15వ బర్త్‌డే కానుకగా పగని కారు పొందిన బాలుడు

By Ravi

మీ అబ్బాయికి 15 సంవత్సరాలు వస్తే, మీరు అతనికి ఎలాంటి కానుక ఇస్తారు. ఓ సైకిల్‌నో లేదా నెమ్మదిగా వెళ్లే ఎలక్ట్రిక్ స్కూటర్‌నో కొనిస్తారు. కానీ, ఈ తైవానా తండ్రి మాత్రం తన కుమారుడికి కోట్ల రూపాయలు ఖరీదు చేసే, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కార్లలో ఒకటైన పగని హుయారా సూపర్ కారును కానుకగా ఇచ్చాడు.

తైవాన్‌లోని కవోహ్సియుంగ్ అనే నగరంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. తన కుమారుడి పట్ల అమితమైన ప్రేమ ఉన్న ఓ తండ్రి, అతడి 15వ జన్మదిన కానుకగా ఈ కారును బహుకరించాడు. అయితే, ఈ బాలుడు లైసెన్స్ పొందే వరకూ ఈ కారును నడపటానికి అవకాశం లేదు. అప్పటి వరకు ఈ కారును తిరిగి ఇటీలీలోనే ఉంచనున్నట్లు సమాచారం.

Pagani Huayra

ఇటలీకి చెందిన హైపర్ కార్ల తయారీ సంస్థ పగని ఉత్పత్తి చేస్తున్న జోండా, హుయారా మోడళ్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కార్లలో పగని హుయారా కూడా ఒకటి. పగని హుయారాలో 700 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 6.0 లీటర్ వి12 ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను ప్రత్యేకంగా ఏఎమ్‌జి డెవలప్ చేసింది.

పగని హుయారా బేస్ వేరియంట్ ఖరీదే 10,56,000 యూరోలు. ఆప్షనల్ ప్యాకేజ్‌లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పెయింట్ వర్క్ కోసం 29,000 నుంచి 39,500 యూరోలు, క్యాబిన్ ఫైబర్ ఇన్‌సెర్ట్ కోసం 59,500 యూరోలను అదనంగా చెల్లించాలి. ఏదేమైనప్పటికీ, ఇంత చిన్న వయస్సులోనే అంత ఖరీదైన సూపర్ కారును సొంతం చేసుకున్న ఆ సూపర్ కిడ్ చాలా లక్కీ.

More from DriveSpark

Article Published On: Friday, August 22, 2014, 10:24 [IST]
English summary
Boys grow old and their toys grow bigger. In a modern world where craziness is just part of being normal, along comes a story about a 15 year old. This kid from a city called Kaohsiung, in Taiwan received a wonderful birthday surprise. A brand new Pagani Huayra.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+