6 ఏళ్ల బాలుడికోసం రోడ్డెక్కిన 15,000 బైకులు; ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్నారు. ఇందులో వృద్దులు, యువకులు మరియు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వారికి సమాజంలోని కొంతమంది వ్యక్తులు మీకు మేమున్నాము ధైర్యంగా ఉండండి అని భరోసా ఇవ్వడానికి అనేక వినూత్న చర్యలు చేపడుతూ ఉంటారు.

6 ఏళ్ల బాలుడికోసం రోడ్డెక్కిన 15,000 బైకులు; ఎందుకంటే?

ఇలాంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా జరిగాయి. ఇప్పుడు కూడా ఇదే రీతిలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఆరు సంవత్సరాల బాలుడి కోసం కొన్ని వందల సంఖ్యలో బైకులు తమ ఇంటి వద్దకు ర్యాలీ లాగ వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

6 ఏళ్ల బాలుడికోసం రోడ్డెక్కిన 15,000 బైకులు; ఎందుకంటే?

నివేదికల ప్రకారం జర్మనీకి చెందిన ఒక 6 సంవత్సరాల వయసున్న బాలుడు ల్యుకేమియా(బ్లడ్ క్యాన్సర్) తో బాధపడుతున్నట్లు తమ తల్లిదండ్రులకు తెలిసింది. ఈ విషం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. తమ బిడ్డకు క్యాన్సర్ రావడంతో ఎంతగానో నిరాశకు గురయ్యారు.

6 ఏళ్ల బాలుడికోసం రోడ్డెక్కిన 15,000 బైకులు; ఎందుకంటే?

పిల్లలకు బైక్స్ అంటే చాలా ఇష్టం, అందువల్ల తమ బిడ్డ కోసం బైక్‌లతో తమ ఇంటి దగ్గర మార్చ్ చేయమని నగర బైకర్లకు విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన చాలా మంది బైకర్లు వారి ఇంటి దగ్గర మార్చ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఒకటి రెండు కాదు ఏకంగా 15 వేలకు పైగా బైక్ రైడర్లు వారి ఇంటి గుండా వెళ్లి వారికి గుండె ధైర్యాన్ని నింపారు.

6 ఏళ్ల బాలుడికోసం రోడ్డెక్కిన 15,000 బైకులు; ఎందుకంటే?

తల్లితండ్రులు వారు ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ చూసి తక్కువ సంఖ్యంలో వస్తారని ఆశించారు. కానీ ఇంత పెద్ద ఎత్తున బైకర్స్ వస్తారని ఊహించలేదన్నారు. ఈ ర్యాలీలో జర్మనీకి చెందిన అనేక చిన్న మరియు పెద్ద బైక్ క్లబ్‌ల సభ్యులు మరియు సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బాలుడు త్వరగా కొలొకోవాలని ఆకాక్షించారు. ఈ ర్యాలీలో అనేక రకాల ఖరీదైన మరియు సూపర్ బైకులు ఉన్నాయి. మీరు ఈ బైకులను వీడియోలో గమనించవచ్చు.

6 ఏళ్ల బాలుడికోసం రోడ్డెక్కిన 15,000 బైకులు; ఎందుకంటే?

ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా గతంలో కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. కరోనా నివారణలో కృషి చేసిన ఒక భారతీయ మహిళా డాక్టర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన కార్ ర్యాలీ కూడా మీరు గతంలో చూసి ఉంటారు. సమాజంలో చాలామంది పక్కవారి సమస్యలకు కూడా స్పందించే మనసు కలిగి ఉంటారు. ఇలాంటి మనసున్న మనుసులు చేసినదే ఈ బైక్ ర్యాలీ కూడా.

Most Read Articles

English summary
15000 Bikers Cheeredup Cancer Diagnosed 6 Year Old Boy In Germany. Read in Telugu.
Story first published: Monday, July 26, 2021, 15:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X