వేలంలో 46 లక్షల డాలర్లు పలికిన బ్యాట్‌మ్యాన్ కారు

By Ravi

ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు ధరెంతో తెలుసుకుంటే నిజంగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్ది. ఈ క్లాసిక్ కారు ధర జస్ట్ రూ.25 కోట్లు మాత్రమే. హవ్వ.. ఈ పాత డొక్కు కారు అంత రేటా అని అనుకుంటున్నారా..? ఈ కారుకు పెద్ద చరిత్రే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 1960 దశకంలో అత్యంత పాపులర్ అయిన బ్యాట్‌మ్యాన్ టెలివిజన్ సిరీస్‌లో ఈ కారును ఉపయోగించారు. 1966 బ్యాట్‌మొబైల్‌గా పిలిచే ఈ కారును ఒకానొక 1955 లింకోల్న్ ఫ్యూచురా కాన్సెప్ట్ కారును ఆధారంగా తయారు చేశారు.

అప్పట్లో ఈ కారును కేవలం 1 డాలర్‌కే కొనుగోలు చేశారు. అదేంటి అంత తక్కువ అనుకోకండి. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ బ్యాట్‌మ్యాన్ సిరీస్ తమ కారును ఉపయోగిస్తున్నారనే ఉద్దేశ్యంతో ఈ కారును ఒక్క డాలర్‌కే వారికి విక్రయించింది. 1955 లింకోల్న్ ఫ్యూచురా కాన్సెప్ట్ కారును బ్యాట్‌మ్యాన్ థీమ్‌కు తగిన విధంగా మోడిఫై చేసి ఇలా మార్చారు. ఈ కారు ఇప్పటికీ మంచి రన్నింగ్ కండిషన్‌లో ఉంది. స్కాట్స్‌డేల్‌లోని బార్రెట్-జాక్సన్ ఆక్షన్ కంపెనీ నిర్వహించిన వేలంలో ఓ బిడ్డర్ 4.6 మిలియన్ల అమెరికన్ డాలర్లను చెల్లించి (మన దేశ కరెన్సీలో సుమారు రూ.25 కోట్లు) ఈ కారును సొంతం చేసుకున్నాడు.

ఒక్క డాలర్‌కు ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసిన 1955 లింకోల్న్ ఫ్యూచురా కాన్సెప్ట్ కారుపై అప్పట్లో 15,000 అమెరికన్ డాలర్లు వెచ్చించి కింగ్ ఆఫ్ కస్టమైజర్స్ యజమాని జార్జ్ బారిస్ ఈ బ్యాట్‍‌‌మొబైల్‌ను సృష్టించాడు. ఈ మొత్తాన్ని 20వ సెంచరీ ఫాక్స్ నిర్మాణ సంస్థ అందించింది. ఈ ఓపెన్ టాప్ కారులో శక్తివంతమైన వి8 ఇంజన్‌ను, అటోమేటిక్ గేర్‌బాక్సును అమర్చారు. ఇందులో బ్యాట్‌ఫోన్, లాన్‌లో ఉపయోగించే స్ప్రింక్లర్లతో తయారు చేసిన ఆయిల్ స్విర్టర్స్ (చమురు వెదజల్లేవి), ఫేక్ జెట్ ఎగ్జాస్ట్ (నకిలీ జెట్ సైలెన్సర్), వెనుక వైపు రెండు ప్యారాచూట్లు వంటి అనేక విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారును రోడ్డుపై నడిపేందుకు అనుమతులు కూడా ఉన్నాయి.

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

1966 బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మాన్ కారు)

More from DriveSpark

Article Published On: Wednesday, January 23, 2013, 16:08 [IST]
English summary
The famous customized 1966 Batmobile used in the 1960s ABC Batman TV series starring Adam West has gone under the hammer for USD 4.6 million. This classic cruiser was purchased by the winning bidder for Lot 5037 at the Barrett-Jackson Auction Co in Scottsdale, reported Aceshowbiz.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+