2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా, దేశీయ మార్కెట్లో ఇటీవల కొత్త 2021 హయాబుసాను విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ 2021 సుజుకి హయాబుసా ధర 16.40 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఎంతోమంది వాహనప్రియుల మనసు దోచింది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో ఈ బైక్ విడుదలైన వెంటనే మొదటి బ్యాచ్ మొత్తం అమ్ముడయ్యింది. డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి.

2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

ఇటీవల సుజుకి హయాబుసా డెలివరీకి సంబంధించి ఒక వీడియో బయటపడింది. ఇందులో 2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మోటది మహిళను చూడవచ్చు. ఈ వీడియోను బార్డ్ బైకర్ అనే ఛానెల్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. వీడియోలో వ్లాగర్ తన భార్యను కొత్త సూపర్ బైక్‌తో ఉండటం చూడవచ్చు.

2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

యూట్యూబర్ భార్య పేరు అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే హయాబుసా మొదటి మహిళా ఓనర్ పేరు అంకితా ఖన్నా. మొదట ఈమె తన భర్త కోసం కొత్త 2021 సుజుకి హయాబుసా కొనుగోలుచేసినట్లు తెలియదు. కానీ చివరకు డెలివరీ సమయంలో తెలిసింది. దేశీయ మార్కెట్లో హయాబుసా కేవలం 101 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఈ బైక్ కేవలం రెండు రోజుల్లో మొత్తం అమ్ముడైపోయాయి.

2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

కొత్త 2021 సుజుకి హయాబుసా మూడు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోస్ స్పార్క్లీ బ్లాక్ / కాండీ బర్న్ట్ గోల్డ్, మెటాలిక్ మాట్టే స్వోర్డ్ సిల్వర్ / కాండీ డేరింగ్ రెడ్ మరియు పెర్ల్ బ్రిలియంట్ వైట్ / మెటాలిక్ మాట్టే స్టెల్లార్ బ్లూ కలర్స్.

2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

ఈ 2021 హయాబుసాలో ఇప్పుడు ఆల్‌రౌండ్ ఎల్‌ఇడి లైటింగ్ ఉంది. టర్న్ ఇండికేటర్లను ఇప్పుడు ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి.

2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

ఈ మోటారుసైకిల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. అప్డేట్ చేయబడిన ఇంజిన్ ఇప్పుడు తేలికైన పిస్టన్లు, కొత్త కనెక్ట్ రాడ్లు మరియు ఇతర రీ-ఇంజనీరింగ్ అంతర్గత భాగాలను కలిగి ఉంది.

2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

ఇందులో ఉన్న ఇంజిన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 187.7 బిహెచ్‌పి మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త 2021 హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం అవుతుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 299 కి.మీ వరకు ఉంటుంది.

2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

ఈ కొత్త బైక్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10 లెవెల్స్ అడ్జస్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ సిస్టమ్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త టిఎఫ్‌టి డిస్ప్లే సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.

హయాబుసా బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్‌, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్‌తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మీద 120/70 సెక్షన్ మరియు 190/50 సెక్షన్ టైర్లను ముందు మరియు వెనుక భాగంలో కలిగి ఉంటుంది.

2021 సుజుకి హయాబుసా కొనుగోలు చేసిన మొదటి మహిళ [వీడియో]

ఈ కొత్త మోటారుసైకిల్ 20-లీటర్స్ సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. 2021 హయబుసా ఇప్పుడు మరింత దూకుడుగా కనిపిస్తుంది. అంతే కాకుండా అప్‌గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో చాలా సేఫ్టీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Image Courtesy: Beard Bikerr

More from DriveSpark

Article Published On: Thursday, June 17, 2021, 18:05 [IST]
English summary
First Woman To Take Delivery Of 2021 Suzuki Hayabusa. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+