నాన్న స్మార్ట్‌ఫోన్‌తో డొక్కు కారు కొన్న 14 నెలల చిన్నారి
ఈ కథనం చదివిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్లను మీ పిల్లల చేతికి ఇవ్వాలంటే మీరు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ యుగమే, ఎవరి చేతిలో చూసిన వారి చేతి పరిమాణానికి మించిన స్మార్ట్‌ఫోన్లు కనిపిస్తుంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు ఎంత స్మార్ట్‌గా పనిచేస్తాయో అంతే స్మార్ట్‌గా చిక్కుల్ని కూడా తెచ్చిపెడుతాయి. యూఎస్‌లోని పోర్ట్‌లాండ్‌కు చెందిన 14 నెలల వయస్సు కలిగిన ఓ చిన్నారి తన తండ్రి స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా కారునే కొనేసింది.
వివరాల్లో వెళితే.. పోర్ట్‌లాండ్‌కు చెందిన పౌల్ స్టోట్ ముద్దుల కూతురు తన తండ్రి స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకుంటూ ఈబే అప్లికేషన్‌ను (ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ మొబైల్ అప్లికేషన్) క్లిక్ చేసింది. ఆ తర్వాత ఎక్కడెక్కొ క్లిక్ అయి ఓ పాత డొక్కు కారు కొనుగోలుకు దారితీసింది. ఇదే విషయమైన ఈబే సంస్థను పౌల్‌కు అభినందనలు తెలుపుతూ కాల్ రావటంతో అతను ఒక్కసారిగా అవాక్కయ్యి, వివరాలు చూసుకుంటే తన పాపే ఈ కారును కొనుగోలు చేసిందని తేలింది.
ఇంతకీ ఆ పాప కొన్న కారేంటో తెలుసా..? 1962 మోడల్‌కు చెందిన పురాతన ఆస్టిన్ హీలే స్ప్రైట్ (Austin-Healey Sprite) కారు. ఈబేలో దీని వెల 225 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.13,500). ఇది పూర్తిగా పాడైపోయిన కండిషన్‌లో ఉంది. అయితే, ఈ కారును తిరిగి వెనక్కు ఇచ్చేయకుండా తన వద్దే ఉంచుకుంటానని, దీనిని మోడిఫై చేసి తమ పాప పెద్దయ్యాక బహుమతిగా ఇస్తానని తండ్రి పౌల్ చెబుతున్నాడు.
అదృష్ట వశాత్తు తమ పాప కేవలం 225 డాలర్లు కలిగి కారును మాత్రమే కొనుగోలు చేసిందని అదే 38,000 డాలర్ల (సుమారు రూ.22,72,438) పోర్షే కారును కొనుగోలు చేసుంటే తన పరిస్థితి ఏంటని పౌల్ నవ్వుతూ సెలవిచ్చాడు. అంతేకాదు, ఈ దెబ్బతో తన స్మార్ట్‌ఫోన్‌కు సెక్యూరిటీ పాస్‌వర్డ్ పెట్టి లాక్ చేసేశాడు. కాబట్టి అమ్మలారా.. అయ్యలారా.. మీ స్మార్ట్‌ఫోన్ జర భద్రం. ఊహ తెలియని మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తే మీకు కూడా ఇలానే జరిగే ప్రమాదం ఉంది. పారాహుషార్..! (చివరి స్లైడ్‌లో వీడియోను వీక్షించండి).

ఆస్టిన్ హీలే స్ప్రైట్ కారుతో చిన్నారి

చిన్నారి కొనుగోలు చేసిన ఆస్టిన్ హీలే స్ప్రైట్ కారు

ఆస్టిన్ హీలే స్ప్రైట్ (Austin-Healey Sprite) కారు. ఈబేలో దీని వెల 225 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.13,500).





Click it and Unblock the Notifications








