2013 గోల్డ్‌రష్ ర్యాలీ 5: శాన్ ఫ్రాన్సిస్కో టూ చికాగో
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డ్‌రష్ ర్యాలీ నేడు ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ కస్టమైజ్డ్ కార్లు, పలు సూపర్ కార్లతో పాటు సూపర్ మోడళ్లు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. 2013 ఎడిషన్ గోల్డ్రష్ ర్యాలీ జూన్ 8, 2013 శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్, డల్లాస్, మెంఫిస్, సెయింట్ లూయిస్ మీదుగా ప్రయాణించి జూన్ 15, 2013న చికాగోలో ముగుస్తుంది.
ఇప్పటి వరకు నాలుగు సక్సెస్‌ఫుల్ గోల్డ్‌రష్ ర్యాలీ సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్నది 5 సీజన్. ఈ ర్యాలీ ప్రారంభమైన కేవలం నాలుగు నెలల్లోనే ఇది ప్రీమియం లైఫ్‌స్టయిల్ ర్యాలీగా పేరు దక్కించుకుంది. బెంట్లీ, మెక్‌లారెన్, బుగాటి, ఫెరారీ, చెవర్లే, మెర్సిడెస్, ఆడి, నిస్సాన్, ఫోర్డ్, లోటస్, పోర్షే, రోల్స్ రాయిస్, లాంబోర్గినీ, మాసరేటి, రేంజ్ రోవర్, టెస్లా, స్పోర్ట్‌ఛాస్సిస్, ఆస్టన్ మార్టిన్, బిఎమ్‌డబ్ల్యూ తదిత బ్రాండ్‌లకు చెందిన అనేక లగ్జరీ కార్లు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి.
గోల్డ్‌రష్ ర్యాలీ 2013లో దేశవిదేశాలకు చెందిన అనేక మంది రేస్ ప్రియులు ఇందులో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి పలువులు ప్రముఖులు అథిదులుగా విచ్చేయనున్నారు. మరి ఈ ర్యాలీ హైలైట్స్‌ను మనం కూడా ఓ లుక్కేద్దామా..?









































Click it and Unblock the Notifications








