నీటితో నడిచే బైకును రూపొందించిన 10 వ తరగతి విద్యార్థి

Written By:

పదవ తరగతి విద్యార్థులంటే టీజేర్స్ అని చెప్పవచ్చు. మరి టీనేజ్‌లో విద్యార్థులు ఎలా ఉంటారంటే... అందుకు మన బాల్యమే ఉదాహరణ. సాధారణంగా యవ్వన వయస్సున్న వారి దినచర్యలో చదువులు, ఆటలు, పాటలు సాధారణంగా ఉంటాయి. మరికొంత మందిలో కొత్త వాటిని కనిపెట్టడం, ప్రయోగాలు చేసే గుణాలుంటాయి. అయితే, చాలా అరుదు. ఇలాంటి అరుదైన విద్యార్థుల్లో ఆధిత్య ఒకరు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
నీటితో నడిచే బైకు

తన చుట్టూ ఉండే విడిపరికరాలతో నీటితో నడిచే బైకును రూపొందించాడు. ప్రయోగాత్మకంగా పరీక్షించి తన ప్రయోగ ఫలితాన్ని పొందాడు. జంషెడ్‌పూర్‌లో పదవ తరగతి విద్యార్థి ఆదిత్యా గొట్టె ఈ వాటర్‌ బైకును ఆవిష్కరించాడు.

Recommended Video
[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
నీటితో నడిచే బైకు

ఆరు లీటర్ల నీటితో ఇది 25 నుండి 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఆదిత్యా చెప్పుకొచ్చాడు. అయితే, ఇంజన్ స్టార్ట్ కావడానికి తొలుత కొంచెం పెట్రోల్ అవసరమవుతుంది. స్టార్ట్ అయ్యాక పెట్రోల్ అవసరం ఉండదని కూడా తెలిపాడు.

నీటితో నడిచే బైకు

పదేళ్లు కుర్రాడు... నీటితో నడిచే బైకు... 35 కిలోమీటర్ల మైలేజ్... అసలు ఇదంతా సాధ్యమేనంటారా...? నూటికి నూరుపాళ్లు సాధ్యమే. ఎలాగో చూద్దాం రండి. ఈ బైకును ఎలా నిర్మించాడో.... నీటితో బైకు ఎలా నడుస్తుందో పూర్తి వివరాలు....

నీటితో నడిచే బైకు

తన వద్ద ఉన్న సైకిల్‌ తీసుకుని, చిన్న పెట్రోల్ ఇంజన్‌ను పెడల్ ఫ్లై వీల్ వద్ద అమర్చాడు. సైకిల్ క్యారీయర్ మీద ఓ చిన్న వాటర్ స్టోరేజ్ ట్యాంకును అమర్చాడు. ట్యాంక్ నుండి వార్ ఇంజన్‌కు చేరే దశలో ఎలక్ట్రోలసిస్ కోసం మరో యూనిట్ అనుసంధానం చేశాడు.

నీటితో నడిచే బైకు

నీటితో బైకు ఎలా నడుస్తుంది?

ఎలక్ట్రోలసిస్ పద్దతి ద్వారా నీటిలో ఉన్న రసాయనాలు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ రూపంలోకి విడిపోతాయి. విడిపోయిన ఈ రసాయనాలను ఓ ట్యూబ్ ద్వారా పెట్రోల్‌ బదులుగా ఇంజన్‍‌లోకి సరఫరా చేస్తే, ఆ రసాయనాలతో ఇంజన్ నడుస్తుంది.

ఇలా కూడా ఇంజన్‌ను రన్ చేయవచ్చా.... అని అదిత్యాకు వచ్చిన ఆలోచనతో అందరూ ఫిదా అయిపోయారు. ఆదిత్యా నిర్మించిన వాటర్ బైకును ఇక్కడున్న వీడియోలో వీక్షించగలరు.

నీటితో నడిచే బైకు

మీకు ఈ ప్రయోగం నచ్చిందా... మీకు ఇలాంటి బైకు నిర్మించే సత్తా ఉందా..? మరెందుకు ఆలస్యం మీ వద్ద ఉన్న తెలివితేటలతో ఓ బైకును నిర్మించి మాతో పంచుకోండి. డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ కథనాన్ని ప్రచురిస్తుంది.

మరిన్ని తాజా ఆప్‌డేట్స్ కోసం ఫేస్‌బుక్‌ ద్వారా డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో టచ్‌లో ఉండండి.

English summary
Read In Telugu: 10th class student invents motorbike which can run on water
Story first published: Friday, November 10, 2017, 14:48 [IST]
Please Wait while comments are loading...

Latest Photos