ఎస్6 సెడాన్, క్యూ3 ఎస్‌యూవీలను విడుదల చేయనున్న ఆడి

ఈ నేపథ్యంలో 2012 సంవత్సరంలో సరికొత్త కార్లను దేశీయ వినియోగదారులకు పరిచయం చేయనుంది. ప్రపంచ మార్కెట్లలో అడి నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన "ఆడి ఎస్6" సెడాన్, "ఆడి క్యూ3" ఎస్‌యూవీలను భారత మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో రెండు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేయనుంది.
ఆడి ఏ6 సెడాన్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసే విషయంపై ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెష్కీ మాట్లాడుతూ.. "భారత మార్కెట్లో ఎస్6ను పరిచయం చేసేందుకు అధ్యయనం జరుగుతోంది. వచ్చే ఏడాది రెండవ త్రైమాసికంలో ఈ కారును విడలచేయాలని మేము యోచిస్తున్నామ"ని అన్నారు. ఇదే కాకుండా, త్వరలోనే క్యూ3 ఎస్‌యూవీని కూడా దేశీయ వినియోగదారులకు పరిచయం చేయనున్నామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








