రైలుకు ఎదురుగా వెళ్లి వందల మంది ప్రాణాలను కాపాడిన బాలుడు.. ఈ చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..
ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సమయంలో అక్కడ ఎవరైనా వారిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడితే.. ధన్యవాదాలు చెబుతూ దండం పెడతారు. అసలు ప్రమాదమే జరగకుండా కాపాడేవాళ్లను దేవుడితో సమానంగా భావిస్తాం. ఇక్కడ ఓ బాలుడు(Train Accident) కొన్ని వందల మంద్రి ప్రాణాలను కాపాడి వారి గుండెల్లో దేవుడిగా నిలిచాడు.
ఓ మనిషి లేదా ఏ జీవి అయినా సరే ప్రాణాలు కాపాడాలంటే మానవత్వం ఉండాలి. కానీ తన ప్రాణానికే ప్రమాదం ఉందని తెలిస్తే ఏ వ్యక్తి అయినా ఒక్కోసారి వెనుకడుగు వేస్తారు. కానీ ఇక్కడ ఓ 12 ఏళ్ల బాలుడు అదేమీ ఆలోచించలేదు.

తనకు ప్రమాదం ఉందని తెలిసినా రైలులో వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను గుర్తించి దానిపై ప్రయాణిస్తున్న రైలును తన సమయస్ఫూర్తితో ఆపి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అంతే కాకుండా రైల్వేశాఖ నుంచి అవార్డు అందుకున్నాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్(West Bengal Malda Railway Track Damge)లోని మాల్దా జిల్లాలో ఇటీవల 12 ఏళ్ల బాలుడు రైల్వే లైన్‌పై దెబ్బతిన్న ట్రాక్‌ను గుర్తించాడు. అదే సమయంలో రైలు వస్తుండటంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. ట్రాక్‌పైకి చేరుకుని తను వేసుకున్న రెడ్ టీ షర్ట్‌ను విప్పి లోకో పైలట్‌కు సిగ్నల్ ఇచ్చాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది.
ఘటన జరిగిన సమీపంలోని గ్రామానికి చెందిన ఓ వలస కూలీ కుమారుడు ముర్సలిన్ సీక్ అనే పన్నెండేళ్ల బాలుడు స్థానిక రైల్వే సిబ్బందితో కలిసి పక్కనే ఉన్న పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో పట్టాల కింద వర్షానికి దెబ్బతిన్న భాగాన్ని గమనించాడు. కానీ అదే సమయంలో, ముర్సలిన్ రైలు కూడా వస్తున్నట్లు గమనించాడు. దీంతో అధికారులు వచ్చేవరకు సమయం లేదని తెలుసుకుని వెంటనే ట్రాక్ మీదకు వెళ్లాడు.
రైల్వే స్టాఫ్‌లోని ఓ వ్యక్తితో కలిసి ట్రాక్ మీదకు వెళ్లిన తన వేసుకున్న ఎర్ర చొక్కాను విప్పి రైలు లోకో పైలట్‌ను అప్రమత్తం చేశాడు. బాలుడి సిగ్నల్‌ను గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును సమయానికి ఆపేశాడు. లేదంటే రైలు ముందుకెళ్లి ఉంటే పెనుప్రమాదం జరిగి ఉండేది. ఆ కాసేపటికి అధికారులు అక్కడికి చేరుకున్నారు.
రైలును సమయానికి ఆపడంలో బాలుడు, లోకో పైలట్ విజయం సాధించారని రైల్వే అధికారులు తెలిపారు. వర్షం కారణంగా మట్టి, గులకరాళ్లు కొట్టుకుపోయిన చోట పోరియన్ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న ట్రాక్‌లో కొంత భాగాన్ని మరమ్మతులు చేయడంతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు.
సరైన సమయంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన బాలుడి తెలివితేటలను అధికారులు మెచ్చుకున్నారు. ఎన్‌ఎఫ్ రైల్వే అధికారులు ఈ సాహసవంతుడు, ధైర్యవంతుడైన బాలుడిని సర్టిఫికేట్ మరియు నగదు పురస్కారంతో సత్కరించారు. మాల్డా నార్త్ ఎంపీ ఖగెన్ ముర్ము కటిహర్నా, డివిజనల్ రైల్వే మేనేజర్ సురేంద్ర కుమార్‌తో కలిసి బాలుడి ఇంటికి చేరుకుని అభినందించారు.
ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో పెద్దలు కూడా సాహసం చేయరు. తమ ప్రాణాలకు ప్రమాదమని ఆగిపోయే అవకాశం ఉంది. కానీ ఈ బాలుడు మాత్రం అవేమీ ఆలోచించకుండా వారి ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. సమయస్ఫూర్తితో ప్రమాదాలు జరగకుండా చేసే ప్రయత్నాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు బాలుడు.


Click it and Unblock the Notifications








