20లక్షల బైక్ అయినా రూ.5ల నిమ్మకాయతో పూజ చేయాల్సిందే.. బిలియనీర్ అయినా మన సంప్రదాయం మర్చిపోరు
'ధూమ్' సినిమా రాకముందు చాలా మంది భారతీయులకు సుజుకి హయబుసా అనే మోటార్‌సైకిల్ గురించి పెద్దగా పరిచయం లేదు. ఆ సినిమాలో విలన్‌గా నటించిన జాన్ అబ్రహంతో పాటు ఈ జపనీస్ సూపర్ బైక్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 'ధూమ్' సినిమా తర్వాత సుజుకి హయబుసా భారతీయ మార్కెట్‌లో బాగా పాపులర్ అయింది.
సాధారణంగా ఈ ఖరీదైన సూపర్ బైక్‌ను పురుషులే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ ఉమెన్ సుజుకి హయబుసాను కొనుగోలు చేశారు. దాని గురించి వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

కొత్త సుజుకి హయబుసాను పూజ కోసం గుడికి తీసుకువచ్చిన వీడియో the_petrol_girl అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కనిపించింది. ఇది బిజినెస్ ఉమెన్ కింటూ సింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్. కొత్త హయబుసా డెలివరీ తీసుకుంటున్న మరో వీడియోను కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాధారణంగా బిజినెస్ చేసే మహిళలకు కార్లంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ కింటూ మాత్రం దీనికి పూర్తి భిన్నం.
బైక్‌లంటే చాలా ఇష్టపడే ఆమెకు ఒక బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్ బైక్ కూడా ఉంది. దీని ధర దాదాపు రూ.3.70 లక్షలు. ఈ బైక్‌లో 313సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 34 బీహెచ్పీ పవర్‌ను, 28 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇప్పుడు భారతీయ సూపర్ బైక్‌లలో ఒకటైన సుజుకి హయబుసాను కూడా తన బైక్ కలెక్షన్‌కు చేర్చుకుంటున్నారు కింటూ. బీఎండబ్ల్యూ జి 310జీఎస్ బైక్ కంటే హయబుసా ధర చాలా ఎక్కువ. బైక్ కొన్న తర్వాత దానిని గుడికి తీసుకెళ్లి హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. లక్షలు ఖర్చు చేసి కొన్న బైక్‌ను కింటూ సింగ్ గుడికి తీసుకెళ్లి పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
కొత్త వాహనం కొన్నప్పుడు చాలా మంది చేసే విధంగానే కింటూ కూడా ముందు టైర్‌కు ముందు నిమ్మకాయలు పెట్టి వాటి మీదుగా బైక్‌ను తొక్కించారు. లక్షలు పోసి కొన్న బైక్ అయినా పూజ చేయడానికి మాత్రం ఐదు రూపాయల నిమ్మకాయలు సరిపోయాయి. కొత్త వాహనం కొన్నప్పుడు టైర్‌కు కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారో అందరికీ తెలిసిందే.

సుజుకి హయబుసా బైక్ గురించి మాట్లాడితే.. దీని బేస్ వేరియంట్ ప్రస్తుత ధర భారతీయ మార్కెట్‌లో రూ.16.90 లక్షలు. అదే సమయంలో, టాప్-ఎండ్ వేరియంట్‌ను సొంతం చేసుకోవడానికి రూ.17.70 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఈ బైక్‌ను రోడ్డు మీదకు తీసుకురావడానికి టాక్స్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి దాదాపు రూ.19 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అవుతుంది.
సుజుకి హయబుసాలో 1,340సీసీ ఇంజన్ అమర్చబడి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190 పీఎస్ పవర్‌ను, 150 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (S.I.R.S.)తో హయబుసా వస్తుంది.

ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా ఉంటాయి. కొన్ని వారాల కిందట 2025 మోడల్ ఇయర్ అప్‌డేట్‌లో భాగంగా బైక్‌కు కొత్త కలర్స్ చేర్చారు. 2025 మోడల్ మెటాలిక్ మాట్ స్టీల్ గ్రీన్/మెటాలిక్ మాట్ టైటానియం సిల్వర్, మెటాలిక్ మిస్టిక్ సిల్వర్/పెర్ల్ విగోర్ బ్లూ, రిఫ్రెష్డ్ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ అనే మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ కలర్స్‌లో మెటాలిక్ మాట్ స్టీల్ గ్రీన్ కొత్తగా చేర్చారు. దాంతోపాటు లాంచ్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా అప్‌డేట్ చేశారు. క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌లో కూడా అప్‌డేట్ ఇచ్చారు. రైడర్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్ ఉపయోగించి గేర్ మార్చినా క్రూయిజ్ కంట్రోల్ ఆఫ్ అవ్వదు.
ఇండియాలో మహిళలు సుజుకి హయబుసా బైక్ కొనడం తక్కువే అయినప్పటికీ, ఈ మోడల్‌ను కొన్న మొదటి మహిళ కింటూ కాదు. ఇంతకు ముందు, జస్‌వీందర్ కౌర్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సుజుకి హయబుసా బైక్‌ను సొంతం చేసుకున్నారు. 264 కిలోల బరువున్న హయబుసా వంటి హెవీ సూపర్ బైక్‌లను నడపడానికి ఎక్కువ మంది మహిళలు ముందుకు రావడం చాలా మంచి పరిణామంగా చెప్పొచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








