3. బెంట్లీ ముల్లీనెర్
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ అందిస్తున్న పవర్‌ఫుల్ ముల్సానె సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో సాయుధ వెర్షన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సాయుధ బెంట్లీ కారు పేరు బెంట్లీ ముల్లీనెర్. అటు విలాసంతో పాటు ఇటు హై-ఎండ్ ఆర్మోర్ ప్రొటెక్షన్‌ను అందించడం ఈ కారు ప్రత్యేకత. దీని ధర 4 లక్షల డాలర్లు.
Picture credit: Bentley
బెంట్లీ ముల్లీనెర్
బెంట్లీ ముల్లీనెర్ కారులో ప్రయాణించే వారికి అన్ని వైపుల నుంచి రక్షణ ఉంటుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు బాంబు దాడులను, రసాయన దాడులను తట్టుకుంటుంది. ఇందులో ట్విన్ టర్బోచార్జ్డ్, 6.7 లీటర్, 505 హార్స్ పపవర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 5 సెకండ్ల వ్యవధిలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 184 కిలోమీటర్లు.
Picture credit: Bentley
4. మేబాక్ 62ఎస్
మెర్సిడెస్ బెంజ్‌కి చెందిన మరో బ్రాండే ఈ మెబాక్. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్మోరింగ్ కంపెనీ రిక్ ఈ మేబాక్ కారును సాయుధ భద్రతా వాహనంగా తీర్చిదిద్దిస్తుంది. మేబాక్ 62ఎస్ కారుపై 10 మీటర్ల దూరం నుంచి హై-పవర్ స్నిపర్ రైఫిల్‌తో దాడి చేసిన, కారులోని ప్యాసింజర్లకు మాత్రం ఎలాంటి హాని జరగదట.
Picture credit: Daimler
మేబాక్ 62ఎస్
మేబాక్ యొక్క అందమైన ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌ను ఏ మాత్రం మార్చకుండానే, దీనిని సాయుధ వాహనంగా తీర్చిదిద్దారు స్విస్ కంపెనీ రిక్. మేబాక్ కారులో ఏఎమ్‌జి వి12 బైటర్బో, 6.0 లీటర్, 620 హార్స్ పవర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 5 సెకండ్ల వ్యవధిలోనే0-100 కి.మీ. దూరాన్ని అందుకుంటుంది. దీని ధర 3.52 లక్షల డాలర్లు.
Picture credit: Daimler
5. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ
జర్మన్ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న హై-పెర్ఫార్మెన్స్ సెడాన్ 7-సిరీస్‌లో కంపెనీ ఓ సాయుధ వెర్షన్‌ను అందిస్తోంది. వాస్తవానికి మనదేశ ప్రధానమంత్రి ఉపయోగించేది ఈ తరహా సాయుధ కారునే. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీగా పిలిచే ఈ కారు జర్మన్ ఇంజనీరింగ్‌ను ప్రతిభింభింపజేస్తుంది. రెగ్యులర్ 7-సిరీస్ కారును సాయుధ కారుగా మార్చడం వలన బరువు భారీగా పెరిగినప్పటికీ, పెర్ఫార్మెన్స్‌లో ఎక్కడా రాజీపడకుండా ఉండేలా దీనిని తయారు చేశారు.
Picture credit: BMW
బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ
బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ వెలాసిటీ ప్రొజెక్టైల్ వెపన్స్, కెమికల్ అటాక్స్‌ను సైతం సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఏదైనా బుల్లెట్ తగిలితే దానంతట అదే స్వయంగా సీల్ అయ్యే ఫ్యూయెల్ ట్యాంక్ ఈ కారులోని ప్రత్యేకత. ఈ కారులో 6.0 లీటర్, వి-12, 535 హార్స్ పవర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
Picture credit: BMW
6. పోప్‌మొబైల్
పోప్‌మొబైల్‌గా పిలిచే ఈ హై-సెక్యూరిటీ కారును జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ 16వ పోప్ బెనడిక్ట్ కోసం 2012లో ప్రత్యేకంగా తయారు చేసింది. కంపెనీ అందిస్తున్న ఎమ్-క్లాస్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని దీనిని మోడిఫై చేశారు. పోప్ ప్రజా సందర్శనార్థం బయటకు వచ్చినప్పుడు, ప్రజలకు ఆయన స్పష్టంగా కనిపించే విధంగా దీనిని తయారు చేశారు. ప్రస్తుత తరం ఎమ్-క్లాస్‌లోని సాంకేతిక ప్రత్యేకతలను ఉపయోగించి ఈ వాహనాన్ని రూపొందించారు. దీని ఖరీదు 3.11 లక్షల డాలర్లు.

