వావ్.. జియో సినిమాలో ప్రపంచ పోటీలను ఫ్రీగా వీక్షించవచ్చు..

ఈ వారాంతంలో పోర్చుగీస్ MotoGP ప్రారంభం కానుంది. ఈ రేసింగ్ కు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రీమియర్-క్లాస్ ఛాంపియన్‌షిప్ ఆకర్షణీయమైన సీజన్ కోసం మరింత ఉత్సాహంగా సాగనుంది. ఇది ముగిసిన వెంటనే ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రపంచ MotoGP రేసింగ్ జరగాల్సి ఉంది. తాజాగా ఈ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ సంస్థం సొంతం చేసుకుంది.

టెలివిజన్ తో పాటు మొబైల్ స్ట్రీమింగ్ హక్కులను Viacom 18తో సొంతం చేసుకుంది. దీంతో Viacom18 MotoGPని ప్రత్యేకంగా ప్రసారం చేయనుంది. JioCinema యాప్‌లోని Sports18 TV ఛానెల్‌లో ఈ లైవ్ ఛాంపియన్‌షిప్‌ను వీక్షించవచ్చు. డిస్కవరీ నెట్‌వర్క్‌లో భాగమైన యూరోస్పోర్ట్‌లో ఛాంపియన్‌షిప్ గతంలో ప్రసారం చేయబడింది. భారీ నెట్ వర్క్ కల్గిన వయాకామ్ తో స్ట్రీమింగ్ అందుబాటులో ఉండటం ఈ రేసింగ్ కు కలిసిరానుంది.

మోటో జీపీ

వీకెండ్ లో ఫుల్ రేస్ ..

శుక్రవారం, శనివారం ప్రాక్టీస్ సెషన్‌లు, శనివారం క్వాలిఫైయింగ్, స్ప్రింట్ రేస్ ఆదివారం జరిగే ప్రధాన రేసు యొక్క సమగ్ర ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తామని నెట్‌వర్క్ హామీ ఇచ్చింది. JioCinema యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉచితం. ఇది iOS, Android మొబైల్స్ లో ఉపయోగించవచ్చు. యాప్ స్మార్ట్‌ఫోన్ పరికరాలతో పాటు స్మార్ట్ టీవీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు కేబుల్ కనెక్షన్ లేకపోయినా మీరు టీవీలో MotoGPని చూడవచ్చు.

భారతదేశంలో MotoGPకి చాలా మంది అభిమానులు ఉన్నారని.. వారికి రేసింగ్ ను మరింత దగ్గర చేయటానికి సంతోషిస్తున్నామని ఇంటర్నేషనల్ డోర్నా స్పోర్ట్ CEO కార్మెలో ఎజ్పెలెటా తెలిపారు. భారతదేశం కూడా మోటార్‌సైకిల్ పరిశ్రమకు కీలకమైన మార్కెట్‌గా ఉందని ఆయన అన్నారు. మోటోజీపీ ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిందని దీనిని భారతదేశం అంతటా తీసుకువెళ్లేందుకు వయాకామ్ తో జతకట్టడం ఆనందంగా ఉందని ఆయన వివరించారు.

మోటోజీపీ

జియో ఓటీటీ ద్వారా ఫ్రీగా..

భారతదేశంలో MotoGPని ప్రదర్శించడానికి Viacom18 అనువైన భాగస్వామి అని మేము విశ్వసిస్తున్నామని ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ COO పుష్కర్ నాథ్ శ్రీవాస్తవ తెలిపారు. టెలివిజన్, OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ నెట్ వర్క్ కి విస్తృతమైన పరిధి ఉందని చెప్పారు. ఇలాంటి క్రీడలను ప్రారంభించడం ప్రోత్సహించడంలో వారి నిబద్ధతను ఆయన కొనియాడారు.

దేశంలో MotoGP చారిత్రాత్మక అరంగేట్రం కోసం వయాకామ్ తో జట్టు కట్టడం మంచి నిర్ణయమని చెప్పారు. పెరిగిన యాక్సెసిబిలిటీ మన యువతను ఉత్తేజపరిచేందుకు ప్రపంచ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కొత్త తరం ప్రతిభావంతులైన రైడర్‌లను రూపొందించడంలో సహాయపడుతుందిని అన్నారు.

మోటోజీపీ

పెరగనున్న ఫ్యాన్స్..

2023 MotoGP సీజన్‌లో 11 జట్లు 22 రైడర్‌లు ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోరాడుతారు. డుకాటీ ఫ్రాన్సిస్కో బగ్నాయా డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్‌ను తిరిగి కైవసం చేసుకోవడం యమహా, హోండా మరియు వంటి వారికి చాలా పెద్ద పనిగా ఉంది. ఈ సీజన్‌లో శనివారం జరిగే స్ప్రింట్ రేసుల భావనను కూడా తీసుకువస్తుంది. ప్రధాన రేసులో సగం దూరాన్ని కవర్ చేస్తుంది. స్ప్రింట్ రేస్ ఫలితాలు రైడర్‌లకు కీలకమైన పాయింట్‌లను కైవసం చేసుకోవడానికి మరొక అవకాశంగా ఉంటాయి.


డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


More from DriveSpark

Article Published On: Friday, March 24, 2023, 19:59 [IST]
English summary
2023 motogp live streaming through viacom18 network here the full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+