రూ.3 కోట్ల విలువైన లేటెస్ట్ ఫెరారీని బుక్ చేసిన ఇమ్రాన్ ఖాన్

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ఓ లేటెస్ట్ ఫెరారీ కారును బుక్ చేసినట్లు సమాచారం. ఈ కారు విలువ సుమారు రూ.3 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ ఫెరారీ కారు అంటే, ఫెరారీ ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారు "ఫెరారీ ఎఫ్ఎఫ్" అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కారు విలువ కూడా సుమారు మూడు కోట్ల రూపాయలు.
ఇమ్రాన్ ఖాన్ దగ్గర అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. 2008లో ఇమ్రాన్ ఖాన్ సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు అతని మామ (అమీర్ ఖాన్) ఓ బిఎమ్‌డబ్ల్యూ కారుతో పాటు, ఒక పోర్షే ఎస్‌యూవీ, గడచిన సంవత్సరంలో ఇమ్రాన్ ఖాన్ భార్య బహుమతిగా ఇచ్చిన ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారు కూడా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో "మేరీ బ్రదర్ కి దుల్హన్" అనే చిత్రంలో ఇమ్రాన్ ఖాన్ ఓ స్కూటర్‌ను నడిపే సన్నివేశం చిత్రీకరించబడింది.
ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఇచ్చి ఓ ఇంటర్వ్యూలో ఇకపై తాను నటించే చిత్రాల్లో ఫెరారీ కారు ఉంటే మాత్రమే నటిస్తానని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే మన జూనియర్ ఖాన్ కోట్లతో డీలింగ్ చేస్తున్నాడంటే ఇక ముందు ముందు రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టించనున్నాడో.. మీరేమంటారు..??


Click it and Unblock the Notifications