పోప్‌మొబైల్
అధునాతన ఇంటీరియర్, కారు వెనుక భాగంలో పోప్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కుర్చీ, విశాలమైన స్పేస్, పెద్ద గ్లాస్ ప్యానెల్స్, మంచి కాంతితో ప్రకాశించే రూఫ్ లైనింగ్ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ సాయుధ కారును తయారు చేశారు. ఇదొక బుల్లెట్ ప్రూఫ్ కారు. బాంబు దాడులు, రసాయన దాడులను ఇది సమర్థవంతంగా తట్టుకుంది. అటాక్‌లో టైర్లు పంక్చర్ అయినప్పటికీ, ఇది గంటకు 70 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో వి8, 5.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

7. కాంక్వెస్ట్ నైట్ ఎక్స్‌వి
విఐపిలు, పారామిలటరీ బలగాల కోసం సాయుధ వాహనాలను తయారు చేసే టొరంటోకు చెందిన కాంక్వెస్ట్ వెహికల్స్ కంపెనీ అందిస్తున్న నైట్ ఎక్స్‌వి మోడల్ చూడటానికి యుద్ధ ట్యాంకర్‌ని తలపిస్తుంది. ఇది అత్యంత ధృడమైన బాడీని కలిగి ఉండి, దీని లోపల ఉండే వ్యక్తులకు అన్ని వైపుల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది.
Photo credit: Conquest Vehicles
కాంక్వెస్ట్ నైట్ ఎక్స్‌వి
కాంక్వెస్ట్ నైట్ ఎక్స్‌విలోని చక్రాలను సైతం ఫోర్జ్డ్ 6061 అల్యూమినియంతో తయారుచేయబడి ఉంటాయి. ఇందులో జిఎమ్ వి8, 6.0 లీటర్, 325 హార్స్ పవర్ పెట్రోల్ ఇంజన్‌ను కానీ లేదా కమ్మిన్స్ ఐఎస్‌బి 6.7 లీటర్ డీజిల్ ఇంజన్‌ను కానీ ఆఫర్ చేస్తారు. ఈ వాహనం అతి భారీగా ఉన్నప్పటికీ, ఇది గంటకు గరిష్టంగా 153 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది. దీని ధర 3.10 లక్షల డాలర్లు.
Photo credit: Conquest Vehicles
8. కాడిలాక్ వన్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగిస్తున్న ఈ తరహా కారునే. రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలుడు పదార్థాలను సైతం ఈ కారు ఎదుర్కోగలదు. కారు చుట్టపక్కల హ్యాండ్ గ్రనేడ్ విసిరినా కూడా కారులోని ప్రయాణికులకు ఎలాంటి హాని జరగదు. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్క బటన్ నొక్కడం ద్వారా చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు తెరచుకొని కారు లోని వారికి రక్షణగా నిలుస్తాయి.
Picture credit: Cadillac
కాడిలాక్ వన్
సుమారు మూడు టన్నుల బరువు ఉండే ఈ నలుపు రంగు కాడిలాక్ కారు గంటకు 60 మైళ్ల వేగంతో (గంటకు 96.5 కి.మీ.) ప్రయాణిస్తుంది. ప్రమాదంలో కారు టైర్లు పేలిపోయినా వాహనం మాత్రం ఆగకుండా దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారులో శక్తివంతమైన వి8, 6.6 లీటర్, టర్బో, 300 హార్స్ పవర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీని ఖరీదు సుమారు 3 లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా.

