ఈ కారు మెర్సిడెస్ బెంజ్ అనుకుంటే పొరబడినట్లే.. టాటా సుమో టు G63 AMG వెర్షన్ ఇలా.!!
మెర్సిడెస్ బెంజ్.. ఈ పేరులోనే లగ్జరీ ఉంది. అందుకే సెలబ్రిటీల, ధనవంతుల హాట్ ఫేవరెట్‌గా ఈ కారు నిలిచింది. దేశంలో దాదాపుగా ప్రముఖ సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ధనవంతుల గ్యారేజీల్లో బెంజ్ కారు ఖచ్చితంగా ఉంటుంది. అంతగా ఈ కారు భారత్‌లో ఆదరణ పొందుతోంది.
జర్మనీకి చెందిన మెర్సిడెస్ లగ్జరీ కార్ మేకర్స్ నుంచి Mercedes-Benz G63 AMG ప్రసిద్ధి చెందిన SUV. దీని ధర రూ. 3.30 కోట్ల పైనే ఉంది. వేరియంట్లను బట్టి ధర మారుతూ ఉంటుంది. కాగా ఇటీవల ఈ కారుకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. పాత 2005 మోడల్ టాటా సుమో కారును మెర్సిడెస్ బెంజ్ జి- వ్యాగన్‌గా మార్చారు.

తక్కువ ధరలో లభించే కార్లను కొందరు ఔత్సాహికులు మరింత తక్కువ ఖర్చులో దాని లుక్‌ను పూర్తిగా ప్రీమియంగా మార్చేశారు. ఇంకో విధంగా చెప్పాలంటే అచ్చంగా లగ్జరీ కారును తలపించేలా పాత కార్లను విలాసవంతమైన కార్లుగా మారుస్తున్నారు. సడెన్‌గా చూసిన వారు ఖరీదైన లగ్జరీ కారు అంటే ఈజీగా నమ్మాల్సిందే..
కాగా పాత టాటా సుమోను Mercedes-Benz G63 AMGగా మార్చిన వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. కారు బయట వైపు, లోపల వైపు మెర్సిడెస్ బెంజ్‌లా కనిపించేలా తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన చేసిన ప్రయత్నాలను, టాటా సుమో కారుపై చేసిన మార్పులను ప్రెజెంటర్ వివరించారు.

వీడియోను చూసినట్లయితే ముందుగా కారు ముందు భాగం నుంచి ప్రారంభించారు. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియాను చూడవచ్చు. టాటా సుమో ఫ్రంట్ గ్రిల్, హెడ్‌లైట్ సరౌండ్‌లు, ఫ్రంట్ బంపర్, ఇండికేటర్, బానెట్‌ను పూర్తిగా మార్చారు. వాటన్నిటినీ మెర్సిడెస్ జి-వాగన్ లాగా కనిపించేలా మార్పులు చేశారు. వీటన్నిటినీ మెటల్‌తో తయారుచేసినట్లుగా చెప్పుకొచ్చారు.
తర్వాత టాటా సుమో సైడ్ ప్రొఫైల్‌ను పరిశీలించినట్లయితే.. కారు ముందు భాగం లాగానే, సైడ్ ప్రొఫైల్ కూడా G-Wagen లా కనిపించేలా మార్పులు చేశారు. ఇక్కడ కస్టమ్ మెటల్-ఫాబ్రికేటెడ్ ఫ్రంట్, రియర్ ఫెండర్‌లు, అలాగే సైడ్ స్కర్ట్‌లతో ఫినిష్ చేశారు. టాటా సుమో మెర్సిడెస్ బెంజ్‌లా స్పోర్టివ్‌గా కనిపించేలా రూఫ్, దిగువ భాగంలో కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ చేసినట్లు చెప్పారు.

చివరగా మార్పులు చేసిన టాటా సుమో వెనుక భాగానికి వెళ్లినట్లయితే.. ఇక్కడ చెప్పుకోదగిన మార్పులు చేయలేదని ప్రెజెంటర్ వెల్లడించారు. రియర్ బంపర్‌ను ఫ్రంట్ బంపర్ మాదిరిగా మెటల్‌తో మోడిఫై చేశారు. వెనుక టెయిల్‌లైట్లను కూడా మెర్సిడెస్ బెంజ్ మాదిరి మార్చారు. ఇంకా స్పేర్ టైర్ కవర్‌ను కూడా మార్చారు. దానిపై Mercedes Benz లోగోను ఏర్పాటు చేశారు.

ఇక ఇంటీరియర్ విషయానికొస్తే 2005 టాటా సుమోలో ఉన్న డ్యాష్‌బోర్డునే మాడిఫికేషన్‌లోనూ చూడవచ్చు. వైట్ అండ్ బ్లాక్ కలర్‌లో ఇంటీరియర్‌ను ఆకర్షణీయంగా మార్చారు. ఫీచర్ల విషయానికి వస్తే రెండు స్పీకర్లను ఇందులో అమర్చారు. ఆఫ్టర్ మార్కెట్ నుంచి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు భాగంలో ఎలక్ట్రిక్ సీట్లు, కస్టమ్-మేడ్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ను పొందుపరిచారు.

సాధారణంగా పాత టాటా సుమో 7 సీటర్‌తో ఉన్నప్పటికీ మెర్సిడెస్ బెంజ్‌లా మార్చేందుకు మధ్య సీట్లను తొలగించారు. రెండో వరుసలో పర్సనల్ ఆర్మ్‌రెస్ట్‌లతో సీట్లను ఏర్పాటు చేయగా.. మూడో వరుసలో కేవలం రెండు కెప్టెన్ సీట్లను ఏర్పాటు చేశారు. ఇంకా కారుపైన అధునాతనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను జోడించారు. ఈ మార్పులతో 2005 టాటా సుమో.. మెర్సిడెస్ బెంజ్ g63 amg లా లగ్జరీ కారులా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








