ఫియట్ కెఫేలో ప్రేమికుల కోసం సరికొత్త ఆఫర్
ప్రేమికుల రోజు (వ్యాలంటైన్స్ డే) దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కార్ కంపెనీలు వివిధ రకాల మార్కెటింగ్ విన్యాసాలతో కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫియట్ ఇటీవలే ఢిల్లీలో ప్రారంభించిన ఫియట్ కెఫేలో ప్రేమ పక్షుల కోసం "ఇటాలియన్ పద్ధతి"లో వ్యాలంటైన్స్ డేను జరుపుకోండని ఓ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తుంది.
ఫియట్ కెఫేకు వెళ్లే కపుల్స్‌కు ఇటలీ ఫేవెరేట్ కాఫీ అయిన "లావాజా" కాఫీను ఫియట్ ఉచితంగా సర్వ్ చేయనుంది. ఈ కాఫీతో పాటుకంగా కుకీలను కూడా ఫియట్ కెఫే ఆఫర్ చేయనుంది. అంతేకాకుండా ఫియట్ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన 2012 ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్, 2012 ఫియట్ లీనియా సెడాన్‌ల కోసం ఉచిత టెస్ట్ డ్రైవ్‌లను కూడా ఆఫర్ చేస్తుంది.
ఫిబ్రవరి 18 వరకూ తమ కెఫేకు వచ్చే కస్టమర్లకు ఈ ఉచిత ఆఫర్లను ఫియట్ కెఫే ఆఫర్ చేయనుంది. ఈ విధంగా జస్ట్ ఒక్క కాఫీ కప్పు ఖర్చుతో పెద్ద ప్రచారాన్ని సొంతం చేసుకోవాలని కంపెనీ యోచిస్తున్నట్లుంది. మరింకెందుకు మీరు ఈ వ్యాలంటైన్స్ డేకి ఢిల్లీ గనుక వెళ్లేటట్టుంటే ఓ సారి ఈ ఫియట్ కెఫే వైపు లుక్కేయండి మరి. ఫియట్ కెఫేను న్యూఢిల్లీలోని టోల్‌స్టాయ్ మార్గ్‌లో ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications









