ఆటోమొబైల్ బ్రాండ్లతో చేతులు కలిపిన కథానాయకులు

By N Kumar

మనకు ఇష్టమైన కథాయకులను మరియు కథానాయికలను సినిమాలలో చూసి తెగ మురిసిపోతుంటాం. ఇక వారు ఆడియో రిలీజ్, సక్సెస్ ర్యాలిలో మన ముందుకు వస్తే ఇక మన ఆనందమే వేరు. అదే మన సెలబ్రిటీలు బుల్లి తెర మీద యాడ్‌ల రూపంలో ఓ రెండు, మూడు నిమిషాల పాటు కనువిందు చేస్తే ఎలా ఉంటుందంటారు...?
Also Read: త్రిషకు బాయ్‌ఫ్రెండ్ కాస్ట్లీ గిఫ్ట్

అలా మనకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్‌లు ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లతో చేతులు కలిపి యాడ్‌ల రూపంలో మన ముందుకు వస్తున్నారు అందులో మన అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కు కూడా ఉన్నారు. మరెందుకు ఆలస్యం క్రింద గల కథనం మీద ఓ లుక్కేసుకోండి.

15.వరుణ్ థావన్

15.వరుణ్ థావన్

బాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ థావన్ మహీంద్రా వారి కూల్ యుటిలిటి వెహికల్ కెయువి 1OO కారుకు ప్రచార కర్తగా మారాడు. మహీంద్రా వారి సరికొత్త ఎస్‌యువి కారును ముఖ్యంగా యువత కోసం రూపొందించారు. అందుకోసమే ఈ యువ కథానాయకున్ని ప్రచారక కర్తగా ఎంపిక చేసుకున్నారు.

14. కరీనా కపూర్

14. కరీనా కపూర్

హిందీ చలన చిత్రల్లో ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ మహీంద్రా పవర్‌ స్కూటర్స్‌లోని రోడియో, డ్యూరో మరియు ఫ్లైట్ వంటి వాటికి ఈమె ప్రచారకర్తగా పని చేశారు. 2010 లో మహీంద్రా వారి రోడియో క్యాంపెయిన్ వీరు ప్రచారం ఆరంభించారు. మీరు గమనించినట్లయితే కరీనా కపూర్ త్రీ ఇడియట్స్ చిత్రంలో మహీంద్రా స్కూటర్‌ మీద వెలుతుంటుంది.

13. రణబీర్ కపూర్

13. రణబీర్ కపూర్

ఫ్రెంచ్ కు చెందిన అతి పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ రెనో గత 2015 జూలై నెలలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో చేతులు కలిపింది. రెనో వారి విసృత శ్రేణి వాహనాలకు ఇతనిని ప్రచార కర్తగా నియమించుకున్నారు.

12. ఫర్హానా అక్తర్

12. ఫర్హానా అక్తర్

ఫర్హానా అక్తర్ ఇతను నటించిన సినిమాలు గుర్తున్నాయా? అదేనండి భారీ విజయాలు సాధించిన భాగ్ మిల్కా భాగ్, రాక్ ఆన్...!! జిందగీ నా మిలేగి దొబారా వంటి చిత్రాల్లో నటించిన అక్తర్ ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ ఫోర్డ్ వారి ఫిగో ఆస్పైర్ సెడాన్ కారుకు ప్రచారకర్తగా పని చేస్తున్నారు.

11. విరాట్ కోహ్లి

11. విరాట్ కోహ్లి

భారతీయ క్రికెట్ స్టార్ జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కు బ్రాండ్ అంబాసిడర్ ‌గా ఉన్నారు. విరోట్ కోహ్లి వద్ద ప్రస్తుతం ఆడి ఆర్8, ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్, క్యూ7 లోని వేరింట్లు మరియు లేటెస్ట్ కారు ఆడి ఎ8ఎల్ డబ్ల్యూ12 క్వాట్రో ఇతని వద్ద ఉన్నాయి.

10 .రణవీర్ సింగ్

10 .రణవీర్ సింగ్

భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికు చెందిన సియాజ్ కారుకు బ్రాండ్ అంబాసిడర్ గా 2014 లో పని చేశారు. ఇతను సియాజ్ కారుకు బ్రాండా అంబాసిడర్‌గా పని చేసిన తరువాత సియాజ్ అమ్మకాలలో మంచి వృద్దిని సాధించిందని మారుతి సుజుకి వారు ప్రకటించారు.

09. అమితాబ్ బచ్చన్

09. అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ టివిఎస్ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశారు. రెండు మరియు మూడు చక్రాల వాహనాలను తయారు చేస్తున్న ప్రముఖ దేశీయ సంస్థ టివిఎస్ కు చెందిన జూపిటర్ స్కూటర్ కు గడిచిన పండుగ సీజన్‌లో ప్రచార కర్తగా పనిచేశారు.

08. తాప్సి పొన్ను

08. తాప్సి పొన్ను

తాప్సి తెలుగులో చాలా సినిమాలలోనే నటించింది. అయితే ఈ అమ్ముడు తాజాగా హోండా వారి స్కూటర్ల కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేరింది. హోండా స్కూటర్స్ వారు మాట్లాడుతూ ప్రతి ముగ్గురు హోండా స్కూటర్ల యాజమానులలో ఒక్కరు మహిళా కస్టమర్ ఉన్నారని మరియు ప్రతి నెలా దాదాపుగా 75,000 మంది మహిళలు హోండా వారి స్కూటర్లను ఎంచుకుంటున్నారని తెలిపారు.

07. అక్షయ్ కుమార్

07. అక్షయ్ కుమార్

49 సంవత్సరాల వయస్సున్న భారతీయ నటుడు అక్షయ్ కుమార్ హోండా వారి అన్ని శ్రేణి టూవీలర్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే హోండా వారు విడుదల చేసిన 2015 డ్రీమ్ సిరీస్ బైకులకు ఇతను త్రిపాత్రాభినయం ద్వారా మన ముందుకు వచ్చాడు.

06. షారుఖ్ ఖాన్

06. షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హ్యుందాయ్ మోటార్స్ ఇండియాకు రెండు దశాబ్దాల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశారు. మొదటి సారి 1998లో హ్యుందాయ్ వారి స్యాంట్రో కారుతో ప్రారంభించి ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా కార్ల వరకు రెండు సార్లు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు.

05. లియోనెల్ మెస్సి

05. లియోనెల్ మెస్సి

ప్రపంచ ఫుట్ బాల్ ఛాంపియన్ లియోనెల్ మెస్సి భారతదేశపు అతి పెద్ద వాహన తయారీ రంగం టాటా మోటారస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నాడు. టాటా మోటార్స్ వారి మొదటి క్యాంపెయిన్ మేడ్ ఆఫ్ గ్రేట్ ఇతని ద్వారా ప్రారంభించింది.

04 . సచిన్ టెండూల్కర్

04 . సచిన్ టెండూల్కర్

భారతీయ క్రికెట్ నుండి శాశ్వతంగా విరామం తీసుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ 2012 నుండి ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బిఎమ్‌డబ్ల్యూకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నాడు.

03 .అల్లు అర్జున్

03 .అల్లు అర్జున్

తెలుగు, కన్నడ మరియు కేరళ రాష్ట్రాల్లో విపరీతంగా అభిమానులను కలిగి ఉన్న మన తెలుగు సినీ హీరో స్టైలిష్ స్టార్ బన్ని హీరో మోటో కార్ప్ వారి విసృత శ్రేణి టూ వీలర్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నారు.

02. అర్జున్ కపూర్

02. అర్జున్ కపూర్

దేశీయంగా సైకిల్స్ ను తయారు చేస్తున్న అతి పెద్ద సంస్థ హీరో సైకిల్స్ కు ప్రముఖ హింది చలన చిత్ర నటుడు అర్జున్ కపూర్ 2015 జూన్ నుండి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు.

01. ప్రభాస్

01. ప్రభాస్

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ద్వారా పరిచయం అయిన ప్రభాస్ మహీంద్రా వారి టియువి3OO కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సుపరిచితుడైన అమరేంద్ర బాహుబలి మా టియువి వాహనం ద్వారా మరో సారి మీ ముందుకు వస్తున్నాడని మహీంద్రా సంస్థ ఎమ్‌డి ఆనంద్ మహీంద్రా తెలిపాడు.

కథానాయకులు కనువిందు చేసిన వేళ...!!
  1. బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు.....!!
  2. విరాట్ కోహ్లి ఖాతాలో మరొక కారు
  3. రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!

More from DriveSpark

Article Published On: Wednesday, January 6, 2016, 11:21 [IST]
English summary
Celebrities associated with automobile brands
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+