9. ది డార్ట్జ్ కోంబాట్ టి98 ఎస్‌యూవీ
రష్యన్ కంపెనీ డార్ట్జ్ తయారు చేసిన డార్ట్జ్ కోంబాట్ టి98 టెక్నికల్‌గా ఓ ఎస్‌యూవీ. కానీ ఇది చూడటానికి యుద్ధ ట్యాంక్‌ను తలపిస్తుంది. సరిగ్గా గమనిస్తే ఇది మోడిఫైడ్ హమ్మర్ కారు మాదిరిగా అనిపిస్తుంది. ధృఢమైన స్టీల్‌తో తయారు చేసిన బాడీ, 7 సెం.మీ. మంద కలిగిన అద్దాలతో తయారు చేయబడిన ఈ కారు ఏకె-47 తుపాకీ దాడులను, రాకెట్ లాంచర్‌తో విసిరే గ్రెనేడ్ల దాడులను సమర్థవంతంగా ఎదుర్కుటుంది.

ది డార్ట్జ్ కోంబాట్ టి98 ఎస్‌యూవీ
ది డార్ట్జ్ కోంబాట్ టి98 ఎస్‌యూవీలో శక్తివంతమైన 8.1 లీటర్, వోర్టెక్, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. భారీ బరువును కలిగి ఉండి కూడా ఈ ఎస్‌యూవీ గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. డార్ట్జ్ సాయుధ కార్లకు పెద్ద చరిత్రే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం నుంచే డార్ట్జ్ సాయుధ కార్లను తయారు చేస్తోంది. దీని ఖరీదు 2 లక్షల డాలర్లు.
Picture credit: Wallpaper
10. ది టంబ్లర్ (కొత్త బ్యాట్‌మొబైల్)
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి రియల్ కార్లు, కానీ ఇది మాత్రం రీల్ కారు. బ్యాట్‌మెన్ సిరీస్ సీక్వెల్ అయిన ది డార్క్ నైట్ రైసెస్ అనే చిత్రం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన అధునాతన బ్యాట్‌మొబైల్ ఇది. 2013 గంబాల్ 3000 ర్యాలీ కోసం టీమ్ గలాగ్ (Team Galag) తమ స్ట్రీట్ లీగల్ టంబ్లర్ (Tumbler) కారును తయారు చేసింది. సౌదీ అరేబియాకు చెందిన ఈ టీమ్ గలాగ్ బ్యాట్‌మ్యాన్ సినిమాలలో కనిపించే బ్యాట్‌మొబైల్ అచ్చుగుద్దినట్లు ఓ మోడల్‌ను అభివృద్ధి చేసింది.

ది టంబ్లర్
టంబ్లర్ అని పిలిచే ఈ కారును పార్కర్ బ్రదర్స్ కాన్సెప్ట్స్‌తో కలిసి టీమ్ గలాగ్ అభివృద్ధి చేసింది. దీని తయారీకి సుమారు 1.55 మిలియన్ డాలర్లు ఖర్చయ్యింటుందని అంచనా. (మన కరెన్సీలో సుమారు రూ.10 కోట్లు) ఈ టంబ్లర్‌లో శక్తివంతమైన 6.2 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 450 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని గరిష్ట వేగాన్ని కేవలం గంటకు 100 మైళ్లకు (160 కెఎమ్‌పిహెచ్) పరిమితం చేశారు. దీని మొత్తం బరువు సుమారు 2.5 టన్నులు.
Picture credit: FlickrWyliepoon

మరి ఈ కథనం మీకు నచ్చిందా..? ఇందులో పేర్కొన్నవి కాకుండా మీకు తెలిసిన బెస్ట్ బుల్లెట్‌ప్రూఫ్/ఆర్మోర్డ్ కార్లు ఏవైనా ఉన్నాయా..? ఉంటే ఆ వివరాలను మా పాఠకులతో పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








