బెంజ్ కారును బంగారు కారుగా మార్పించుకున్న ఘనుడు
మీ దగ్గర దాచిపెట్టుకోలేనంత బంగారం ఉంటే ఏం చేస్తారు..? ఏ అనాధాశ్రమానికి, వృద్ధాశ్రమానికి దానం చేసి కూసింత పుణ్యం కూడగట్టుకుంటారు. అంతే కదా..! కానీ స్విట్జర్‌లాండ్‌కు చెందిన "యులీ అన్లికెర్" ఓ వ్యాపారవేత్త వద్ద బోలెడంత ధనం ఉంది. అందరి మాదిరిగా ఇతని వద్ద ఉన్న అధిక సొమ్మును దాన ధర్మాలు చేయకుండా, ఓ మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ కారును బంగారు కారుగా తీర్చిదిద్దాడు.
దాదాపు ఐదు కిలోలకు పైగా బంగారాన్ని వెచ్చించి ఈ కారును గోల్డ్ కారుగా మార్చేశాడు. గోల్డ్ కోటెడ్ అల్లాయ్ వీల్స్, హెడ్‌లైట్స్, డ్యాష్ బోర్డ్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్ ఇలా కారులోని కొన్ని కీలకమైన భాగాలను 35 మంది వర్కర్లు సుమారు 30 వేల గంటల పాటు శ్రమించి, గోల్డ్ ప్లేటింగ్ కోసం 3.5 మిలియన్ యూరోలు వెచ్చించి దీన్ని రూపొందించారు.
ప్రస్తుతం యులీ అన్లికెర్ ఈ కారును 7 (మన కరెన్సీలో అయికే సుమారు ఐదు కోట్లకు పైమాటే) మిలియన్ యూరోలకు అమ్మేయాలని భావిస్తున్నాడు. ఈ కారుకు 25 లేయర్ల రెడ్ పెయింట్‌ను వేశారు. ఇందులో అమర్చిన 5.4 లీటర్ ఇంజన్ పవర్‌ను 640 బిహెచ్‌పి నుండి 999 బిహెచ్‌పికి పెంచడం జరిగింది. ఈ కారుకు అతను "అన్లికెర్ మెక్‌లారెన్ ఎస్ఎల్ఆర్ 999 రెడ్ డ్రీమ్" అనే పేరును పెట్టాడు. ఈ కారులో దాదాపు 600 పైగా రత్నాలను పొదిగారు. మరి మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఏంచేస్తారు..?


Click it and Unblock the Notifications








