హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

ఒకప్పుడు మనిషి చనిపోతే నలుగు వ్యక్తులు పాడెను లేదా శవపేటిను తమ భుజాలపై మోసుకుంటూ స్మశానం వరకూ తీసుకెళ్లేవాళ్లు. అయితే, ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది. పట్టణాల్లో శవాలను మోసుకెళ్లడానికి ప్రత్యేకమైన వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

కానీ, 1980 కాలంలోనే అమెరికాలో శవాలను తరలించేందుకు ఓ వాహనాన్ని తయారు చేశారు. అదే 1982 ఎయిర్‌స్ట్రీమ్ ఎక్సెల్లా 280 ఫ్యూనరల్ కోచ్. ప్రస్తుతం ఈ వాహనాన్ని ఒక హాంటెడ్ గేమ్ రూమ్‌గా మార్చారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది ముమ్మాటికి నిజం.

హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

ఈ పురాతన ఎయిర్‌స్ట్రీమ్ ఎక్సెల్లా 280 ఫ్యూనరల్ కోచ్‌ను కేవలం శవపేటికలను తరలించేందుకు మాత్రమే కాకుండా, శవపేటికలతో పాటుగా అందులో కొందరు వ్యక్తులు మరియు పుష్పగుచ్చాలను కూడా స్మశానాలకు చేర్చేలా రూపొందించారు. అప్పట్లో మిచిగాన్ ఎయిర్‌స్ట్రీమ్ నిర్మించిన 33 వాహనాల్లో ఇది కూడా ఒకటి.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

ఇటీవలే ఈ హాంటెడ్ గేమ్ రూమ్‌ను ఫేస్‌బుక్ మార్కెట్‌లో 50,000 డాలర్ల (సుమారు రూ.36 లక్షల)కు అమ్మకానికి పెట్టారు. ఇదొక చిన్నపాటి మొబైల్ మోటార్ హోమ్‌లా ఉంటుంది. హంటెడ్ గేమ్ రూమ్‌గా మార్చడానికి ముందు ఇందులో ఓ పెద్ద లాంజ్, నాలుగు ఇండివిడ్యువల్ సీట్లు, శవపేటికను పెట్టడానికి ప్రత్యేకమైన రూమ్ మరియు వెనుక భాగంలో పుష్పగుచ్చాలను ఉంచేందుకు ప్రత్యేకమైన స్థలం ఉండేది.

హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

కాగా, ఇప్పుడు ఎయిర్‌స్ట్రీమ్ ఎక్సెల్లా 280 ఫ్యూనరల్ కోచ్‌ను ప్రత్యేకమైన వాంపైర్ (పిశాచపు) థీమ్‌తో మొబైల్ ఎస్కేప్ రూమ్‌గా మార్చారు. ఇదొక భయంకరమైన గేమ్ థీమ్ అనుభవాన్ని కల్పిస్తుంది. ఇందులో ఒక్కసారి ఆరుగులు ఆటగాళ్లకు ప్రవేశం ఉంటుంది. ఈ గేమ్ రూమ్ నుండి వారు తప్పించుకోవడానికి ఒక్కొక్కరికి 40 నిమిషాల సమయం ఉంటుంది.

MOST READ:లాక్‌డౌన్ రూల్స్ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కొడుకు.. ఎవరో తెలుసా..?

హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

ఈ 40 నిమిషాల వ్యవధిలో వారు ఈ గేమ్ రూమ్ నుండి తప్పించుకోలేకపోయినట్లయితే, వారు వ్యాంపైర్ (పిశాచానికి) దొరికిపోతారు. వళ్లు గగుర్పొడిచే ఈ అడ్వెంచర్ గేమ్‌కు వాంపైర్ లైర్ అని పేరు పెట్టారు. ఈ మొబైల్ ఎస్కేప్ రూమ్ యొక్క కొత్త యజమానికి ఆటను అమలు చేయడానికి శిక్షణ ఇవ్వబడుతుంది మరియు దాని యొక్క అన్ని మార్కెటింగ్ మరియు ప్రకటనల సామగ్రిని కూడా ఇవ్వడం జరుగుతుంది.

హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

గత 1982 కాలంలో అంత్యక్రియల కోచ్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ ఎక్సెల్లా 280 ఫ్యూనరల్ కోచ్, బాడీ మరియు ఇంటీరియర్స్ పరంగా ఇప్పటికీ మంచి కండిషన్‌లో ఉంది. అయితే, ఇది యాంత్రికంగా నడవదు. దీనిని కొనుగోలు చేసే కస్టమర్ తన ప్రాంతానికి దీనిని టోయింగ్ చేసుకొని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఐదారేళ్ల క్రితం ఇందులోని ఇంజన్ పనిచేసే కండిషన్‌లో ఉండేది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

ఎక్సెల్లా 280 ఫ్యూనరల్ కోచ్‌లో 454 వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీనిని 28 అంగుళాల పొడవైన షెవర్లే పి30 ట్రక్ చాస్సిస్ మీద నిర్మించారు.

హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

ఈ అంత్యక్రియల కోచ్‌లో సాంప్రదాయకమైన షవర్, పూర్తి వంటగది, జంట పడకలు, సోఫా బెడ్, వాష్ రూమ్స్, ఏసి మరియు హీటర్ సౌకర్యం మొదలైన వసతులను కలిగి ఉంటుంది. మొబైల్ ఎస్కేప్ గదిలో కూడా ఇవన్నీ చెక్కుచెదరకుండా అలానే ఉంచారు. అయితే, ఈ గేమ్ ఆడాలనుకునే వారు మాత్రం పూర్తి గుండె ధైర్యంతో ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

Image Courtesy: Sam T'ang/Facebook

Most Read Articles

English summary
1980s Airstream Funeral Coach Transformed Into A Haunting Game Room, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X