స్విఫ్ట్‌ కారుకి యాక్సిడెంట్‌.. లారీ లోడు మీద పడినా చెక్కుచెదరని కారు.. వీడియో వైరల్‌!

మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న కార్లు సేఫ్టీలో ఏమాత్రం సురక్షితం కాదని జనాల్లో ఓ భావన ఉంది. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఆ సంస్థ మారుతి సుజుకి డిజైర్‌ని అత్యున్నత ప్రమాణాలతో తీసుకువచ్చింది. మారుతి నుంచి ఈ కారు తొలిసారి సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే దీనికి బ్రదర్‌ కారుగా పిలుస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 2024 సుజుకి స్విఫ్ట్‌ ఏమాత్రం చెక్కుచెదరలేదు. పెద్ద ఇటుకలు కారుపై పడినా ఏమాత్రం డ్యామేజీ జరగలేదు. ఈ విజువల్స్‌ ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆ యాక్సిడెంట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఇటుక లోడుతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు స్విఫ్ట్ కారుపై పడినప్పటికీ కారు చిన్నపాటి డ్యామేజీ మాత్రమే జరిగింది. స్విఫ్ట్ కారుపై ట్రక్కు నుంచి ఇటుకలు పడిపోతున్న వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఓ ప్రదేశంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ఈ కారు ఓ కొత్త మోడల్‌ కారుగా కనిపిస్తోంది. అప్పుడే డెలివరీ తీసుకుని వస్తునట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది.

Maruti Suzuki Swift Safety Features

ఈ కొత్త మారుతి స్విఫ్ట్ బిల్డ్ క్వాలిటీని తెలిపే ఈ వీడియోను డ్రిఫ్ట్‌ ఎక్స్‌పీ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ఇటుకలతో నిండిన లారీ స్విఫ్ట్ కారుపై బోల్తా పడిన తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండటం గమనించవచ్చు. ట్రక్కు నుంచి కింద పడుతున్న ఇటుకలు డైరెక్ట్‌గా కారు పైకప్పు, బానెట్‌పై పడటం వీడియోలో కనిపిస్తోంది.

ఈ ప్రమాదంలో ఇటుకలన్నీ పైభాగంలో బోల్తా పడటంతో కారు ముందు, వెనక అద్దాలు ధ్వంసమయ్యాయి. పైకప్పు కూడా పూర్తిగా ధ్వంసమైంది. అయితే మిగిలిన కారుకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ‌అందువల్ల కారు క్వాలిటీపై పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదంలోనూ స్విఫ్ట్‌ తట్టుకుని నిలబడింది. ఈ వీడియోను ఎక్కడి నుంచి తీశారో, ప్రమాద సమయంలో కారులో ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని మాత్రం వీడియోలో పేర్కొనలేదు.

Maruti Suzuki Swift Build Quality

అయితే నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా కార్ల క్రాష్ టెస్ట్ ఫలితాలు కొత్త హైప్స్‌ని పెంచుతున్నాయి. వీటిలో డిజైర్‌ ముందు వరుసలో ఉండగా.. ఇప్పుడు స్విఫ్ట్ కూడా అదే ప్లాట్ ఫామ్‌పై నిర్మించిన కారు కావడంతో అదే సేఫ్టీ రేటింగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం స్విఫ్ట్‌ 5 స్టార్‌ రేటింగ్ వస్తే ఇక తిరుగుండదని అనుకుంటున్నారు.

సేఫ్టీ పరంగా ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఇబిడి, బ్రేక్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. అలాగే ఈ కొత్త స్విఫ్ట్ కారును కేవలం రూ. 7 లక్షల కంటే తక్కువ ధరతో మారుతి అందుబాటులో తెచ్చింది. అందువల్ల ఎక్కువ సంఖ్యలో ఈ కారు పాపులారిటీని పొందింది.

డ్రైవ్‌స్పార్క్ ఒపీనియన్: స్విఫ్ట్‌ కారుకి భారత్‌లో మంచి ఆదరణ ఉంది. ఇక సేఫ్టీలోనూ ఈ కారు నిరూపించుకుంటే అమ్మకాల్లో తిరుగుండదు. డిజైర్‌ 5 స్టార్‌ రేటింగ్‌తో స్విఫ్ట్‌ సైతం అదే రేటింగ్‌ని సాధిస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ కారుని సేఫ్టీ రేటింగ్‌కి పంపే అవకాశాలు ఉన్నాయి. అదే జరగితే ఫోర్‌ వీలర్‌ మార్కెట్‌లో స్విఫ్ట్‌ సంచలనం సృష్టించనుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 29, 2025, 19:04 [IST]
English summary
2024 maruti suzuki swift accident video hits internet check crash impact and build quality
Read more on: #offbeat #accident #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+