గాయపడిన తన తండ్రిని ట్రాలీపై 50 కి.మీ తోసుకెళ్లిన పద్నాలుగేళ్ల బాలిక.. కారణమిదే.!!
పద్నాలుగేళ్ల బాలిక గాయపడిన తన తండ్రిని ట్రాలీపై సైకిల్‌పై 50 కిలోమీటర్లు తోసుకెళ్లిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. అంబులెన్స్ సదుపాయం లేక ఇలా ఓ యువతి కష్టాలు పడుతూ ట్రాలీపై తీసుకెళ్లడం అందరినీ కలిచివేసింది.
బైక్ లేదా కారులో ఎవరికైనా కొద్దిగా ఎక్కువ దూరం ట్రావెల్ చేయగానే కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఎవరికైనా.. కానీ కాళ్లతో తొక్కుతూ ట్రాలీపై 50 కి.మీ నడపడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ గాయపడిన తన తండ్రిని ఓ యువతి చాలా జాగ్రత్తగా రెండు సార్లు ట్రాలీపై తీసుకెళ్లిన సంఘటన అందరినీ కలిచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒడిశాలో నడిగావ్ గ్రామానికి చెందిన సుజాత సేథి అనే పద్నాలుగేళ్ల బాలిక గాయపడిన తన తండ్రి సాంబునాథను 3-వీలర్ ట్రాలీపై దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాట్రిక్ జిల్లాలోని జనరల్ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లింది. అయితే మొదటగా సుజాత సేథి మొదట తన తండ్రిని చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తీసుకెళ్లింది.
సమాచారం ప్రకారం అక్టోబర్ 22న స్థానిక అల్లర్లలో గాయపడిన తన తండ్రిని సుజాత సేథి నడిగావ్ గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలోని ధామ్‌నగర్‌లోని ఆసుపత్రికి ట్రాలీపై తీసుకెళ్లింది. అయితే అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ప్యాట్రిక్ జిల్లా హెడ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. కాగా ప్యాట్రిక్ ఆస్పత్రి ధామ్‌నగర్ హాస్పిటల్ నుండి 35 కి.మీ దూరంలో ఉంది.

అయితే అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో సుజాత సేథి మరుసటి రోజు తన తండ్రిని 3-వీలర్ ట్రాలీపై తీసుకెళ్లాలని సిద్ధమైంది. వేరే వాహనంలో తీసుకెళ్లడానికి ఛార్జీలకు డబ్బులకు లేకపోవడంతో ఆమెకి వేరే గత్యంతరం లేక ఈ పనికి పూనుకుంది. జిల్లా ఆస్పత్రి నుంచి ఇంటికి.. ఇంటి నుంచి జిల్లా ఆస్పత్రికి ఇలా రెండుసార్లు తన తండ్రిని ట్రాలీపై ఆస్పత్రికి తీసుకెళ్లింది.
సుజాత సేథి దుస్థితి ఒడిశాలోని మీడియా దృష్టికి వెళ్లడంతో మీడియా ప్రతినిధులు ప్యాట్రిక్ జిల్లా ఆస్పత్రి వైద్యులను విచారించారు. ఆస్పత్రి నుంచి రోగులను ఇంటికి చేర్చడానికి అంబులెన్స్ సదుపాయం లేదని ప్యాట్రిక్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ శంతను పాత్రను సమాధానమివ్వడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్నా.. మారుమూల గ్రామాల్లో విద్య, వైద్యానికి సంబంధించి సరైన సదుపాయాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








