భళా భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం.. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై తొలిదశ ట్రయల్ రన్‌ని భారతీయ రైల్వే (Indian Railways) విజయవంతంగా పూర్తి చేసింది. టెస్టింగ్ సమయంలో రైల్ ఇంజిన్ పూర్తి వంతెనను సాఫీగా దాటింది. ఈ మార్గం భారతదేశంలో కీలకమైన రైల్వే లైన్‌గా మారడానికి ఇప్పుడు సిద్ధంగా ఉందని రైల్వే శాఖ భావిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. టెస్ట్ రన్ సక్సెస్ కావడంతో త్వరలోనే ఈ మార్గంలో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాశ్మీర్‌ను భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేలా నూతనంగా నిర్మించింది. ఈ అద్భుత ఘట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపేలా రైల్వే లైన్‌లను భారతీయ రైల్వే వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగా కాశ్మీర్ ప్రాంతానికి రైల్ కనెక్టివిటీని దగ్గర చేయడానికి ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లాను కలుపుతూ కొత్త రైల్వే లైన్‌ని నిర్మించింది. రెండు పర్వతాల మధ్య లోతైన లోయ గుండా ప్రవహించే చీనాబ్ నదిని దాటడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంది. దీంతో ఈ నదిని దాటేందుకు భారీ ఎత్తులో వంతెనను నిర్మించారు.

సెమీసర్కిల్ ఆకారంలో పిల్లర్లు, కింది వరకు స్తంభాలు ఎలాంటి స్థంభాలు లేకుండా కేవలం రెండు కొండల మధ్య మాత్రమే స్థంభాల సహకారంతో వంతెనను డిజైన్ చేశారు. నది నుంచి సుమారు 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ఈ ఎత్తు పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. ఇందులో రైల్వే ట్రాక్‌లు మరియు విద్యుత్ లైన్లు ఉన్నాయి.
సంకల్దాన్ నుంచి రైసీ వరకు మొదటి ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బ్రిడ్జిపై రైలు వెళ్తున్న వీడియోను ఆయన ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేశాడు. ఈ ట్రయల్ రన్ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ జర్నీ ప్రయాణికులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. హిమాలయ కొండలు, నదికి భారీ ఎత్తులో ఉండటం వల్ల బెస్ట్ టూరిజం జర్నీ స్పాట్‌గా మారే అవకాశం ఉంది.

ఈ మార్గంలో రైలు సర్వీసుల కోసం అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. దీనికిి తోడు ప్రపంచంలోనే ఆకట్టుకునే విధంగా ఈ వంతెనను నిర్మించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపే అవకాశం ఉంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో గణనీయమైన టిక్కెట్ బుకింగ్స్ వస్తాయని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకు తగినట్లు సర్వీసులు నడపనున్నారు.
అత్యంత ఎత్తైన వంతెనపై మన ఫేవరెట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే పరుగులు పెట్టనుంది. కొత్తగా పూర్తయిన ఈ వంతెన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోనుంది. అన్ని ట్రయల్ దశలు పూర్తయిన తర్వాత, ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025లో రైళ్లు ఈ వంతెనపై నడవడం ప్రారంభమవుతాయి. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని భారతీయ రైల్వేల ఛాలెంజింగ్ తీసుకుంది. తాజాగా టెస్ట్ రన్ పూర్తితో రికార్డు తిరగరాసింది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








