వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
ఇటీవల కేరళకు చెందిన ఓ బామ్మ స్పోర్ట్స్ కారును నడుపుతున్న వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.. కేవలం కార్లు మాత్రమే కాకుండా హెవీ వెహికల్స్‌తో పాటు మొత్తంగా 11 కేటగిరీల వాహనాలకు ఆమె లైసెన్స్ కలిగి ఉంది. ఈ క్రమంలో 100 ఏళ్ల తాత.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మిని కారును నడుపుతున్న వీడియో వైరల్ అవుతోంది.
ప్యాషన్‌కు వయసుతో సంబంధం లేదంటున్నారు ఈ తాత(100 Year Old GrandPa Premier Padmini). 100 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తమకు నచ్చిన పనులు చేసుకుంటున్నారు. కేరళలో ఓ బామ్మ డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఎంతో ఉల్లాసంగా ఉంటుండగా.. ఓ తాత, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఫిలిప్ వింటేజ్ కారును నడుపుతూ నెటిజన్ల మనసును దోచుకుంటున్నారు.

100 ఏళ్ల తాత ఫిలిప్.. వింటేజ్ పద్మిని మోడల్ కారును నడుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వయసులోనూ ఎంతో చురుగ్గా కనిపిస్తున్నారు. ప్రీమియర్ పద్మిని కారులో ప్రతిరోజూ దాదాపు 2 నుంచి 3 కి.మీ ప్రయాణిస్తూ ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తున్నారు. కాగా ఈ తాత.. 1973 లో డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందినట్లుగా చెప్పారు.
వీడియోలో, మిస్టర్ ఫిలిప్ కుమారుడు ప్రీమియర్ పద్మిని వెనుక కథను చెబుతున్నారు. ఈ సెడాన్‌కు అప్పట్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉండేది అని చెబుతున్నారు. ఎంతలా అంటే ఆ కారును వారు డెలివరీ తీసుకునే ముందు దాదాపు 5 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చివరకు 1973లో కారును అందుకున్నారని చెప్పారు.

అయితే వారు ప్రీమియర్ పద్మిని కారును కొనుగోలు చేసిన తర్వాత.. చాలా మందిని వారిని సంప్రదించారట కారును విక్రయిస్తారేమో అని. ఫిలిప్ ఆ కారును కొనుగోలు చేసేటప్పుడు దాని ధర దాదాపు రూ. 19,000 కాగా, చాలా మంది రూ. 5,000 ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే, ఫిలిప్ ఆ కారును విక్రయించలేదు. అప్పటి నుండి, ఫిలిప్ నడిపిన ఏకైక కారు ఇదే.
వీడియోలో కనిపిస్తున్న కారు వారు 1973లో కొన్న ఒరిజినల్ పద్మిని కారు. తాగిన మత్తులో ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తి తమ పద్మినిని ఢీకొట్టడంతో అసలు కారు పూర్తిగా డ్యామేజ్ అయిందని ఫిలిప్ కుమారుడు వీడియోలో పేర్కొన్నారు. అదృష్టవశాత్తూ, మిస్టర్ ఫిలిప్ మరియు అతని భార్య ఎటువంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
క్రాష్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, మిస్టర్ ఫిలిప్ ప్రస్తుత పద్మినిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కారు ఒరిజినల్ పద్మిని కాకపోయినా.. గేర్‌బాక్స్ మరియు ఇతర మెకానికల్ భాగాలతో కొన్ని సమస్యలను కలిగి ఉంది. దీంతో ఫిలిప్ స్థానిక వర్క్‌షాప్‌లో కొన్ని రిపేర్లు చేయించి.. అప్పటి నుంచి ఈ కారును ఉపయోగిస్తున్నారు.
అయితే అప్పటిలాగే ఇప్పటికీ కూడా ఆ కారును విక్రయిస్తారేమో అని చాలా మంది ఫిలిప్‌ను సంప్రదించారట. చివరికి ఓ పోలీసుతో సహా. అయినా సరే ఆ కారును విక్రయించడానికి ఇష్టపడలేదు. తన జీవితాంతం ఈ కారు తనతోపాటే ఉండాలని భావించారు. దీని ద్వారా ప్రీమియర్ పద్మిని పట్ల ఫిలిప్‌కు ఉన్న ప్రేమ చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
కాగా ఫిలిప్ ఉదయం 6:30-7 గంటల సమయంలో నిద్ర లేచి.. తన పనులన్నీ పూర్తి చేసుకుని, అల్పాహారం చేసి, ఆపై తన కారును డ్రైవ్‌కు తీసుకెళ్లేవారట. ఇలా తన రొటీన్ కొనసాగుతుందని చెబుతున్నారు. అతను తన ప్రీమియర్ పద్మినిలోని చర్చితో సహా వివిధ ప్రదేశాలను సందర్శిస్తాని చెప్పారు. స్థిరమైన వేగంతో మాత్రమే పద్మినిని డ్రైవ్ చేస్తానని ఈ వందేళ్ల తాత చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








